Karthika Deepam: ఆ విషయంలో పోలీసులకు పట్టుబడ్డ జ్వాల.. త్యాగం చేసిన ప్రేమ్..?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

హిమ.. జ్వాల (Jwala) నన్ను బాగా చూసుకుంటుంది అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఎంతో సంతోషపడుతుంది. అంతేకాకుండా ఐయామ్ తింగరి అంటూ గంతులేస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడకు సౌందర్య (Soundarya) రాగ నేను తింగరి.. నువ్వు ముసలి తింగరి అని హిమ సౌందర్య ను కూడా అంటుంది.
మరోవైపు నిరూపమ్ (Nirupam) ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సౌర్య కోసం హిమ వెతకడానికి చాలా ప్రయత్నిస్తుంది. దానికి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. మరి మీరు దీని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆనంద్ రావ్ (Anand Rao) ను అడుగుతాడు. దాంతో సౌర్య మనకు దొరకొద్దు అని నిర్ణయించుకుందేమో అని నా అనుమానం అంటాడు.
ఆ తర్వాత హిమ (Hima) నిరూపమ్ లు జ్వాల దగ్గరకు వచ్చి నీ హుషారు కొంచెం అప్పు కావాలని అడుగుతారు. ఆ క్రమంలో నిరూపమ్ (Nirupam) హిమను నీతో తిప్పుకో నీలా మార్చు అని జ్వాల ను కోరుతాడు. అంతే కాకుండా ఇద్దరి చేతులు తానే స్వయంగా కలుపుతాడు.
ఇక ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఫోటోలు దిగుతారు. మరోవైపు సప్న (Swapna ) మీరు ఎంత చెప్పినా మమ్మీ మీద నా అభిప్రాయం మారదు అని తన తండ్రికి చెప్పేస్తుంది. ఇక హిమ.. జ్వాల (Jwala) ను వాళ్ల తల్లిదండ్రుల గురించి అడుగుతుంది. దాంతో జ్వాల హిమ పై విరుచుకు పడుతుంది.
ఇక నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇదే అని చెప్పి తన చేతి పచ్చబొట్టు చూపిస్తుంది జ్వాల (Jwala) . అంతేకాకుండా ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు అని అక్కడినుంచి హిమను వదిలేసి ఆటోలో వెళ్ళిపోతుంది. దానికి హిమ (Hima) చాలా బాధ పడుతుంది.
ఇక తరువాయి భాగంలో జ్వాల (Jwala), హిమలు ఆటో రెన్యువల్ చేసుకొని విషయంలో పోలీసులకు పట్టుబడతారు. దాంతో పక్కనే ఉన్న ప్రేమ్ (Prem) జ్వాలను చూసి వెక్కిరిస్తూ ఉంటాడు. ఇక ఆటోను ప్రేమ్ వేసుకుని వెళ్తుండగా వాళ్ళ అమ్మ చూసి నువ్వు ఆటో నడపడం ఏంట్రా అని చిరాకు పడుతుంది. మరోవైపు జ్వాల, హిమలు స్కూటీ లో వస్తూ ఉంటారు.