- Home
- Entertainment
- న్యూడ్ ఫోటో షూట్‌తో షాకిచ్చిన స్టార్ హీరో.. ఇంటర్నెట్ బ్రేక్.. పాపం దీపికా అంటూ సెటైర్లు
న్యూడ్ ఫోటో షూట్‌తో షాకిచ్చిన స్టార్ హీరో.. ఇంటర్నెట్ బ్రేక్.. పాపం దీపికా అంటూ సెటైర్లు
బాలీవుడ్ స్టార్ హీరో.. సెన్సేషన్‌కి కేరాఫ్‌గా నిలిచే రణ్ వీర్ సింగ్ ఉన్నట్టుండి పెద్ద షాకిచ్చారు. ఆయన ఇంటర్నెట్‌ని ఒక్కసారిగా బ్రేక్ చేశారు.న్యూడ్ ఫోటో షూట్‌తో బాలీవుడ్ వర్గాలను ఉలిక్కిపాటుకు గురి చేశారు.

రణ్‌వీర్ సింగ్(RanVeer Singh).. దీపికా పదుకొనె భర్త అనే విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఆయనకు పేరుంది. మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన పని బాలీవుడ్ మొత్తం షాక్ కి గురి కావడం గమనార్హం. ఇక అభిమానులు, నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.
రణ్ వీర్ సింగ్ తాజాగా ఓ మేగజీన్ కోసం న్యూడ్ ఫోటో షూట్(RanVeer Singh Nude Photo Shoot) చేశారు. ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా ఫోటోలకు పోజులిచ్చారు. నిర్మొహమాటంగా ఆయన ఇలాంటి హాట్ పోజులివ్వడంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక లేడీ అభిమానులకైతే మైండ్ బ్లాంక్ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
రణ్ వీర్ సింగ్ `పేపర్` మేగజీన్(Paper Magazine) కోసం ఇలా న్యూడ్ పోజులిచ్చారు. ఈ సందర్భంగా బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు రణ్ వీర్ సింగ్. `నేను శరీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. కానీ నా కొన్ని ప్రదర్శనలలో నేను నగ్నంగా ఉన్నాను. మీరు నా ఫకింగ్ ఆత్మని చూడొచ్చు. అదే అసలైన నగ్నత్వం. నేను వెయ్యి మంది ముందు కూడా నగ్నంగా ఉండగలను. ఆ విషయంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు` అని పేర్కొన్నారు రణ్‌వీర్. ప్రస్తుతం ఆయన పోస్ట్, ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
ఇక రణ్ వీర్ సింగ్ డేర్‌నెస్‌కి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చూడ్డానికి నగ్నంగా కనిపించినా, తనలో ఎలాంటి నగ్నత్వం లేదని అసలైన ఆత్మని చూపించావని, గొప్ప పని చేశావని ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట రణ్ వీర్ సింగ్ హల్‌చల్ చేస్తున్నారు. అయితే దీన్ని భార్య దీపికా పదుకొనె ఎలా ఫేస్ చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొందరైతే `పాపం దీపికా ` అంటూ జాలి చూపిస్తుండటం గమనార్హం.
2010లో `బ్యాండ్ బాజా బారత్` చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రణ్ వీర్ సింగ్, తొలి చిత్రంతోనే హిట్ కొట్టి బాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. `లూటేరా`, `రామ్‌లీలా` చిత్రాలతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
`గుండే`, `కిల్ బిల్`, `ది ధడక్నే దో`, `బాజీరావు మస్తాని`, `బేపిక్రే`, `పద్మావత్`, `సింబా`, `గుల్లీ బాయ్` చిత్రాలతో సూపర్ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో విశేష ప్రశంసలు, అభిమానులను ఏర్పర్చుకున్నారు. `83`లో కపిల్ దేవ్ పాత్రకి ప్రాణం పోశారు. ఇప్పుడు `సర్కస్`, `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని` చిత్రాల్లో నటిస్తున్నారు.