MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Malli: తన పెళ్లి విషయం గురించి బయటపెట్టిన మల్లీ.. షాకైన మాలిని, అరవింద్ ఫ్యామిలీ?

Malli: తన పెళ్లి విషయం గురించి బయటపెట్టిన మల్లీ.. షాకైన మాలిని, అరవింద్ ఫ్యామిలీ?

Malli: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఇక ఈరోజు ఫిబ్రవరి 6వ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Feb 06 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో శరత్,మల్లీకి నేనే తన తండ్రిని అన్న విషయం తెలియదు కాబట్టి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలోనే ఒక రిపోర్టర్ అర్థం కావడం లేదు సార్ మీకు వసుంధర గారు కాకుండా ఇంకొక భార్య ఉన్నారా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శరత్ కంటేనే కూతురు అవ్వాలా, నా కూతురు మాలిని, మల్లీని సొంత చెల్లెలు లాగా చూసుకుంటుంది. మల్లీ నా కూతుర్ని అక్క అని ప్రేమగా పిలుస్తుంది. నా కూతురి కోసం మల్లీ తన ప్రాణాలను ఇస్తుంది అలాంటప్పుడు మల్లీ నా కూతురు ఎలా కాకుండా పోతుంది అంటూ కవర్ చేసుకుంటాడు శరత్. దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మన చుట్టూ ఉన్న వారిని బాబాయి అక్క పిన్ని అని ఇలా వరుసలు పెట్టి పిలుచుకుంటాం అందుకే నా కూతురు వయసున్న మల్లీని నేను నా కూతురు అని చెప్పుకుంటాను అనడంతో మల్లీ సంతోష పడుతూ ఉంటుంది. ఈరోజు టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ మల్లి లాంటి అమ్మాయి మన ఇంట్లో కూడా ఉండాలని కోరుకుంటారు అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అలాగే మల్లీ నా కూతురు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అంటాడు శరత్. దయచేసి మీరెవరు మల్లీ ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగొద్దు అని అంటాడు. మీరు ఏమి అవ్వాలని అనుకుంటున్నారు అనగా కలెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అంటుంది మల్లీ.
 

38

అప్పుడు మల్లీ రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు టెన్షన్ పడుతూ ఉండగా చెమటలు పట్టడంతో అది గమనించిన ఒక రిపోర్టర్ మళ్ళీ గారికి చెమటలు పడుతున్నాయి ఫ్యాన్ వేయండి అని అంటారు. అప్పుడు ఫ్యాన్ మళ్ళీ వైపు తిప్పడంతో మళ్ళీ నుదుటిన ఉన్న కుంకుమను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు శరత్ కూడా మల్లీ నుదిటిన పెట్టిన కుంకుమ చేసే షాక్ అవుతాడు. అప్పుడు మల్లీ ఆ కుంకుమ బొట్టు కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మాలిని అత్తయ్య నుదుటిన సింధూరం పెళ్లి అయిన వాళ్ళు పెట్టుకుంటారు కదా అనడంతో అవును అంటుంది. మరోవైపు రిపోర్టర్ మల్లిగారు మీకు పెళ్లయిందా అనడంతో మల్లీ షాక్ అవుతుంది. 

48

ఏంటి మల్లి గారు ఇది మీకు పెళ్లి అయిన విషయం గురించి ఎందుకు చెప్పలేదు అని అడగగా అప్పుడు రిపోర్టర్స్ అందరూ మీ ఆయన ఎక్కడున్నారు మీ ఆయన పేరు చెప్పండి అని పదే పదే ప్రశ్నించడంతో అవును నాకు పెళ్లయింది అని అంటుంది మల్లీ. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మల్లీ సమాధానం చెప్పలేకపోవడంతో ఇంతలో రిపోర్టర్ అరవింద్ గారు మల్లీ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు మల్లీ మీ ఇంట్లోనే ఉంటుంది కదా మీరైనా సమాధానం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అరవింద్ ఏం చెప్పాలో తెలియక తలదించుకుంటాడు.
 

58

అప్పుడు ఆ రిపోర్టర్ చెప్పండి అరవింద్ గారు మీరు సైలెంట్ గా ఉంటే మిమ్మల్ని భార్యాభర్తలు అని టీవీలో చూసే జనాలు అనుకుంటారు అని అంటాడు. అప్పుడు మల్లీ కోపంతో దేవుడు అని గట్టిగా అరుస్తుంది. మల్లి గారు ప్రతి ఒక భార్య, భర్తను దేవుడి గానే భావిస్తుంది ఆ పతి గారి పేరు ఏంటో చెప్పండి అని అంటాడు. అప్పుడు మల్లీ సీరియస్ అవుతూ ఎవరి ఆచారాలు సంప్రదాయాలు తెలియకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడకండి రిపోర్టర్ గారు అని అంటుంది. ఎవరికైనా దేవుడు ఆశీస్సులు కావాలి అంటే నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి అన్న ఆచారం మా ఊరిలో ఉంది అది తెలుసుకొని మాట్లాడండి అనడంతో అతను మౌనంగా కూర్చుంటాడు.
 

68

 అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మరొకవైపు వసుంధర జరిగిన విషయాలు తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి శరత్ రావడంతో ఆగండి అని ఇంటి బయట నిలబెడుతుంది. ఒక పని మనిషిని నీ కూతురు అని చెప్పడానికి సిగ్గుగా లేదా అని వసుంధర సీరియస్ అవ్వడంతో, రేపు సొసైటీలో ఎలా తలెత్తుకొని తిరగాలి అని అనడంతో వెంటనే శరత్ తల ధించుకునేంత తప్పు అక్కడ ఏం జరగలేదు అని అంటాడు. మొదటినుంచి దాని విషయంలో మీరు చాలా ప్రేమను చూపిస్తున్నారు దాన్ని ఏమైనా అంటే ఇక ఫీల్ అయిపోతారు దానికి మీకు ఏంటి సంబంధం అని అడుగుతుంది. నేను బయటికి వెళితే ఇదే ప్రశ్న నా ఫ్రెండ్స్ నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి అని వసుంధర అంటుంది. నేను అలా చెప్పడానికి కారణం నువ్వే అని అంటాడు శరత్.
 

78

నేనేం చేశాను అనడంతో నువ్వు ఆ రిపోర్టర్ తో ఫోన్లో మాట్లాడిన మాటలు అని నేను విన్నాను అనడంతో మాలిని షాక్ అవుతుంది. అక్కడ ఆ రిపోర్టర్ మాట్లాడిన మాటలకు అరవింద్ వాడి చెంప పగలగొట్టింటే వాడు నీ పేరు చెప్పేవాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదో తెలుసుకో,అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించుకో అని అంటాడు శరత్. అప్పుడు శరత్ మాటలకు వసుంధర ఏం మాట్లాడాలో తెలియక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. మరొకవైపు అరవింద్ ఇంట్లో అందరూ ఇంటర్వ్యూ గురించి మల్లీ గురించి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనుపమ మొగుడు సపోర్ట్ ఉండాలి అంటే రాసిపెట్టి ఉండాలి అనడంతో మాలిని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మల్లీ అరవింద్ వస్తారు.
 

88

అప్పుడు అందరూ మల్లీ రావడంతో సంతోషపడుతూ మల్లీని పొగుడుతూ ఉండగా మాలిని మాత్రం మౌనంగా ఉంటుంది. ఏంటి మాలిని మౌనంగా ఉన్నావు అనడంతో మల్లీ విజయం చూసి నాకు సంతోషంగానే ఉంది కానీ మల్లీ చేసిన పని నాకు నచ్చలేదు అత్తయ్య అని అంటుంది మాలిని. అప్పుడు అనుపమ ఏంటి మాలిని నువ్వు అనేది మల్లీ ఏం చేసింది అని అనడంతో దేని గురించి మాట్లాడుతున్నావు మాలిని అని అరవింద్ అనడంతో సింధూరం గురించి అంటుంది మాలిని. సాధారణంగా పెళ్లి అయిన అమ్మాయిలు నుదుటిన సింధూరం పెట్టుకుంటారు. వాళ్ళ ఆచారం అని చెప్పింది కదా అనడంతో చెప్పింది కాకపోతే అటువంటి ఆచారం నేను ఎప్పుడు వినలేదు అంటుంది మాలిని. ఇంటర్వ్యూలో మల్లీ చేసిన పనికి ఇంటర్వ్యూలో మనం పరువు పోయినట్టు అయింది అక్కడ వాళ్ళు అన్న ప్రశ్నలకు నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ప్రాణం పోయినట్టు అయింది అంటుంది మాలిని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved