రష్మీ, అనసూయ ఏం సరిపోతారు... జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య అసలు తగ్గడం లేదు!
జబర్దస్త్ షో అనగానే కామెడీతో పాటు యాంకర్స్ గ్లామర్ కూడా గుర్తొస్తుంది. అంతగా రష్మీ గౌతమ్, అనసూయ తమ మార్క్ క్రియేట్ చేశారు. కొత్త యాంకర్ సౌమ్యరావు వాళ్ళను బీట్ చేసేలా ఉంది.
SowmyaRao
అనసూయ నిష్క్రమణతో సౌమ్యరావు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కన్నడ భామ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతుంది. తాజాగా స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది.
SowmyaRao
జబర్దస్త్ యాంకర్ పొజీషన్ కోసం చాలా మంది యాంకర్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. బెంగుళూరుకి చెందిన సీరియల్ నటికి మల్లెమాల ఛాన్స్ ఇచ్చింది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది.
SowmyaRao
సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ, అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. ఏకంగా హీరోయిన్ అయ్యే అవకాశం కల్పించింది. సౌమరావు రావడం ద్వారా రష్మీ రెండు షోలకు యాంకరింగ్ చేసే ఛాన్స్ కోల్పోయారు. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ రోల్ చేశారు.
SowmyaRao
అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి.
SowmyaRao
అయితే సౌమ్యరావు ఇంకా పాప్యులర్ కాలేదు. అనసూయ మాదిరి ఆమె షోకి అట్రాక్షన్ కాలేకపోతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది. సౌమ్యరావు శక్తిమేర ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది.
SowmyaRao
సౌమ్యకు ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఇస్తున్నారట. రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలకు పైనే తీసుకుంటున్నారు.