MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?

Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?

Bandla Ganesh: తప్పు చేసినా నిజాయితీగా ఒప్పుకునే అలవాటు ఉన్న నటుడు బండ్ల గణేష్. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే గణేష్.. ఓ స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఎవరా హీరో? Bandla Ganesh Reveals How He Cheated Raviteja

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 28 2026, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బండ్ల గణేష్..
Image Credit : youtube/@RajaRaveendarTalks

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బండ్ల గణేష్..

టాలీవుడ్‌లో నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి.. కమెడియన్‌గా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత నిర్మాతగా, వ్యాపారవేత్తగా, పొలిటీషియన్‌గా మారి కోట్లు గడించారు బండ్ల గణేష్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, వివాదాస్పద కామెంట్లు చేయడం ఆయనకు అలవాటు. బండ్ల మాట్లాడారంటే అందులో ఏదో ఒక కాంట్రవర్సీ వెతుక్కోవచ్చు. అయితే చేసిన తప్పును కూడా నిజాయితీగా ఒప్పుకునే ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన. తాను ఒక హీరోను మోసం చేసి భూమి కొన్నట్లు వెల్లడించిన గణేష్, ఆ తర్వాత అతనికి సారీ కూడా చెప్పానన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మాస్ మహారాజ రవితేజ! అంతేకాదు, రవితేజలోని మంచి గుణం, నిజాయితీ గురించి బండ్ల ఏమన్నారంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్వయంకృషితో ఎదిగిన మాస్ హీరో..
Image Credit : instagram

స్వయంకృషితో ఎదిగిన మాస్ హీరో..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన నటన, కష్టం, స్వయంకృషితో 'మాస్ మహారాజా'గా పేరు తెచ్చుకున్న నటుడు రవితేజ. పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు ఆయన వ్యక్తిత్వాన్ని, నిజాయితీని ప్రశంసించడం మనం చూస్తూనే ఉంటాం. రీసెంట్‌గా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాస్ మహారాజా రవితేజ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన మంచితనం గురించి బండ్ల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

36
రవితేజను మోసం చేసిన బండ్ల గణేష్..
Image Credit : our own

రవితేజను మోసం చేసిన బండ్ల గణేష్..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. "రవితేజ చాలా మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి. గతంలో రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహారంలో ఒక సంఘటన జరిగింది. నా దగ్గర 30 ఎకరాల పొలం ఉంది. దాన్ని అమ్మడానికి ప్రయత్నించినప్పుడు ఒకరు కొనడానికి వచ్చారు. కానీ అతను ఓ షరతు పెట్టాడు.. ఆ పక్కనే ఉన్న 25 ఎకరాలు కూడా ఉంటేనే కలిపి కొంటానని అన్నాడు. అయితే ఆ సమయంలో అందులో కొంత భాగం రవితేజ దగ్గర ఉంది. ఆ పొలాన్ని రవితేజ నుండి తీసుకోవడానికి ఓ అబద్ధం ఆడాను. ప్రభుత్వం ఆ భూమిని అక్వైర్ (వశపరుచుకోవడం) చేస్తోందని, కాబట్టి అమ్మేయడం మేలని అబద్ధం చెప్పాను. దాంతో ఆయన మాట నమ్మి రవితేజ కూడా భూమి అమ్మేశాడు" అని బండ్ల తాను చేసిన తప్పును నిజాయితీగా చెప్పుకొచ్చారు.

46
బండ్ల గణేష్ సారీ చెబితే.. రవితేజ ఏమన్నాడంటే?
Image Credit : Asianet News

బండ్ల గణేష్ సారీ చెబితే.. రవితేజ ఏమన్నాడంటే?

రవితేజ, బండ్ల గణేష్‌పై ఉన్న నమ్మకంతో ఏమాత్రం సందేహించకుండా ఆ మాటలను నమ్మి తన వద్ద ఉన్న భూమిని ఇచ్చేశారు. ఆ తర్వాత గణేష్‌కి చాలా బాధనిపించింది. "ఆయనతో సినిమా చేస్తే నాకు ఐదు కోట్ల లాభం వచ్చింది. అటువంటి మనిషినా నేను మోసం చేసింది?" అని రవితేజ లాంటి ఒక మంచి వ్యక్తిని, నిజాయితీపరుడిని మోసం చేశాననే భావన ఆయన మనసును బాగా తొలచివేసింది. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్న బండ్ల గణేష్ నేరుగా రవితేజ వద్దకు వెళ్లి, ఆ రోజు తాను అబద్ధం చెప్పి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకుని క్షమాపణలు కోరారు.

56
రవితేజ సంస్కారానికి షాక్ అయిన బండ్ల..
Image Credit : Asianet News

రవితేజ సంస్కారానికి షాక్ అయిన బండ్ల..

అయితే దీనికి రవితేజ స్పందించిన తీరు ఆయన గొప్పతనానికి, సంస్కారానికి నిదర్శనంగా నిలిచింది. రవితేజ ఎలాంటి కోపం కానీ, ఆవేశం కానీ ప్రదర్శించకుండా.. "నాకు ఆ రోజే ఆ విషయం తెలుసురా" అని చాలా ప్రశాంతంగా ఒక్క మాటతో తేల్చేశారు. విషయం తెలిసి కూడా తనను ఏమీ అనకుండా మన్నించిన రవితేజ మనస్తత్వానికి బండ్ల గణేష్ ఆశ్చర్యపోయారు.

66
రుణం తీర్చుకుంటానన్న బండ్ల గణేష్..
Image Credit : Bandla Ganesh

రుణం తీర్చుకుంటానన్న బండ్ల గణేష్..

ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ రవితేజ ఎంతటి దయాగుణం, పెద్ద మనసు ఉన్న వ్యక్తినో బండ్ల గణేష్ గుర్తు చేసుకున్నారు. ఎవరిపైనా పగ, ద్వేషాలు పెంచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే మనస్తత్వం రవితేజది. అంతటి గొప్ప వ్యక్తికి తాను ఏదో ఒక రోజు కచ్చితంగా ఆ రుణం తీర్చుకుంటానని గణేష్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఇండస్ట్రీలో ఎంతటి ఎత్తుకు ఎదిగినా తోటి వ్యక్తుల పట్ల చూపించే నమ్మకం, సహనం, నిజాయితీలే మాస్ మహారాజా రవితేజను అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
చిరంజీవిని పేరు పెట్టి పిలిచే ఏకైక కమెడియన్, పవన్ కళ్యాణ్ 'అన్నయ్య' అని పిలుచుకునే నటుడు ఎవరో తెలుసా?
Recommended image2
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved