MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..

Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..

Jabardasth: ఈ టీవీ జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సుధీర్ ను తలుచుకుని రష్మీ బోరున విలపించిన సీన్ కంటతడి పెట్టించింది. ఇంతకీ విషయం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 02 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కన్నుల పండగగా కామెడీ హంగామా
Image Credit : Mallemala Entertainments

కన్నుల పండగగా కామెడీ హంగామా

ఈ ఆదివారం జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ సందడి చేయబోతోంది. అందులో పాత కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సుధీర్, ధనరాజ్, గెటప్ సీను, చంటీ, ఇలా అందరు సందడి చేయడంతో పాటు 13 ఏళ్ల కిందటి జబర్దస్త్ వాతావరణానికి మళ్లీ క్రియేట్ చేయబోతున్నారు. ఈక్రమంలో నాగబాబు, ధనరాజ్, ఇంద్రజల మధ్య జరిగిన సరదా సంభాషణలు నవ్వులు పూయించాయించగా.. తాగుబోతు రమేష్, దీప్తి నల్లమోతు , రోహినీ ల కామెడీ కడుపుబ్బా నవ్వించింది. వీటితో పాటు సుధీర రష్మీల లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా.. రష్మీ సుధీర్ పై చేసిన కామెంట్స్.. ఆమె బోరున విలపించడం అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జబర్ధస్త్ లో ప్రేమ పక్షులుగా పేరు..
Image Credit : Mallemala Entertainments

జబర్ధస్త్ లో ప్రేమ పక్షులుగా పేరు..

బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ గౌతమ్‌ల జంట ప్రేక్షకుల్లో పత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ షో టీఆర్‌పీ రేటింగ్స్‌ను విశేషంగా పెంచడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరు స్కిట్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ పెడితే.. ఆరోజు ఆడియన్స్ కు పండగే.. ఇక ఆతరువాత కాలంలో సుధీర్ వెండితెరపై అవకాశాలు అందుకోవడంతో జబర్దస్త్ నుంచి బయటకు రాగా, రష్మీ యాంకర్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే చాలా విరామం తర్వాత సుధీర్ తిరిగి జబర్దస్త్ వేదికపైకి రావడం, ఆ సమయంలో రష్మీ తీవ్ర భావోద్వేగానికి గురికావడం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

35
జబర్దస్త్‌కు రీ-ఎంట్రీల జోష్
Image Credit : Mallemala Entertainments

జబర్దస్త్‌కు రీ-ఎంట్రీల జోష్

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు రీ-ఎంట్రీతో జబర్దస్త్ షోకి కొత్త కళ వచ్చి చేరింది. ఆయనతో పాటు చంటి, ధనరాజ్, హైపర్ ఆది, సద్దాం వంటి పాత కమెడియన్లు తిరిగి స్టేజ్‌పై అలరిస్తున్నారు. ఈ వరుసలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పైకి అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్అయిన ప్రోమోలో హైపర్ ఆదితో కలిసి సుధీర్ చేసిన స్కిట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్కిట్ ముగింపులో గెటప్ శ్రీను మరింత నవ్వులు పూయించారు.

45
స్టేజ్‌పై ఏడ్చిన రష్మీ గౌతమ్..
Image Credit : Mallemala Entertainments

స్టేజ్‌పై ఏడ్చిన రష్మీ గౌతమ్..

స్కిట్లు ఓవైపు నవ్వులు పూయించినప్పటికీ, ప్రోమో చివర్లో జరిగిన సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. చాలా రోజుల తర్వాత సుధీర్‌ను స్టేజ్‌పై చూడగానే రష్మీ ముఖంలో సంతోషం కనిపించినప్పటికీ, సుధీర్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. జబర్దస్త్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా 'సుడిగాలి సుధీర్ టీమ్' నిలిచిందని పేర్కొన్నారు. కెరీర్‌లో ఉన్నత అవకాశాలు రావడంతోనే సుధీర్ మొదటగా ఈ వేదికను వీడి వెళ్లారని ఇంద్రజ అన్నారు.

రష్మీ మాట్లాడుతూ — "జబర్దస్త్ వేదికపై మేమిద్దరం ఒకే రోజు అడుగుపెట్టాం, కానీ తను నన్ను వదిలి ముందుకు వెళ్లాడు" అంటూ సుధీర్ జ్ఞాపకాలను తలుచుకుని ఏడ్చేసింది.

55
ఆడియన్స్ లో పెరుగుతున్న ఆసక్తి:
Image Credit : Mallemala Entertainments

ఆడియన్స్ లో పెరుగుతున్న ఆసక్తి:

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రష్మీ మాటలకు సుధీర్ ఎలాంటి రిప్లే ఇచ్చాడు, వీరిద్దరి మధ్య ఎలాంటి ఎమోషనల్ సంభాషణ జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఈ ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిరంతరం కామెడీని అందించే జబర్దస్త్ వేదికపై ఈ తరహా భావోద్వేగ సన్నివేశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ద్రోహం చేసిన సురేఖ, పవర్ స్టార్ జీవితాన్ని మలుపు తిప్పిన చిరంజీవి భార్య
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved