MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైదరాబాద్ లో ఇల్లు కొన్న జాన్వీ కపూర్, ఇక్కడికి మకాం మార్చబోతోందా..?

హైదరాబాద్ లో ఇల్లు కొన్న జాన్వీ కపూర్, ఇక్కడికి మకాం మార్చబోతోందా..?

బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ హైదరాబాద్ లో ఇల్లు కొనబోతున్నారా..? ఇక్కడే సెటిల్ అవుతుంది.. లేక అక్కడికి ఇక్కడికి షటిల్ సర్వీస్ చేస్తుందా..? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 30 2023, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janhvi Kapoor

Janhvi Kapoor

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మంచి దూకుడు మీద ఉంది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను .. చాలా తక్కువ టైమ్ లో సాధించిన యంగ్ బ్యూటీ... ప్రస్తుతం సౌత్ ఎంట్రీ ఇస్తోంది.అది కూడా టాలీవుడ్ సినిమా నుంచి పాన్ ఇండియాను శాసించడానికి రెడీ అవుతోంది.
 

26

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ కపూర్.  ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీ  బిజీగా ఉన్నారు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈమూవీలో చేపలు పట్టే ఫ్యామిలీ అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించబోతోంది. 

36

ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ తో పాటు.. జాన్వీ కపూర్ కెరీర్ కూడా మలుపులు తిరగబోతోంది. అందులోనూ ఇప్పటి వరకూ డిఫరెంట్ మూవీ చేస్తూ వచ్చిన జాన్వీ.. పక్కా కమర్షియల్ ఫిల్మ్ చేయడం ఫస్ట్ టైమ్. ఇక ఈసినిమా రిలీజ్ అవ్వకముందే.. టాలీవుడ్ నుంచే కాకుండా.. సౌత్ లో అన్ని భాషల నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయట.  ఇప్పటికే  దేవర షూటింగ్ కోసం జాన్వీ తరచూ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్లి రావాలి అంటే ఎంతో ఇబ్బంది పడుతుందట. 

46
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram

వచ్చిన తరువాత కూడా హోటల్స్ లో ఉండటం కూడా ఇబ్బందిగా ఉంటుందట.  అందుకే ఆమె ఏకంగా హైదరాబాద్ కు మకాం  మార్చి.. కొన్నిరోజులు ఇక్కడ.. కొన్ని రోజులు ముంబయ్ లో ఉండేట్టు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇక్కడ వరుసగాసినిమాలలో బిజీ అయితే..ఎక్కువ రోజులు ఉండటానికి సౌత్ లో  తనకంటూ ఓ ప్రాపర్టీ ఉండేలా ప్లాన్ చేస్తుందట. అందుకే ఆమె హైదరాబాద్ లో ఓ ప్లాట్ ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 
 

56
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram

ఈ సినిమా షూటింగ్స్  కోసం జాన్వీ ఏకంగా  హైదరాబాదులో ఉండటానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.జర్నీ చేయడం వల్ల తాను షూటింగ్ పై ఫోకస్ చేయలేకపోతున్నానని అందుకే ఇక్కడే ఉంటే ప్రశాంతంగా సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
 

66

ఇక జాన్వీ సౌత్ సినిమాలలో బిజీఅవ్వడం ఖాయం..ఇక్కడ ఆమెకు నచ్చితే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు. ఈ మధ్య తమిళ సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది అని టాక్ గట్టిగా నడిచింది. ఇక  ఏది ఏమైనా మూడు కోట్లు పెట్టి జాన్వీ కపూర్ ప్లాట్ కొన్నదన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హైదరాబాద్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved