- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి వదినకు అతిధి మర్యాదలు చేసిన జ్ఞానంబ.. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన యోగి!
Janaki Kalaganaledu: జానకి వదినకు అతిధి మర్యాదలు చేసిన జ్ఞానంబ.. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన యోగి!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రేటింగ్ లో కూడా బాగానే దూసుకెళ్తుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జ్ఞానాంబ (Jnanamba) ఇంటికి ఊర్మిళ వచ్చి అమ్మ కాళ్లకి ఈరోజు దండం పెట్టి అయినా సరే ఈ గొడవలకు ముగింపు పలుకుతాను అని వెన్నెలతో చెబుతుంది. ఈ లోపు అక్కడకు జ్ఞానాంబ ఫ్యామిలీ స్టేషన్ నుంచి వస్తారు. ఇక ఊర్మిళ (Urmila) మా ఆయన చేసిన తప్పు చేయరానిది చెల్లెలి మీద ప్రేమతో నిజా అనిజాలు తెలుసుకోకుండా ఇలా చేసారు అని క్షమాపణలు అడుగుతుంది.
ఇక జ్ఞానాంబ (Jnanamba) అవేమీ పట్టించుకోకుండా ఊర్మిళ ను లోనికి రావమ్మ అని పిలుస్తుంది. అంతేకాకుండా తన కొడుకుని కాసేపు ముద్దులాడుతుంది. ఆ తర్వాత ఊర్మిళ (Urmila) చేతిలో చీర సారె పెట్టి ఒక 5000 బహుమానంగా పెట్టి మరీ చల్లగా బతుకు అంటూ దీవిస్తుంది జ్ఞానాంబ.
దాంతో ఊర్మిళ (Urmila) ఎంతో ఆనంద పడుతుంది. ఈ క్రమంలో జానకి ప్రస్తావన తీసుకు రాగా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఐతే ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు అని జ్ఞానాంబ అంటుంది. ఆ తర్వాత జానకి (Janaki) ఊర్మిళ ను చూసి ఎంతో ఆనంద పడుతుంది.
ఇక అది చూసిన జనాంబ (Jnanamb) చేసిందంతా చేసి పోలీస్ స్టేషన్ లో మీ అన్నయ్య తో గొడవ పడుతున్నావు అని జానకి ను దెప్పిపొడుస్తుంది. ఇలా జరగడానికి జానకి కారణమని జ్ఞానాంబ అనుకుంటుంది. ఆ క్రమంలో జానకి (Janaki) జ్ఞానాంబ ఎంత చెప్పిన వినదు.
ఇక జ్ఞానాంబ (Jnanamba) జానకి ను నానా మాటలతో బాధపడేలా మాట్లాడుతుంది. ఇక ఆ తర్వాత రామచంద్ర జరిగే దానికి అమ్మని బాధ పడకుండా ఉండమని చెప్పాలి. లేకపోతే అప్పటివరకు నా మనసు ఆగేలా లేదు అని జానకి (Janaki) తో చెబుతూ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటాడు.
ఇక తరువాయి భాగంలో జానకి (Janaki) యోగి తో నువ్వు నా అన్నయ్య వో శత్రువో అర్థం కావడం లేదు. మీ కారణంగా నా సుఖసంతోషాలు పోయాయి అని ఏడుస్తుంది. ఆ తర్వాత యోగి జ్ఞానాంబ (Jnanamba) కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. కానీ జ్ఞానాంబ పట్టించు కోకుండా వెళ్ళిపోతుంది.