MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు

Pawan - Ravi Teja: పవన్ కళ్యాణ్ చేస్తే ఫ్లాప్, రవితేజ చేస్తే సూపర్ హిట్.. ఒకే కథతో రెండు సినిమాలు

పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలు గతంలో ఒకే తరహా కథతో తెరకెక్కాయి. కానీ రెండు సినిమాల రిజల్ట్స్ వేర్వేరు. ఒక సినిమా ఫ్లాప్ కాగా మరో సినిమా సూపర్ హిట్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 17 2026, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు ఒక ఫార్ములా ప్రకారం ఉండే కథలతో తెరకెక్కుతుంటాయి. ఇప్పుడంటే ఫార్ములా కథలకు ట్రెండ్ పోయింది. కానీ గతంలో సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్, కొన్ని పాటలు, కొన్ని ఫైట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలో చాలా సినిమాల కథలు ఒకే రకంగా అనిపించేవి. కథ మొత్తం కాకున్నా కొన్ని అంశాలు అయినా ఒకేలా అనిపించేవి. కొన్ని సినిమాల కథలు మాత్రం దాదాపు ఒకేలా ఉండేవి. పవన్ కళ్యాణ్, రవితేజ సినిమాలు కూడా ఒకే తరహా కథతో తెరకెక్కి విభిన్న ఫలితాలని అందుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలు మూవీ
Image Credit : Vyjayanthi Movies & KAD Movies

బాలు మూవీ

పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఒక డాన్. హీరోయిన్ మరణంతో మార్పు వస్తుంది. తన ఐడెంటిటీ మార్చుకుని హీరో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో మరో హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ కథ ఆ టైం లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సెట్ కాలేదు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు స్టైలిష్ మూవీస్, యూత్ ఫుల్ చిత్రాలు, లవ్ స్టోరీలు మాత్రమే ఆశించారు.

Related Articles

Related image1
OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Related image2
Srihari: శ్రీహరిని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్, ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?
35
బలుపు మూవీ
Image Credit : Asianet News

బలుపు మూవీ

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో బలుపు చిత్రం తెరకెక్కింది. ఇది కూడా బాలు తరహా కథే. ఫ్లాష్ బ్యాక్ లో రవితేజ డాన్. విలన్లతో గొడవల వల్ల హీరోయిన్ చనిపోతుంది. హీరోయిన్ కోరిక మేరకు గొడవలకు దూరంగా ఉంటూ ఆమె తండ్రితో రవితేజ కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో శృతి హాసన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఈ మూవీలో మాస్ అంశాలు, కామెడీ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

45
అందుకే పవన్ మూవీ ఫ్లాప్
Image Credit : stockPhoto

అందుకే పవన్ మూవీ ఫ్లాప్

దర్శకుడు కరుణాకరన్ మంచి కథని ఎంచుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడని విధంగా స్క్రీన్ ప్లే రూపిందించారు. ఫలితంగా బాలు మూవీ నిరాశ పరిచింది. కానీ గోపీచంద్ మలినేని రవితేజ కోసాం బలుపు చిత్రంలో స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ మూమెంట్స్ రూపొందించారు.

55
తెరకెక్కించిన విధానం వేరు
Image Credit : Asianet News

తెరకెక్కించిన విధానం వేరు

రెండు కథలు ఒకటే అయినప్పటికీ తెరకెక్కించిన విధానం వల్ల బాలు చిత్రం ఫ్లాప్ అయింది. రవితేజ బలుపు మూవీ సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ బాలు చిత్రం 2005 లో రిలీజ్ కాగా.. బలుపు చిత్రం 2013లో రిలీజ్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma Kanakala: యాంకర్‌ సుమ హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు మానేసిందో తెలుసా? ఇది అస్సలు ఊహించరు
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image3
VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
Related Stories
Recommended image1
OTT: చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్ లు ఇవే
Recommended image2
Srihari: శ్రీహరిని గుర్తు చేసుకుంటూ డైరెక్టర్ బాబీ ఎమోషనల్, ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved