- Home
- Entertainment
- Ramayana: రామాయణ్‌పై టాక్సిక్ డిజాస్టర్ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్ డిజాస్టర్ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Ramayana: యశ్ నటిస్తున్న 'రామాయణ' సినిమాను దాదాపు 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్నారని టాక్. సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే మొన్నటి వరకు హడావుడి చేసిన టీమ్ ఇప్పుడు సైలెంట్ కావడం ఆశ్చర్యపరుస్తోంది.

రామాయణ్ టీమ్ మౌనం
రామాయణ్ మౌనానికి కారణం ఏంటి?
రామాయణ్‌పై టాక్సిక్ డిజాస్టర్ ప్రభావం
అయితే ఇటీవల యశ్ హీరోగా నటించిన `టాక్సిక్` మూవీ విడుదలైంది. ఇది డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ ప్రభావం ఇప్పుడు `రామాయణ్`పై ఉందనే అనుమానలు కలుగుతున్నాయి. `టాక్సిక్` ఫలితంతో `రామాయణ్` టీమ్ దైలమాలో పడ్డారని టాక్. కానీ ఇప్పుడు రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా అదే నిశ్శబ్దం కొనసాగుతుండటం సినీ ప్రియులను ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసినా, ఆ తర్వాత ప్రమోషన్లతో పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బిజినెస్‌లో వెనుకబడ్డ రామాయణ్
ఇంత భారీ బడ్జెట్ సినిమాకు బాక్సాఫీస్ అంచనాలు, బిజినెస్ ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే 'రామాయణ్' అనుకున్న స్థాయిలో బిజినెస్ చేయట్లేదనే చర్చ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి 'టాక్సిక్' సినిమా ఫలితం కూడా ఒక కారణం కావొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తలక్రిందులైన రామాయణ్ టీమ్ ఆశలు
'టాక్సిక్' సినిమా పెద్ద విజయం సాధించి ఉంటే, దాని ప్రభావంతో 'రామాయణ' బిజినెస్ కూడా మరో స్థాయికి వెళ్లేదని కొందరి అంచనా. అందుకే ప్రమోషన్లను తొందరపడి మొదలుపెట్టకుండా, సరైన సమయం కోసం చిత్ర బృందం ఎదురుచూస్తూ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేల కోట్ల బడ్జెట్, భారీ తారాగణం, ఆకాశాన్నంటే అంచనాలు ఉన్న 'రామాయణ' సినిమా ప్రమోషన్ల విషయంలో ఎందుకింత సైలెన్స్ అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. ఇది మేకర్స్ మాస్టర్ ప్లానా? లేక బిజినెస్ లెక్కల వెనుక ఉన్న వ్యూహమా? అనేది తెలియాల్సి ఉంది.

