MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు

Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు

లెనిన్‌ మూవీతో హిట్‌ అందుకున్నాడు అక్కినేని అఖిల్‌. ఆయన కెరీర్‌లో మొదటిసారి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరి ఈ మూవీకి ఆయన ఎంత పారితోషికం తీసుకున్నాడు. టీమ్‌ రెమ్యూనరేషన్స్ డిటెయిల్స్.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లెనిన్‌ హిట్‌తో అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం
Image Credit : Asianet News

లెనిన్‌ హిట్‌తో అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం

అక్కినేని అఖిల్‌కి ఎట్టకేలకు కెరీర్‌లో తొలి విజయం దక్కింది. ఆరు సినిమాల తర్వాత ఏడో మూవీ `లెనిన్‌`తో ఈ బ్రేక్‌ వచ్చింది. ఇది అక్కినేని ఫ్యామిలీకి ఆనందకరమైన సందర్బంగా చెప్పొచ్చు. మొన్న సక్సెస్‌ సెలబ్రేషన్‌లోనే నాగార్జున ఈ విషయాన్ని చెప్పారు. తమ ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొందన్నారు. అయితే ఈ సినిమాకి అఖిల్‌కి ఎంత పారితోషికం ఇచ్చారు. టీమ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్నది ఎవరనేది చూస్తే,

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అఖిల్‌ పారితోషికం
Image Credit : Asianet News

అఖిల్‌ పారితోషికం

`లెనిన్‌` మూవీకి అఖిల్‌ కి అత్యధిక పారితోషికం ఇచ్చారు నాగార్జున. తన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి ఆయనకు సుమారు రూ.8కోట్లు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఐదు కోట్ల లోపే ఆయనకు ఈ పారితోషికం దక్కింది. కానీ ఈ మూవీకి ఏకంగా ఎనిమిది కోట్లు ఇచ్చినట్టు టాక్‌. సినిమా హిట్‌ కావడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అఖిల్‌ తర్వాత ఎవరు ఎంత తీసుకున్నారంటే.

Related Articles

Related image1
Prabhas Desire: ప్రభాస్‌కి ఎంత మంది పిల్లలు కావాలో తెలుసా? అమ్మాయిలో ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లికి రెడీ
Related image2
India Top 10 Heroes: దూసుకొచ్చిన రామ్‌ చరణ్‌, రేస్‌ నుంచి ఎన్టీఆర్‌ ఔట్‌, పడిపోయిన మహేష్‌.. టాప్‌ హీరో ఎవరంటే?
34
లెనిన్‌ మూవీ టీమ్‌ పారితోషికాలు
Image Credit : Asianet News

లెనిన్‌ మూవీ టీమ్‌ పారితోషికాలు

`లెనిన్‌` మూవీకి థమన్‌ సంగీతం అందించాడు. ఆయన సంగీతం, బీజీఎం సినిమాకి ప్లస్‌ అయ్యాయి. ఈ మూవీకి ఆయనకు నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే కోటిన్నర పారితోషికం ఇచ్చారట. సినిమాలో కీలక పాత్రలో నటించిన శివాజీకి ఎనబై లక్షలు ఇచ్చారట. అలాగే మరో కీలక పాత్రలో మెరిసి సునీల్‌ అరవై లక్షలు అందుకున్నట్టు సమాచారం. వీరితోపాటు మరో ముఖ్య పాత్రలో కనిపించిన ఈశ్వరీరావుకి కూడా బాగానే పారితోషికం దక్కింది. ఆమె రూ.38లక్షలు తీసుకుందట. దర్శకుడికి యాభై లక్షల నుంచి కోటి వరకు దక్కిందని సమాచారం.

44
బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తున్న లెనిన్‌ మూవీ
Image Credit : X/@SitharaEnts ·

బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తున్న లెనిన్‌ మూవీ

`లెనిన్‌` మూవీ జులై 10న విడుదలైంది. ఇప్పుడు విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. మూడో వారంలోనూ డీసెంట్ నెంబర్స్ ని సొంతం చేసుకుంది. ఇది వంద కోట్ల దిశగా వెళ్తుందని టీమ్‌ ప్రకటించింది. మరి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఈ చిత్రంలో అఖిల్‌ హీరోగా నటించగా, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. శివాజీ, సునీల్‌, ఈశ్వరీ రావు, ప్రమోద్‌, గెటప్‌ శ్రీను వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Prabhas Desire: ప్రభాస్‌కి ఎంత మంది పిల్లలు కావాలో తెలుసా? అమ్మాయిలో ఈ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లికి రెడీ
Recommended image2
India Top 10 Heroes: దూసుకొచ్చిన రామ్‌ చరణ్‌, రేస్‌ నుంచి ఎన్టీఆర్‌ ఔట్‌, పడిపోయిన మహేష్‌.. టాప్‌ హీరో ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved