MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam:మోనితకు షాకిచ్చిన డాక్టర్ బాబు.. వంటలక్కని చూసిన ఆనంద్ రావు!

Karthika Deepam:మోనితకు షాకిచ్చిన డాక్టర్ బాబు.. వంటలక్కని చూసిన ఆనంద్ రావు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 27వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం... 

3 Min read
Author : Navya G
| Updated : Aug 27 2022, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఎందుకమ్మా ఇంటికి రావడానికి నువ్వు ఇలా సంకోచిస్తున్నవు అని ఆనందరావు సౌర్యని అడగగా, అక్కడ హిమ ఉన్నది తాతయ్య నేను రాలేను అని శౌర్య అంటుంది.అప్పుడు ఆనందరావు మరి ఏం చేస్తే కోపం తగ్గుతుంది అమ్మ అని అనగా అమ్మానాన్నలను దూరం చేసినందువలన కోపం వచ్చింది కదా మళ్ళీ అమ్మానాన్నల దగ్గర అయితే కోపం పోతుందేమో తాతయ్య అని అంటది. ఇంకెన్ని రోజులు అమ్మా ఇలాగా ఉంటావు అని ఆనందరావు అడుగుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 నన్ను వదిలేసి మీరు బానే అమెరికా వెళ్ళిపోయారు కదా మళ్లీ ఎందుకు వచ్చారు. ఏదో పని ఉండి ఇటువైపు వచ్చి ఉంటారు అలా చూడడానికి నా దగ్గర కి వచ్చి ఉంటారు. అయినా మీరు ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయారో అప్పుడే నన్ను మీరు వదిలేసారు. ఇంక నేను ఆ ఇంటి వైపు రాను అని అంటుంది శౌర్య. అప్పుడు హిమ సౌందర్యలు వెనకాతల నుంచి వింటూ నేను చెప్పాను కదా నానమ్మ కరెక్ట్ గా అదే సమయంలో శౌర్య వచ్చింది లేకపోతే ఇప్పటికీ హాయిగా మనం కలిసి ఉండే వాళ్ళము అని అంటుంది.
 

37

అప్పుడు సౌందర్య, అది ఇంటికి రాకూడదని సాకులు వెతుకుతుంది. రావాలనుకుంటే తాతయ్యా వెళ్ళినప్పుడే వచ్చేది కదా అని అంటుంది.ఇంతట్లో ఆనందరావు సౌర్యకి కొన్ని బట్టలు ఇస్తారు అప్పుడు శౌర్య, నాకు వద్దు తాతయ్య ఈ బట్టలు చూస్తే నాకు ఆ ఇంటికి రావాలనిపిస్తుంది అక్కడ హిమ ఉంటుంది. దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి వారిని పంపించేస్తుంది. ఇంతట్లో ముగ్గురు కార్ ఎక్కి బయలుదేరుతారు అదే సమయంలో దీపా ఆటోలో వెళుతూ వెళుతూ మొనిత శివని తీసుకువెళ్లిపోయిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
 

47

ఇంతట్లో ఆ కారు ఆటో రెండు పక్క పక్క నుంచి వెళ్తాయి. ఆనందరావు దీప ని చూస్తాడు కార్ దిగి దీప కనిపించింది అని అంటాడు. అప్పుడు మీ భ్రమయుంటుందిలెండి తాతయ్య అని హిమా అంటుంది. నాకు కూడా కార్తీక్ కనిపిస్తుందంటూ అనిపించేది కానీ తిరిగి చూస్తే కార్తీక్ ఉండేవాడు కాదు అని సౌందర్య అంటుంది. భ్రమయుంటుందిలే అని ఆనందరావు వాళ్ళు మళ్ళీ తిరిగి కార్ ఎక్కుతారు.దీపా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఎందుకు అన్నయ్య టెస్ట్ చేస్తున్నావు అని అనగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు కదమ్మా అన్ని జాగ్రత్తగా ఉండాలి.
 

57

 అది సరేగాని ప్రయత్నాలు ఏమయ్యాయి అని అడగగా జరిగిన విషయం అంత చెప్తుంది దీప. ఒకవేళ కార్తీక్ మొనిత ని గుర్తుపట్టినట్లయితే నిన్ను కూడా గుర్తుపడతాడు నిన్ను గుర్తు పడితే సమస్య తీరిపోయినట్టే కదా అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్, మొనిత గదిలో ఉంటారు అప్పుడు కార్తీక్ కి కొంచెం కొంచెం గతం గుర్తొచ్చి దీప అంటాడు. మౌనితని, దీపా  ఇప్పుడేమైనా అన్నానా, నువ్వు వినకూడనిది ఏదైనా అన్నానా దీప అని మొనిత నీ దీపా అని పిలుస్తాడు.
 

67

మొనిత ఆశ్చర్యపోయి ఇప్పుడు దీపా అంటే కార్తిక్ గతం గుర్తొచ్చే అవకాశం ఉన్నది. నా టాబ్లెట్లు పనిచేయడం మానేస్తున్నాయా అని మనసులో అనుకొని మొనిత అనే అన్నావు కార్తీక్ అని అంటుంది మౌనిత. అప్పుడు నాకు కొంచెం తలనొప్పిగా ఉన్నది తల పట్టు మొనిత అని కార్తీక్ అనగా తను తల పట్టుకుంటేనే పేరు గుర్తొచ్చింది,నేను మధ్దన చేస్తే గతం గుర్తొచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి ఫోన్ వచ్చింది అని తప్పించుకుంటుంది మోనిత.
 

77

 ఆ తర్వాత సీన్లో హిమ శౌర్య ఆనందరావు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.సౌర్యని తీసుకువచ్చేయాల్సింది బలవంతంగా అయినా అని ఆనందరావు అనుకోగా ఒకవేళ మన ఇంటికి తీసుకువచ్చిన తర్వాత సౌర్య మళ్ళీ పారిపోతే అప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు సౌర్య ఎక్కడుందో మనకు తెలుసు కనుక ఎప్పుడు చూడాలనుకున్నా చూసి వెళ్లొచ్చు. ప్రస్తుతానికి ఇలా ఉండడమే మంచిది అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో మొనిత కార్ దిగి  కార్తీక్, దీప అని పిలవడం  గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం
Recommended image2
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Recommended image3
S Janaki: ఎస్ జానకి ఒకే గెటప్ లో ఎందుకు కనిపిస్తారో తెలుసా ? దాని వెనకున్న విషాదం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved