MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పిల్లలు పుట్టరంటూ పెళ్లికి ముందు డాక్టర్లు షాక్.. గతాన్ని తలచుకుని షోలో రోజా కన్నీళ్లు.. ఇంద్రజ ఓదార్పు

పిల్లలు పుట్టరంటూ పెళ్లికి ముందు డాక్టర్లు షాక్.. గతాన్ని తలచుకుని షోలో రోజా కన్నీళ్లు.. ఇంద్రజ ఓదార్పు

`జబర్దస్త్` జడ్జ్, నటి, ఎమ్మెల్యే రోజా తన జీవితంలోని అతిపెద్ద సీక్రెట్‌ని బయటపెట్టింది. ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఓ షోలో ఓపెన్‌ అయి కన్నీళ్లు పెట్టుకుంది. తన పెళ్లికి ముందు, హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు అనుభవించిందో తెలిపింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Sep 03 2021, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`వినాయక చవితి` స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో రష్మీ, సుధీర్‌, రోజా, హైపర్‌ ఆది, వర్ష చేసిన సందడి ఆద్యంతం ఆకట్టుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇందులో భాగంగా ప్రోమో చివర్లో `జబర్దస్త్` జడ్జ్ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సినీ జీవితం మొత్తం అప్పులు కట్టడానికే అయిందని వాపోయారు. అంతేకాదు పెళ్లికి ముందు తనలో ఉన్న పెద్ద ఫైర్‌ బ్రాండ్‌ని బయటపెట్టారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా దాచుకున్న విషయాన్ని అందరి ముందు ఓపెన్‌ అయి కన్నీరు మున్నీరమయ్యింది రోజా. 
 

36

తాను 1991లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని తెలిపింది. దాదాపు 11ఏళ్లు అంటే 2002 వరకు తాను నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ ఎమోషనల్‌ అయ్యింది రోజా. 1990-2000 వరకు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది రోజా. 
 

46

పీక్‌ టైమ్‌లోనూ తాను అప్పులే కట్టాల్సి వచ్చిందని చెప్పి షాక్‌ ఇచ్చింది. మరోవైపు పెళ్లికి ముందు తన జీవితంలోని మరో సీక్రెట్‌ని వెల్లడించింది. పెళ్లికి ముందే తనలో పెద్ద ఫైర్‌ బ్రాండ్‌ ఉందని, డాక్టర్లు పిల్లలు కారని చెప్పారట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది రోజా. 

56

పిల్లలు కారనే విషయం తనని బాగా కుంగదీసిందని, కానీ పెళ్లి తర్వాత ఏడాదిలోనే తనకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్‌ అయ్యిందని చెప్పింది. మొదటగా అన్షు పుట్టిందని, అందుకే తానంటే ఎంతో ఇష్టమని తెలిపింది. దీంతో చలించిపోయిన ఇంద్రజ పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హగ్‌ చేసుకుని రోజాని ఓదార్చింది. 

66

తన ఇద్దరు పిల్లలు కూతురు అన్షు, కుమారుడితో కలిసి ఈ షోలో పాల్గొంది రోజా. అదిరిపోయే డాన్సులతో సందడి చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంది. హైలైట్‌గా నిలిచింది. రోజా గత విషయాలకు యాంకర్‌ రష్మీ, నటి ఇంద్రజ సైతం కన్నీళ్లు పెట్టుకోవడం అందరిని గుండె బరువెక్కించింది.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image3
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved