MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాన్వీ కపూర్‌ పెళ్లి అక్కడే.. క్లారిటీ ఇచ్చిన `దేవర` నటి.. మ్యారేజీ రోజు స్పెషల్‌ ఏంటంటే?

జాన్వీ కపూర్‌ పెళ్లి అక్కడే.. క్లారిటీ ఇచ్చిన `దేవర` నటి.. మ్యారేజీ రోజు స్పెషల్‌ ఏంటంటే?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌.. పెళ్లిపై స్పందించింది. ఇటీవల రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో జాన్వీ అదిరిపోయే విషయం బయటపెట్టింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 08 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ ప్రస్తుతం భారీ సినిమాల్లో భాగమవుతుంది. తెలుగులో రెండు భారీ సినిమాలు చేస్తుంది. దీంతో ఆమె రేంజ్‌ పెరిగిపోయింది. సొంత ఇండస్ట్రీలో నాలుగైదేళ్లుగా రాని క్రేజ్‌ తెలుగులో జస్ట్ ఒక్క సినిమాతో వచ్చేసింది. ఈ సినిమాలు విడుదలకు ముందే జాన్వీ పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. ఆమె క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ క్రమంలోనే జాన్వీ కపూర్‌పై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఓ వ్యాపార వేత్తతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. యంగ్‌ బిజినెస్‌ మ్యానర్‌ శిఖర్‌ పహారియాతో ఆమె డేట్‌ చేస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు కలిసి కెమెరాకి చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌పై సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్‌ పెళ్లికి సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రియుడితోనే మ్యారేజ్‌ ఉంటుందనే గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై జాన్వీ కపూర్‌ స్పందించింది. పెళ్లిపై ఆమె రియాక్ట్ అయ్యింది. తన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేసుకుంటుందో వెల్లడించింది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలను, తన సెంటిమెంట్లని రివీల్‌ చేసింది జాన్వీ కపూర్‌. 
 

47

జాన్వీ అమ్మ శ్రీదేవికి తిరుపతి వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం. ఇష్టదైవంగా పూజిస్తుంది. ఆమె తరచూ తిరుపల శ్రీవారిని దర్శించుకునేది. జాన్వీ కపూర్‌ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంది. తరచూ ఆమె తిరుమలలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే జాన్వీ తన మ్యారేజ్‌పై రియాక్ట్ అయ్యింది.

57

తాను మ్యారేజ్‌ చేసుకుంటే తిరుమలలలోనే చేసుకుంటానని తెలిపింది. శ్రీవారి సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అంతేకాదు పెళ్లి రోజు తాను గోల్డెన్‌  శారీ కట్టుకుంటుందట. గోల్డ్ శారీ కట్టుకుని పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. కానీ పెళ్లెప్పుడో చెప్పలేదు జాన్వీ. 

67

అయితే శిఖర్‌తో లవ్‌ విషయంపై ఆమె రియాక్ట్ కాలేదు. దాన్ని దాటవేసింది. అంటే ప్రస్తుతం ఆమె లవ్ లోనే ఉన్న విషయం స్పష్టమవుతుంది. మరి బిజినెస్‌ మ్యాన్‌నే పెళ్లి చేసుకుంటుందా? లేక తండ్రి చూపించిన వ్యక్తిని మ్యారేజ్‌ చేసుకుంటుందా అనేది చూడాలి. అయితే ఇటీవల బాలీవుడ్‌లోని భామలంతా తోటీ హీరోలను, వ్యాపారవేత్తలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 
 

77

ఇక జాన్వీ కపూర్‌.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్‌ సరసన `దేవర` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెది కాస్త డీ గ్లామర్‌ రోల్‌ అని తెలుస్తుంది. దీంతోపాటు రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది జాన్వీ. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved