MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?

Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?

Irumudi Day 5 Collection: టాలీవుడ్ మాస్ హీరో రవితేజ ఎట్టకేలకు హిట్టు కొట్టాడు. చాలా కాలంగా సరైప సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజ.. ఇరుముడి సినిమాతో సక్సెస్ సాధించాడు. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈమూవీ 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 26 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రవితేజ ఇరుముడి కలెక్షన్లు..
Image Credit : Facebook

రవితేజ ఇరుముడి కలెక్షన్లు..

మాస్ మహారాజా రవితేజ నటించిన తెలుగు యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ థియేటర్లలో తన స్థిరమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. విడుదలైన ఐదవ రోజైన మంగళవారం నాడు ఈ చిత్రం సోమవారంతో పోలిస్తే కేవలం స్వల్ప తగ్గుదలను మాత్రమే నమోదు చేసుకుంది. వర్కింగ్ డేస్ లో కూడా రూ. 12 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిరూపించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
5వ రోజు వసూళ్లు ఎలాగున్నాయంటే..?
Image Credit : IRUMUDI KATTU/ T-Series Telugu

5వ రోజు వసూళ్లు ఎలాగున్నాయంటే..?

బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్ 'సాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం, 'ఇరుముడి' సినిమా 5వ రోజున భారతదేశంలో అంచనా ప్రకారం రూ. 12.20 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. సోమవారం (4వ రోజు) వచ్చిన రూ. 12.35 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 1.2 శాతం తగ్గుదల మాత్రమే కావడం గమనార్హం. ఈ ఐదవ రోజు వసూళ్లతో కలిపి, భారతదేశంలో ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్ రూ. 75.05 కోట్లకు చేరుకుంది. అలాగే భారతదేశంలో ఈ చిత్రం సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ. 87.05 కోట్లకు చేరింది. మంగళవారం రోజున దేశవ్యాప్తంగా మొత్తం 3,292 షోలు ప్రదర్శించబడగా, మొత్తం థియేటర్ల ఆక్యుపెన్సీ 62.3 శాతంగా నమోదైంది. సోమవారం రోజున 2,733 షోలు నిర్వహించగా, మంగళవారానికి ఆ సంఖ్య 3,292కి పెరగడం విశేషం.

Related Articles

Related image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Related image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
34
భాషల వారీగా కలెక్షన్ల వివరాలు:
Image Credit : Asianet News

భాషల వారీగా కలెక్షన్ల వివరాలు:

ఇరుముడి సినిమా 5వ రోజున వచ్చిన వసూళ్లలో ప్రధాన వాటా తెలుగు వెర్షన్‌దే కావడం గమనార్హం. తెలుగు వెర్షన్ చూసుకుంటే 3,184 షోల ద్వారా రూ. 12.17 కోట్ల నెట్ సాధించింది. తెలుగు థియేటర్లలో మొత్తం ఆక్యుపెన్సీ 64 శాతంగా నమోదైంది. తమిళ వెర్షన్ లో 108 షోల ద్వారా రూ. 3 లక్షలు రాబట్టింది. తమిళ థియేటర్లలో 13 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

షోల వారీగా ఆక్యుపెన్సీ వివరాలు:

మంగళవారం రోజున వేర్వేరు సమయాల్లో నమోదైన ఆక్యుపెన్సీ వివరాలు చూసుకుంటే..

మార్నింగ్ షోలు: 33.62%

మధ్యాహ్నం షోలు: 49.77%

ఈవినింగ్ షోలు: 63.92%

నైట్ షోలు: 79% (అత్యధిక ఆక్యుపెన్సీ)

44
రాష్ట్రాల వారీగా గ్రాస్ నివేదిక:
Image Credit : X/@MythriOfficial

రాష్ట్రాల వారీగా గ్రాస్ నివేదిక:

5వ రోజున ఇరుముడి సినిమా సాధించిన మొత్తం రూ. 14.05 కోట్ల ఇండియా గ్రాస్ వసూళ్లలో వివిధ రాష్ట్రాల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ‌- తెలంగాణ నుంచి అత్యధిక భాగం రూ. 12.50 కోట్లు రాబట్టగా.. కర్ణాటక నుంచి రూ. 1.10 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 20 లక్షలు, కేరళ నుంచి రూ. 1 లక్ష, ఇతర ప్రాంతాల నుంచి రూ. 24 లక్షలు సంపాదించగలిగింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటిన వసూళ్లు:

ఓవర్సీస్ లో కూడా 'ఇరుముడి' మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 5వ రోజున అంతర్జాతీయ మార్కెట్ల నుండి ఈ చిత్రం రూ. 1.50 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ మొత్తం గ్రాస్ రూ. 16.50 కోట్లకు చేరుకుంది. భారతదేశంలో సాధించిన రూ. 87.05 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను, విదేశీ గ్రాస్ వసూళ్లను కలిపితే, 'ఇరుముడి' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ. 103.55 కోట్ల గ్రాస్ సాధించి 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Related Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved