- Home
- Entertainment
- స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళు జిగేల్ మనే బికినీ అందాలు
స్విమ్మింగ్ పూల్ లో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళు జిగేల్ మనే బికినీ అందాలు
ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది.

తెలుగు బిగ్ బాస్ 2 షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది.
బిగ్ బాస్ 2 షోలో Nandini Rai గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంది.
నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది. నందిని రాయ్ నటికి కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. ఇటీవల నందిని రాయ్ గ్లామర్ లుక్ లో కనిపిస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. తాజాగా నందిని రాయ్ బికినిలో స్విమ్మింగ్ పూల్ ఫోజులు ఇస్తూ కుర్రాళ్ళ టెంపరేచర్ పెంచేస్తోంది. బ్లూ బికినిలో నందిని రాయ్ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల ఓటిటి హవా పెరగడంతో నందిని రాయ్ లాంటి అందాల భామలకు కలసి వస్తోంది. ఓటిటిలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలో నందిని రాయ్ అవకాశాలు అందుకుంటోంది. కొన్ని నెలల క్రితం విడుదలైన 'In the Name Of God' వెబ్ సిరీస్ లో నందిని రాయ్ కీలక పాత్రలో బోల్డ్ రోల్ పోషించింది.
మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం. నందిని రాయ్ కు గుర్తింపు తీసుకునివచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు.