- Home
- Entertainment
- హిమాలయాల్లో నభా నటేష్ సమ్మర్ వెకేషన్.. స్టైలిష్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ
హిమాలయాల్లో నభా నటేష్ సమ్మర్ వెకేషన్.. స్టైలిష్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న యంగ్ బ్యూటీ
హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

హాట్ సెన్సేషన్ నభా నటేష్ కి యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాజూకైన నడుము సొగసుతో నభా నటేష్ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే 2022 ఆమె క్యాలెండర్ లో ఖాళీగా మారింది. గత ఏడాది నభా నటేష్ ఎలాంటి చిత్రంలో నటించలేదు.
నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.
ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి ఇంటెన్సిటీ పెంచింది. తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోలు చూస్తే కుర్ర హృదయాలు చెల్లాచెదురు కావలసిందే. వైట్ డ్రెస్ లో గాగుల్స్ పెట్టుకుని ప్రకృతి అందాల నడుమ నభా నటేష్ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.
నభా నటేష్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ని హిమగిరుల్లో ఎంజాయ్ చేస్తోంది. హిమాలయాల్లో నభా విహరిస్తూ అక్కడ ప్రకృతి అందాల నడుమ ఇస్తున్న ఫోజులు సూపర్ స్టైలిష్ గా ఉన్నాయి.
బోల్డ్ గా అందాలు ప్రదర్శించడమే కాదు స్టైలిష్ గా కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అని నభా నిరూపించుకుంది. ఈ ఫొటోస్ లో నభా అందాలు చూస్తూ.. ప్రకృతితో ఆమెని నెటిజన్లు పోల్చుతున్నారు.