- Home
- Entertainment
- Janaki Kalaganaledu: కౌగిలింతలో జానకి, రామ.. జ్ఞానాంబను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు!
Janaki Kalaganaledu: కౌగిలింతలో జానకి, రామ.. జ్ఞానాంబను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ఉమ్మడి కుటుంబ మధ్య ఉండే ప్రేమ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక రాత్రిపూట జానకి (Janaki) చదువుకుంటూ ఉండగా రామచంద్ర (Ramachandra) తనకి చెమటలు పట్టకుండ టవల్తో గాలి విసురుతాడు. అంతేకాకుండా జానకి కి నిద్ర రాకుండా తానే స్వయంగా టి రెడీ చేస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన జ్ఞానాంబ మరింత నెగిటివ్గా తీసుకుంటుంది.
ఇక మరుసటి రోజు జానకి (Janaki) రామచంద్ర కోసం తాను కూలి పని చేసే దగ్గరికి భోజనం తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) కూడా రామచంద్ర కోసం భోజనం తీసుకొని వెళుతుంది. అంతేకాకుండా ఈ భోజనం నేను తీసుకు వచ్చాను అని చెప్పవద్దు అని ఆ యజమాని తో అంటుంది.
ఇక మధ్యాహ్నం తల్లి తెచ్చిన భోజనం టేస్ట్ చేసిన రామచంద్ర (Ramachandra) జానకి కి ఫోన్ చేసి భోజనం అమృతం లా ఉంది జానకి గారు అంటూ పొగుడుతాడు. మా అమ్మే దగ్గర ఉండి వడ్డీంచినట్టు అనిపిస్తుంది అని అంటాడు. దాంతో దూరంగా ఉండి వింటున్న జ్ఞానాంబ (Jnanamba) ఎంతో ఆనంద పడుతుంది.
ఇక ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanamba) ఈ అమ్మకు నువ్వు దూరంగా ఉండి ఎంత బాధ పడుతున్నావో.. ఈ అమ్మ కూడా నీకు దూరంగా ఉండి అంతే బాధపడుతుంది రామ (Rama) అని అంటుంది. అంతేకాకుండా నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను అని జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత జానకి, రామచంద్ర (Ramachandra) ల ఇల్లు మొత్తం వర్షంలో తడిచి పోతుంది. ఈ క్రమంలో వీరిద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టుకొని ఒకరినొకరు చూసుకుంటారు. ఆ మూమెంట్ లో వీరిద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. ఇక జానకి (Janaki) దంపతులు ఒకరికొకరు కౌగిలించుకుంటారు.
ఇక తరువాయి భాగం లో జ్ఞానాంబ (Jnanamba) దగ్గరకు పోలీసులు వస్తారు. మీ పెద్దకోడలు జానకిని మీరు వేధిస్తున్నారని హింసిస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది అని అంటారు. అందుకని మిమ్మల్ని గృహహింస చట్టం కింద అరెస్టు చేస్తామని ఆ పోలీస్ అంటాడు. దాంతో కుటుంబమంతా ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక మల్లిక (Mallika) మాత్రం ఆనందపడుతుంది.