MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Karthika Deepam: గతం మర్చిపోయిన డాక్టర్ బాబుకు భార్యగా మోనిత.. ఆమెను చెడామడా తిట్టేసిన కార్తీక్!

Karthika Deepam: గతం మర్చిపోయిన డాక్టర్ బాబుకు భార్యగా మోనిత.. ఆమెను చెడామడా తిట్టేసిన కార్తీక్!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 26వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
Published : Aug 26 2022, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప కి వైద్యం చేసిన డాక్టర్ వాళ్ళ అమ్మగారు దీపతో, ఒకప్పుడు అంటే కార్తీక్ కి మోనిత గురించి తెలియదు అని చెప్పావు కానీ ఇప్పుడు మోనిత గురించి అంతా కార్తీక్ తెలుసు కదా ఒకవేళ తీసుకువెళ్లిన ఎందుకు వెళ్తారు. దాని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది నువ్వు చూసిన మనిషి కార్తీక్ కేనా? ఒకవేళ కార్తికే అయితే ఎందుకు నిన్ను గుర్తు పట్టలేదు అని తెలుసుకో అని అంటారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఒక బోటిక్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్లు సార్ ఏం చేస్తున్నారు? అలాగే చూస్తూ కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోగా కొంతమంది కస్టమర్స్ వచ్చి డబ్బులు ఎంత అయింది అని అడుగుతారు. కార్తీక్ దాన్ని మర్చిపోతాడు. ఏంటో కొంత డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు పక్కనున్న ఎంప్లాయిస్ ఇంత  మతిమరుపుని మేడమ్ ఎలా భరిస్తున్నారు రా బాబు అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్ లో శివ, రోడ్డు మీద ఐస్క్రీమ్ తింటూ ఉంటాడు. అదే సమయంలో దీప, కార్తీక్ ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉంటుంది. సడన్ గా దీప శివ నీ చూసేసరికి శివ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దీప శివ కాలర్ పట్టుకుని ఎవడ్రా నువ్వు? మొన్న ఫోటోలో చూపిస్తే తెలీదు అన్నావు.
 

37

మా డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయావు అని అడగగా ఎవరు మేడం మీరు అని అంటాడు శివ. నువ్వూ ఎవరు అని చెప్పి, డాక్టర్ బాబూ ఎవరు అని చెప్పి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు నాకు నిజం చెప్పకపోతే పోలీసులకు ఇస్తాను అని అంటుంది. అప్పుడు నిజం చెప్పేస్తాను అని శివ అంటాడు. ఇంతట్లో మోనిత అక్కడికి వచ్చి నిజంగా నా కార్తీక్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అయితే చెప్పు అని దీపని తోసేసి శివని కారులోకి లాకెళ్లిపోతుంది. దీప కింద పడిపోతుంది. ఇంతటిలో ఆ కారు వేలుకు వెళ్దాం అనేసరికి ఆ కార్ వెళ్ళిపోతుంది.

47

ఆ తర్వాత సీన్లో కార్తీక్ ఇంట్లో కూర్చుని ఉండగ మొనిత,కార్తీక్ కి అన్నం పెడుతూ ఉంటుంది. వెనకాతల మొనిత, కార్తీక్ పూజ చేస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీ పేరేంటి అని అడుగుతాడు దానికి మొనిత, నువ్వు ఎన్ని మర్చిపోయిన నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను కార్తీక్. నా పేరు మొనిత అని అంటుంది. అసలు నువ్వు నిజంగానే నా భార్యవా? ఇంట్లో ఉన్న ఒక ఫోటో తప్ప నాకు ఇంకేమీ గుర్తురావడం లేదు. మనం నిజంగానే బోటిక్ చాలా ఏళ్ల నుంచి నడుపుతున్నామా? నాకు చిన్న గుర్తు కూడా రావడం లేదు అని అనగా, పరాయి మగాడిని ఇంటికి తెచ్చుకొని భర్తని చెప్పడానికి నాకేంటి అవసరం కార్తీక్.
 

57

పోని నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా అంటే నీకు ఏవి గుర్తు లేవు మరి నాకేంటి అవసరం. నేను నిన్ను దక్కించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. నాలో ప్రేమ నీకు కనిపించట్లేదా అని మాయమాటలు చెప్పి కార్తిక్ ని కన్విన్స్ చేస్తుంది. అప్పుడు కార్తీక్, మరి నన్ను ఎందుకు బయటకు పంపించడం లేదు అని అనగా నువ్వు బయటికి వెళ్తే తిరిగి ఇంటిదారిని మర్చిపోయి  ఎక్కడ నాకు దూరం అవుతావని భయం కార్తీక్ అంతే అంతకుమించి ఇంకేం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొనిత. ఆ తర్వాత సీన్లో ఆనందరావు, సౌందర్య, హిమ, శౌర్య ఇంటి ఎదురుగా వస్తారు.
 

67

శౌర్య తినడం చూసి ఎలాంటి గతి పట్టిందే సౌర్యకి అని అనుకుంటారు. ఇంతట్లో హిమ, మనం వెళ్లొద్దు నానమ్మ, మళ్ళీ సౌర్య కోప్పడుతుంది. మనం ఒక మూల నుంచి చూసి సరిపెట్టుకుందాం అని అనుకుంటారు.ఇంతలో వాళ్ళిద్దరూ వెనకనుంచి దాక్కుంటారు ఆనందరావు శౌర్య దగ్గరికి వెళ్తారు. ఎందుకు వచ్చారు తాతయ్య వాళ్ళు కూడా వచ్చారా? అని శౌర్య అడగగా, లేదమ్మా నేనే వచ్చాను నా మీద ఇష్టం లేదా అని ఆనందరావు అడుగుతాడు. అప్పుడు సౌర్య మీ మీద ఇష్టం లేకపోవడం కాదు తాతయ్య హిమ అంటే ఇష్టం లేదు అని అంటుంది శౌర్య.
 

77

కోపం ఎలా పోతుంది అమ్మ అని ఆనందరావు అడగగా అమ్మ నాన్నలు తిరిగి వస్తే పోతుందేమో తాతయ్య.. తెలీదు అని అంటాది సౌర్య. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు, వాళ్ళు రారు అని ఆనందరావు అనగా, నాకు గట్టి నమ్మకం ఉన్నది తాతయ్య, అమ్మ నాన్నలు ఇక్కడే ఎక్కడో ఉన్నారు కచ్చితంగా తిరిగి వస్తారు అని అంటుంది శౌర్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved