MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు

Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు

రవితేజకి ఎట్టకేలకు హిట్‌ పడింది. టాలెంట్‌ ఎవరిసొత్తు కాదని చిరంజీవి చెప్పినట్టుగానే బాక్సాఫీసు రికార్డులు ఎవరిసోత్తు కాదని రవితేజ ఇరుముడి మూవీతో నిరూపిస్తున్నారు. ఈ మూవీకి ఏడో రోజు కూడా అదిరిపోయే కలెక్షన్ల వచ్చాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 28 2026, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్రోల్స్, అవమానాలకు ఇరుముడితో రవితేజ అదిరిపోయే సమాధానం
Image Credit : Mythri Movie Makers

ట్రోల్స్, అవమానాలకు ఇరుముడితో రవితేజ అదిరిపోయే సమాధానం

మాస్‌ మహారాజా రవితేజకి చాలా ఏళ్ల తర్వాత హిట్‌ పడింది. `ధమాఖా` తర్వాత ఆయనకు విజయం దక్కిందని చెప్పొచ్చు. దీనికోసం చాలా డిజాస్టర్లు చూశారు. చాలా ట్రోల్స్ కి గురయ్యారు. చాలా అవమానాలు కూడా ఫేస్‌ చేయాల్సి వచ్చింది. రవితేజ పని అయిపోయిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ఇతర హీరోల సినిమాల్లో పాత్రలు చేసుకోవాల్సిందే అన్నారు. కానీ తానేంటో మరోసారి చూపించారు. రూట్‌ మార్చి జనం మెచ్చిన కథతో వచ్చారు. ఇప్పుడు `ఇరుముడి`తో బాక్సాఫీసుని ఊపేస్తున్నారు. ఈ మూవీకి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
టాక్సిక్‌ జోరు ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ
Image Credit : Asianet News

టాక్సిక్‌ జోరు ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ

ఓ వైపు థియేటర్లో యష్‌ `టాక్సిక్‌` మూవీ సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చినా ప్రారంభం రోజులు కాబట్టి, బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఇలాంటి భారీ సినిమా తాకిడికి తట్టుకొని నిలబడ్డారు రవితేజ. ఆయన నటించిన `ఇరుముడి` మూవీకి రెండో వారంలోనూ, అది కూడా వీక్‌ డేస్‌లోనూ మంచి కలెక్షన్లు రావడం విశేషం. అయితే బుధవారంతో పోల్చితే గురువారం కొద్దిగా తగ్గాయి. కానీ ఈ మూవీకిది పెద్ద వసూళ్లు అనే చెప్పాలి. మరి ఏడో రోజు ఈ సినిమాకి ఎంత వచ్చాయి? ఓవరాల్‌గా ఏడు రోజుల్లో ఇది ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.

34
ఇరుముడు 7 రోజుల కలెక్షన్లు
Image Credit : X/@MythriOfficial

ఇరుముడు 7 రోజుల కలెక్షన్లు

`ఇరుముడి` మూవీకి ఏడో రోజున రూ.6.90కోట్ల ఇండియా నెట్‌ వచ్చాయి. ఓవర్సీస్‌లో 65లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఏడో రోజు సుమారు రూ.8కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో దీనికి రూ.106.95కోట్ల గ్రాస్‌, రూ.92.15కోట్ల నెట్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.18కోట్లు రాబట్టింది. ఓవరా‌ల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.124.85కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. టీమ్‌ లెక్కల ప్రకారం రూ.150కోట్లకు దగ్గరలో ఉందని టాక్‌. ఇక రెండు వందల కోట్ల దిశగా ఈ సినిమా వెళ్లినా ఆశ్చర్యం లేదు.

44
ఇరుముడి మూవీకి లాభాల పంట
Image Credit : Asianet News

ఇరుముడి మూవీకి లాభాల పంట

సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు, థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.21కోట్లుగా లెక్క కట్టారు. ఇప్పటికే ఇది సుమారు రూ.65కోట్లపైగా షేర్‌ని సాధించింది. అంటే రూ.45కోట్లకుపైగా లాభాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఇది వంద కోట్ల షేర్‌ దిశగా వెళ్తుంది. మైత్రీ మూవీస్‌కి చాలా రోజులుగా హిట్‌ లేదు. ఇప్పుడు `ఇరుముడి` మూవీ వారిని సేవ్‌ చేసిందని, గట్టెక్కిందని చెప్పొచ్చు. మళ్లీ వారిని పుంజుకునేలా చేసింది. అంతేకాదు ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా చేసింది. సాయికుమార్‌, బేబీ నక్షత్ర, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిరా, స్వసిక విజయ్‌, లక్ష్మణ్‌ కీలక పాత్రలు పోషించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?
Recommended image2
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image3
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Related Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved