ధోతీ కట్టిన మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. ఫిదా అయినా అనుపమా పరమేశ్వరన్..
మలయాళ బ్యూటీ, యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా వేష్టి ధోతీ వేర్ లో దర్శనమిచ్చిన బ్యూటీ నయా లుక్ లో ఆకట్టుకుంటోంది.

సౌత్ ఆడియెన్స్ తో దాదాపుగా పరిచయ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది మాళవిక మోహనన్. మలయాళ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అటు మలయాళం, తమిళం, హిందీ చిత్రాల్లో వరుస నటిస్తోంది. త్వరలో టాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
ఇండస్ట్రీలో మలయాళ బ్యూటీ ధోరణి ఇతర హీరోయిన్ల కంటే భిన్నంగా అనిపిస్తుంది. ఏ హీరోయిన్ అయినా సినిమాలు అందాలు ఆరబోసి బయట నార్మల్ గా ఉంటే.. మాళవిక మాత్రం సినిమాల్లో సంప్రదాయంగా కనిపిస్తూ బయట మాత్రం అందాలు ఆరబోస్తోంది. మతిపోయేలా గ్లామర్ షో చేస్తోంది.
ఆయా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కాస్తా డిమాండ్ ను పెంచుకుంటున్న మాళవికా ఇటు సోషల్ మీడియాలోనూ తన సత్తా చూపిస్తోంది. ఏకంగా హాట్ ఫొటోషూట్లతో మాళవికా అందాల విందు చేస్తూ కుర్రాళ మతిచెడగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అదిరిపోయేలా గ్లామర్ షో చేస్తోంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానుతో యాక్టివ్ గా ఉండే మాళవికా తాజా కొన్ని పిక్స్ ను షేర్ చేసుకుంది. ఈ పిక్స్ లో మాళవికా వేస్టీ ధోతీని, బ్రా ధరించి మాస్ లుక్ ను సొంతం చేసుకుంది. నాభీ సొగసులను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. ప్రస్తుతం పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ దుస్తులను తన ఫ్రెండ్ కోసం ధరించిందని, ఆ ఫొటోను తన ఫ్రెండే తీసిందని పేర్కొంది. మొత్తంగా ఈ స్టైల్ లో దుస్తులు ధరించే దశ ఎప్పటికీ ముగియదని అభిప్రాయపడింది. మాళవికా పోస్ట్ చేసిన పిక్స్ కు యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran) కూడా ఫిదా అయ్యింది. ఈమేరకు పిక్స్ ను లైక్ చేసింది.
కేరీర్ విషయానికొస్తే తమిళంలో ‘పేట’, ‘మాస్టర్’ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు తెలుగు వెర్షనల్ లోనూ రిలీజ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకోగలింగింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘యుద్ర’(Yudhra)లో నటిస్తుండగా.. మరో చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇక త్వరలోనే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన కూడా నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.