MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: విన్నీని హగ్ చేసుకున్న వేద.. కొడుకు కోసం కన్నీరు పెట్టుకుంటున్న మాలిని!

Ennenno Janmala Bandham: విన్నీని హగ్ చేసుకున్న వేద.. కొడుకు కోసం కన్నీరు పెట్టుకుంటున్న మాలిని!

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో అందరి హృదయాలని దోచుకుంటుంది. మనసులో అనురాగాలు ఉన్నప్పటికీ అనుకోని అవాంతరాల వల్ల దగ్గర కాలేకపోతున్న ఒక జంట కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Mar 31 2023, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో వేద, యష్ ఇద్దరు ఐ లవ్ యు చెప్పుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరూ దండలు కూడా మార్చుకుంటారు. ఒక్కసారిగా ఊహల నుంచి బయటకు వస్తాడు యష్. ఎదురుగా ఉన్న కొరియర్ ఓపెన్ చేస్తే అందులో విన్ని, వేద ల ఫోటోలు చూసి అప్సెట్ అవుతాడు. కోపంతో రగిలిపోతాడు.

29

అప్పుడే అక్కడికి వచ్చిన వసంత్ ఇంకా ఇక్కడే ఉన్నావేం, అయినా స్టేజ్ మీద ఏం మాట్లాడాలో గుర్తుంది కదా ఏమి మార్పు లేదు కదా ఎందుకంటే నువ్వు ఏ నిమిషానికి ఎలా మారుతావో తెలీదు అందుకే అంటున్నాను అంటాడు. నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. నేను వస్తాను నువ్వు వెళ్ళు అంటాడు యష్. మరోవైపు ఆనందంలో ఉన్న వేద విన్ని దగ్గరికి వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది.

39

దిస్ ఇస్ మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ అంటుంది. యష్ గాని ఐ లవ్ యు చెప్పాడా అయినా పర్వాలేదు ఐ హేట్ యు గా మార్చేస్తాను అనుకుంటాడు విన్ని. బయటికి మాత్రం విషయం ఏంటి అని అడుగుతాడు. నేను యష్ కి ఐ లవ్యు చెప్పాలని అనుకున్నాను కదా అలాగే యష్ కూడా అనుకున్నాడు అంటుంది వేద. ఇంకా చెప్పలేదు కదా అంటాడు విన్ని. చెప్పినా అంతా త్రిల్ ఉండేది కాదు.
 

49

కానీ చెప్పాలి అనుకుంటున్నారు అని ముందే తెలిస్తే ఆ ఆనందమే వేరు అంటుంది వేద. నువ్వు అదే ఫీలింగ్ లో ఉండు తను చెప్పకుండా ఉండడానికి ఏం చేయాలో అదే చేస్తాను అనుకుంటాడు విన్ని. ఇప్పటిదాకా మా ఇద్దరి రిలేషన్షిప్ ఒకటి ఇకనుంచి ఒకటి. ఇప్పటివరకు మేము ఇద్దరం కానీ ఇప్పటినుంచి ఒక్కరం. దీని అంతటికి కారణం నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అందుకు థాంక్స్ అంటుంది వేద.
 

59

నీ గురించి నాకన్న ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు నేను వచ్చిందే నీ కోసం అంటాడు విన్ని. నీలాంటి ఫ్రెండ్ ఉండడం నాకు చాలా లక్కీ అంటూ ఐ లవ్ యు చెప్పి అతన్ని హగ్ చేసుకుంటుంది వేద. అప్పుడే అక్కడికి వచ్చిన యష్ వాళ్ళిద్దర్నీ అలా చూసి షాక్ అవుతాడు. నువ్వు ముందే వచ్చి ఉంటే నన్ను ప్రతిక్షణం సంతోషంగా ఉంచి ఉండేవాడివి అంటుంది వేద.
 

69

నీ సంతోషం తప్పితే నాకు వేరే ఏం కావాలి దానికోసం ఏమైనా చేస్తాను అంటాడు విన్ని. ఈ మాటలు వింటున్న యష్ బాధతో కన్నీరు పెట్టుకుంటాడు. మాళవిక, అభి హగ్ చేసుకుంటున్నప్పుడు పడిన బాధ గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు కూడా అదే జరగటంతో మరింత బాధపడతాడు. మరోవైపు వేద నా కోసం అన్ని వదులుకొని అమెరికా నుంచి వచ్చావు నిజంగా నువ్వు గ్రేట్ అంటుంది వేద.

79

బెస్ట్ ఫ్రెండ్ నుంచి ప్రమోషన్ ఇవ్వవా అని ఎప్పుడు అడిగేవాడివి కదా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను నువ్వు నా బెస్ట్ వెల్విషర్ వి. నేను చాలా హ్యాపీ ఎందుకంటే నా అర్రోగెంట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అంటూ అక్కడ నుంచి ఆనందంగా వెళ్ళిపోతుంది వేద. మరోవైపు యష్, వేదలకి దండలు ఇచ్చి మార్చుకోమంటుంది ఖుషి.
 

89

ఖుషి చెప్పటంతో వేద యష్ మెడలో దండ వేస్తుంది. యష్ ని కూడా దండ వేయమంటుంది ఖుషి. కానీ తన మెడలో దండ కూడా తీసేసి వెళ్ళిపోతున్న యష్ ని ఏమైంది అని అడుగుతుంది వేద. ఈ జర్నీని ఇంతటితో ఆపేద్దాం అంటాడు యష్. కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారండి  అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద.
 

99

లోపల ఒకటి బయట ఒకటి నాకు చేతకాదు ఏ రిలేషన్షిప్ లో అయినా నిజాయితీ ఉండాలి అంటాడు యష్. తరువాయి భాగంలో వేద దగ్గరికి వచ్చి యష్ ఇలా  ప్రవర్తించడం నీకు మొదటిసారి కానీ మాకు మొదటిసారి కాదు మాళవిక తనని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇలాగే పిచ్చివాడైపోయాడు మా అందరినీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయేవాడు ఈరోజు లాగే అంటూ కన్నీరు పెట్టుకుంటుంది మాలిని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved