- Home
- Entertainment
- పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న ప్రభాస్ బ్యూటీ.. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్..
పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న ప్రభాస్ బ్యూటీ.. గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్..
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) ట్రెండీ వేర్ లో మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘సాహో’ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రభాస్ తో గ్లామర్ స్టెప్పులేసి యువతను ఆకట్టుకుంది. ఒక స్పెషల్ సాంగ్ తోనే సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ మరో సౌత్ ఫిల్మ్ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘విక్రాంత్ రోణ’ (Vikranth Rona)లో ఐటెం సాంగ్ లో నటించింది. ఈ చిత్రం అన్ని భాషల్లో రిలీజ్ అవుతుండటంతో జాక్వెలిన్ సౌత్ ఆడియెన్స్ ను మరోసారి అలరించనుంది.
ఈ మూవీ జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగతున్నాయి. ఇటు జాక్వెలిన్ కూడా తనవంతుగా లేటెస్ట్ ఫొటోషూట్లతో చేస్తూ సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
లేటెస్ట్ పిక్స్ లో జాక్వెలిన్ పాలరాతి బొమ్మలా దర్శనమిచ్చింద. స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ లో ప్రకాశవంతంగా కనిపిస్తోంది. గ్లామర్ మెరుపులు వెదజల్లుతూ నెటిజన్లను తనవైపు ఆకట్టుకుంటోంది. తన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. క్యూట్, బ్యూటీఫుల్, గార్జియస్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు.
జాక్వెలిన్ బాలీవుడ్ లో హీరోయిన్ కొనసాగుతూనే.. కేరీర్ ను మరింత బ్రైట్ చేసుకునేందుకు సౌత్ ఫిల్మ్స్ లో వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటోంది. అందుకే గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ నార్త్ తో పాటు సౌత్ లోనూ తన మార్క్ చూపెడుతోంది.
చివరిగా ‘ఎటాక్’ మూవీతో అలరించిన ఈ బ్యూటీ త్వరలో ‘విక్రాంత్ రోణ’తో ఆడియెన్స్ లో జోష్ పెంచనుంది. అలాగే మరో రెండు హిందీ చిత్రాలు ‘సర్కస్, రామ్ సేతు’లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలు శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.