MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: మల్లికను ప్రమాదం నుంచి కాపాడిన జ్ఞానాంబ.. మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి?

Janaki Kalaganaledu: మల్లికను ప్రమాదం నుంచి కాపాడిన జ్ఞానాంబ.. మల్లికకు వార్నింగ్ ఇచ్చిన జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Nov 25 2022, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో జానకి మాట్లాడుతూ ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు రామ గారు భవిష్యత్తులో ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి,తనకి నేను కారణం కాకుండా ఉండడానికి అని అంటుంది. తనకి అంటే ఐపీఎస్ కాదు కేవలం రామచంద్ర భార్య భార్య మాత్రమే అని అనడంతో ఆ మాటలు విన్న మల్లిక సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర సరే జానకి గారు రెండే రెండు రోజుల్లో మిమ్మల్ని కాలేజీకి వెళ్లేలా చేయకపోతే నేను  జానకి భర్తనే కాదు అంటూ శపదాలు చేస్తాడు రామచంద్ర. వారి మాటలు విన్న మల్లిక సంతోషంతో గెంతులు వేస్తూ సంతోషపడుతూ ఉంటుంది.
 

26

 మల్లికా పిచ్చి గంతులు వేస్తూ ఉండగా అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. అప్పుడు మల్లిక డాన్స్ చేస్తూ కింద పడిపోతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి మల్లిక ను కాపాడుతుంది. అప్పుడు కావాలనే మల్లిక ఓవరాక్షన్ చేస్తూ కాలు బెణికింది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు అందరూ అక్కడికి రావడంతో జ్ఞానాంబ అసలు విషయం చెప్పగా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ మల్లికకు ఫుల్లుగా క్లాస్ పీకుతుంది. నువ్వు గర్భవతి వి అన్న విషయాన్ని కూడా మర్చిపోయావా అని తిడుతుంది.
 

36

 అప్పుడు జ్ఞానాంబ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి తలుచుకుని భయపడుతూ వెంటనే గోవిందరాజులు కి పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడమని చెబుతుంది. అప్పుడు పంతులుగారు మీ ఆందోళన నాకు అర్థమైంది రేపు కుటుంబ సమేతంగా అందరూ శివాలయానికి రండి అందరూ కలిసి శివుడికి అభిషేకం చేస్తే మీ దోషాలన్నీ పోతాయి అని చెప్పడంతో సరే అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జానకికి మల్లిక ని లోపలికి పిలుచుకొని వెళ్ళు అని చెబుతుంది జ్ఞానాంబ. అప్పుడు రామచంద్ర నేను రేపు నీ సమక్షంలోనే జానకి గారి మనసు మారుస్తాను స్వామి అనుకుంటూ ఉంటాడు.
 

46

తర్వాత మల్లిక ఓవరాక్షన్ చేస్తూ ఉండగా అప్పుడు జానకి ఓవరాక్షన్  చేసింది చాలు ఆపు అనడంతో నీకు తెలిసిపోయింది కదా ఇంక నటించడం ఎందుకు అంటూ మల్లిక జానకి ముందు కాలు మీద కాలు వేసుకుంటుంది. తల్లి లాంటి అత్తయ్య గారిని తండ్రి లాంటి మామయ్య గారిని మోసం చేస్తున్నావు అసలు విషయం తెలిసిన రోజు నిన్ను క్షమించరు అనడంతో వెంటనే మల్లిక తెలిస్తే నీ ద్వారా తెలియాలి. అసలు నిజం తెలుసుకుని నువ్వే ఇంతవరకు ఏమీ చేయలేకపోయావు అని అంటుంది మల్లిక. అప్పుడు జానకి సమయం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు గుర్తుపెట్టుకో మల్లిక అని అంటుంది.
 

56

 అప్పుడు జానకి మల్లికకు ఫుల్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే జ్ఞానాంబ కుటుంబం అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఆ తర్వాత రామచంద్ర జానకిలను వెళ్లి గుడి చుట్టు ప్రదక్షిణలు చేసి రమ్మని చెప్పగా చేసి అప్పుడు జెస్సి మేము కూడా వెళ్తాము అనడంతో వద్దు చేసి నువ్వు కడుపుతో ఉన్నావు తేమ ఉండి కాలు జారితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నువ్వు ఇక్కడే ఉండు అనడంతో సరే అని అంటుంది జెస్సీ. తర్వాత జానకి రామచంద్ర ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ మాట్లాడుకుంటూ గుడి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు.

66

ఆ తర్వాత మల్లిక చుట్టూ చూస్తూ ఉండగా అప్పుడు చికిత దేవుడి మీద భక్తితో ముందు చూడండి అని అనడంతో వెంటనే గోవిందరాజులు తన దృష్టి మొత్తం పంతులుగారు ఇచ్చే ప్రసాదం మీద ఉంటుంది అంటూ సెటైర్లు వేస్తాడు.  ఆ తరువాత పూజ పూర్తవడంతో అందరూ కలిసి కోనేట్లో దీపాలు వెలిగించడానికి వెళ్తారు. అప్పుడు రామచంద్ర జానకితో మాట్లాడుతూ మీరు ఐఏఎస్ అయి మీ కల నెరవేరాలని కోరుకోండి అనటంతో నిజమయ్యే కోరికలు కోరుకోవాలి కానీ ఇలాంటి కోరికలు కాదు రామచంద్ర గారు అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved