MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన మల్లిక, మలయాళం.. కాలేజీ ఫీజు గురించి బాధపడుతున్న జానకి?

Janaki Kalaganaledu: యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన మల్లిక, మలయాళం.. కాలేజీ ఫీజు గురించి బాధపడుతున్న జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 6వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Feb 06 2023, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో మలయాళం వంట ఎలా చేయాలి అని ఏడుస్తూ ఉండగా గోవిందరాజులు మాత్రం వాసన వస్తుంది గుంగుమలాడుతుంది వీధి చివర వరకు అంటే ఇక్కడి నుంచి మొదలవ్వాలి కదా అనుకుంటూ మలయాళం మండల పై చాలా హోప్స్ పెట్టుకుంటాడు. ఏంట్రా మలయాళం ఏం చేస్తున్నావు మీ వంటల మీద చాలా అంచనాలు పెట్టుకున్నాము అని అనగా మలయాళం మాత్రం ఏడుస్తూ కూర్చుంటాడు. మామ నన్ను ఇలా ఇరికించావు కదా అనుకుంటూ ఉంటాడు. గోవిందరాజులు మాత్రం వంటలు అదిరిపోతాయి అనుకుంటూ సంతోష పడుతూ ఉంటాడు. మరోవైపు మళయాలం ఏం చేయాలి అనుకుంటూ ఉండగా ఇంతలో మల్లిక అక్కడికి వచ్చింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఏంటి ఏదో ప్లాన్ చెబుతాను అన్నారు అనగా నువ్వు చేసే వంటలు నేను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అనగా దాని వల్ల లాభం ఏంటి అనడంతో మలయాళం వంటలు వాని సోషల్ మీడియాలో షేర్ చేస్తే లైకుల మీద లైకులు వచ్చి నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అనడంతో వెంటనే ఫేమస్ చేయండి అని మలయాళం అనగా అయితే నువ్వు నాకు వంటలు నేర్పించు అంటుంది మల్లిక. నేను నీకు వంటలు నేర్పించాలా అని షాక్ అవుతాడు మలయాళం. అప్పుడు వాళ్ళిద్దరూ తింగరి తింగరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మలయాళం వచ్చి రాని వంటలతో ఎలా అయినా వంటలు వండవచ్చన్నమాట అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మల్లిక నువ్వు వంటలు చేసి నేను డబ్బులు సంపాదిస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది.
 

37

 అవునా అంటూ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అని వాళ్ళిద్దరూ కలిసి వంటలు స్టార్ట్ చేస్తారు. అప్పుడు మల్లిక వీడియో తీస్తూ మల్లిక మాటల అల్లిక అనే నా ప్రోగ్రామ్ కీ స్వాగతం సుస్వాగతం అంటూ వీడియోని మొదలు పెడుతుంది. అప్పుడు మలయాళం ఎలా అయినా ఈమెతో వంటలు నేర్పించుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మల్లిక వంటలు చేయడం మొదలు పెడుతుంది. తర్వాత ఇద్దరు కలిసి తింగరి తింగరిగా చేస్తూ వంటలు చేస్తూ ఉంటారు. మరొకవైపు రామచంద్ర బిజినెస్ చేసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మొన్న మాక కానిస్టేబుల్ మీ స్వీట్ షాప్ స్వీట్ నుంచి స్వీట్ తెచ్చాడు. మా పిల్లలు కావాలి అంటున్నారు అనడంతో రామచంద్ర స్వీట్లు కడుతూ పోలీసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
 

47

ఏంటయ్యా అలా చూస్తున్నావు అనడంతో మీలాగా ఆ డ్రెస్ వేసుకోవడం నా ఆశ సార్ అనడంతో డ్రెస్ ఎవరైనా వేసుకుంటారు దానికోసం కష్టపడాలి కసరత్తులు చేయాలి అని పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి ఏమేం చేయాలో ఆ విషయాలు అన్నీ రామచంద్ర కు చెబుతూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మాటలకు రామచంద్ర ఆలోచనలో పడతాడు. మరొకవైపు గోవిందరాజులు వంట తినడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి   జ్ఞానాంబ వచ్చి ఏంటండీ మీరు తీసుకువచ్చిన ఆ వంట మనిషి వంటిల్లు దాటి బయటికి రావడం లేదు అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ వెన్నెల ముందు గోవిందరాజులు మలయాళం వంట గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు.

57

ఇంతలోనే విష్ణు అక్కడికి వచ్చి అమ్మ తొందరగా అన్నం పెట్టు ఆకలి అవుతుంది అని అనగా కొద్దిసేపు ఆగరా మలయాళం మీ ఆవిడ కలిసి వంటలు చేస్తున్నారు అని అనగా విష్ణు షాక్ అవుతాడు. అప్పుడు మలయాళం అయ్యగారు వంట రెడీ అయిపోయింది అనడంతో అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు అక్కడి వంటకాలను చూసి అందరూ షాక్ అవుతారు. అప్పుడు గుత్తొంకాయ కూర చేయమంటే ఏంట్రా రాగి సంగటి చేసావు అని గోవిందరాజులు అనడంతో మలయాళం బిక్క మొహం వేస్తాడు. అప్పుడు జ్ఞానాంబ, వెన్నెల నవ్వుకుంటూ ఉంటారు. నేను కూడా ఆయన కోసం గుత్తి వంకాయ కూర అంటూ స్పెషల్ కూర చేశాను అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ,వెన్నెల తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

67

 అప్పుడు గోవిందరాజులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో మల్లిక విష్ణుకి బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర లెక్కలు సరి చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానకి వస్తుంది. ఎందుకు వచ్చారు జానకి గారు ఇంటి దగ్గర పని చూసుకోవచ్చు కదా అనగా మీకు సహాయంగా ఉంటుందని వచ్చాను రామ గారు అంటుంది. అప్పుడు సరే ఇంటికి వెళ్దాం పద జానకి గారు అనగా రామ గారు డబ్బులు ఉన్నాయా అనడంతో ఉన్నాయి జానకి గారు ఇచ్చేద్దాం లేండి అంటూ సరకుల గురించి మాట్లాడుతాడు. కానీ జానకి మాత్రం తన చదువు గురించి అనుకోని ఆనందపడుతూ ఉంటుంది. జానకి మాత్రం తన చదువు విషయం గురించి ఫీజు కట్టడం గురించి రామచంద్ర కు చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
 

77

మరోవైపు మల్లిక తాను తీసిన వీడియోని చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా ఇందులో మలయాళం ఏమైంది అమ్మగారు అని అడుగుతాడు. మనం ఊహించిన దానికంటే బాగానే ఉంది చాలామంది నిన్ను పొగుడుతున్నారు అనడంతో మలయాళం సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు మల్లిక లేనిపోని కామెంట్లు చెబుతూ మలయాళం ని ఇంకా రెచ్చగొడుతూ వంటలు చేసేలా ఉప్పొంగిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లిక మాటలు నిజమైన నమ్మిన మలయాళం ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. జానకి రామచంద్ర అక్కడికి రావడంతో ఈరోజు ఏమాత్రం సంపాదించారో తెలుసుకుందాం అని అక్కడికి వెళుతుంది మల్లిక. అప్పుడు మల్లిక రామచంద్ర గురించి అవమానించే విధంగా మాట్లాడడంతో వెంటనే జానకి రివర్స్ లో కౌంటర్ ఇస్తుంది. సొంతపని చేయడానికి ఒకరికింద పనిచేయడానికి తేడా ఉంటుందిలె అనడంతో మల్లిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image2
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved