- Home
- Entertainment
- India Top 10 Heroes: దూసుకొచ్చిన రామ్ చరణ్, రేస్ నుంచి ఎన్టీఆర్ ఔట్, పడిపోయిన మహేష్.. టాప్ హీరో ఎవరంటే?
India Top 10 Heroes: దూసుకొచ్చిన రామ్ చరణ్, రేస్ నుంచి ఎన్టీఆర్ ఔట్, పడిపోయిన మహేష్.. టాప్ హీరో ఎవరంటే?
India Top 10 Heroes: ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్ 10 హీరోల జాబితా వచ్చింది. జూన్ నెలకు సంబంధించిన లిస్ట్ ని ఓర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసింది. ఇందులో స్టార్స్ ప్లేస్లు తారుమారయ్యాయి.

ఇండియా టాప్ 10 హీరోల జాబితా
ఓర్మాక్స్ మీడియా జూన్ నెలకు సంబంధించి ఇండియా టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోల జాబితాని విడుదల చేసింది. అయితే ఈ ఏడాది అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రామ్ చరణ్ దూసుకొచ్చాడు. మహేష్ బాబు డౌన్ అయ్యాడు. ఎన్టీఆర్ అసలు లిస్ట్ లోనే లేడు. ఇంకోవైపు తమిళ స్టార్ సూర్య మొదటి సారి లిస్ట్ లోకి వచ్చాడు. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ కూడా లిస్ట్ లో లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జూన్ నెలకు సంబంధించి ఇండియా టాప్ 10 హీరోలు ఎవరనేది చూస్తే.
నెంబర్ 1 ప్రభాస్, 2.షారూఖ్ ఖాన్, 3.విజయ్
ఎప్పటిలాగానే ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. చాలా ఏళ్లుగా ఆయన మొదటి స్థానంలో ఉంటున్నారు. దాన్ని పదిలంగా ఉంచుకుంటున్నారు. ఆయనకు వరుసగా మొదటి స్థానంలోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా నెంబర్ 1లోనే ఉన్నారు. ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. రెండో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఉన్నారు. మూడో స్థానంలో తమిళనాడు సీఎం, దళపతి విజయ్ ఉండటం విశేషం. వీరి ముగ్గురు స్థానాలు మేలోనూ సేమ్. ఇప్పుడు కూడా సేమ్ అని చెప్పొచ్చు.
4వ స్థానంలో అల్లు అర్జున్
ఇక నాల్గో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. అంతకు ముందు మూడో స్థానంలో, రెండో స్థానంలో ఉన్న బన్నీ.. గత నెలలోనే డౌన్ అయ్యాడు. నాల్గో స్థానానికే పరిమితమయ్యాడు. అయితే బన్నీకి సంబంధించిన పెద్దగా అప్ డేట్లు లేవు. దీంతో ఆయన కొంత డౌన్‌లోనే ఉన్నారు.
దూసుకొచ్చిన రామ్ చరణ్
ఐదో స్థానంలోకి రామ్ చరణ్ వచ్చాడు. మే నెలలో 7వ స్థానంలో ఉన్న చరణ్ ఇప్పుడు ఐదో స్థానంలోకి దూసుకురావడం విశేషం. గత నెలలో చరణ్ నటించిన `పెద్ది` సినిమా విడుదలైంది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో రామ్ చరణ్‌పై చర్చ నడిచింది. అందుకే ఆయన ఐదో స్థానంలోకి దూసుకొచ్చాడు.
పడిపోయిన మహేష్‌బాబు
ఆ తర్వాత మహేష్ బాబు ఉన్నాడు. ఆయన గతంలో ఐదో స్థానంలో ఉండేది. ఒక్క స్థానం పడిపోయి ఆరో స్థానంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో `వారణాసి` సినిమాలో నటిస్తున్నారు. గ్లోబల్ ఫిల్మ్ గా ఇది రూపొందుతుంది. ఈ క్రమంలో మహేష్ కూడా బిజీగా ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఏడో స్థానంలో కోలీవుడ్ స్టార్ సూర్య వచ్చాడు. ఆయన `కరుప్పు` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. గత నెలలో సూర్య జోరు కనిపించింది. దీంతో ఆయన ఈ టాప్ 10 లిస్ట్ లోకి దూసుకొచ్చాడు.
రేసు నుంచి తప్పుకున్న ఎన్టీఆర్
ఆ తర్వాత మొత్తం బాలీవుడ్ హీరోలదే హవా. ఎనిమిదో స్థానంలో సల్మాన్ ఖాన్ ఉండగా, తొమ్మిదో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నాడు. పదో స్థానంలో రణ్వీర్ సింగ్ ఉన్నాడు. `ధురంధర్` వల్ల మూడు నాలుగు నెలలు జోరు చూపించిన ఆయన ఇప్పుడు క్రమంగా డల అవుతున్నాడు. పదో స్థానానికి పరిమితమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ లిస్ట్ లోనే అసలు ఎన్టీఆర్ లేకపోవడం షాకిస్తోంది. ప్రతి నెల ఏదో స్థానంలో ఉండే ఆయన అసలు టాప్ 10 లిస్ట్ లో నుంచే ఔట్ అయ్యారు. రేస్ నుంచి తప్పుకున్నాడు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇది అయన అభిమానులను కలవరానికి గురి చేస్తుంది.

