MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి

Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి

చిరంజీవి చేసిన రియల్ స్టంట్స్ గురించి ఓ విలన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మూవీలో రెడీగా అంబులెన్స్ ని పెట్టుకుని చిరంజీవి రిస్క్ చేసి మరీ ఫైట్స్ చేశారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 26 2026, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటుడిగా గుర్తింపు పొందేందుకు కెరీర్ ఆరంభంలో సర్వ శక్తులు ఒడ్డారు. ఎన్నో కష్టాలు అధికమించి నటుడిగా గుర్తింపు పొందడం మాత్రమే కాదు నంబర్ 1 స్థానానికి ఎదిగారు. చిరంజీవి పడ్డ కష్టం గురించి ప్రముఖ నటుడు, విలన్ పాత్రలతో మెప్పించిన విజయ రంగరాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తన సినిమాల్లో ఫైట్స్ నేచురల్ గా, అద్భుతంగా ఉండడం కోసం ఏం చేసేవారో రంగరాజు వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి, నేను రియల్ ఫైట్స్ చేశాం
Image Credit : Asianet News

చిరంజీవి, నేను రియల్ ఫైట్స్ చేశాం

రంగరాజు మాట్లాడుతూ.. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఎక్కువ సినిమాల్లో నేనే ఆయనతో ఫైట్స్ చేశాను. మా ఇద్దరి కాంబోలో ఉన్న ఫైట్స్ ఆల్మోస్ట్ అన్నీ రియల్ స్టంట్స్ అనే చెప్పాలి. రియల్ స్టంట్స్ అంటే నాకు, చిరంజీవి గారికి చాలా ఇష్టం. దేనికీ వెనుకాడే వాళ్ళం కాదు. ఈ సినిమాలో రియల్ స్టంట్స్ చేయాలా.. అయితే రంగరాజుని పెట్టండి అని చిరంజీవి గారు నన్ను రెకమండ్ చేసేవారు.

Related Articles

Related image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Related image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
35
దున్నపోతులతో తన్నించుకుంటూ..
Image Credit : Asianet News

దున్నపోతులతో తన్నించుకుంటూ..

పల్లెటూరి మొనగాడు సినిమాలో దున్నపోతుల మధ్యలో ఓ ఫైట్స్ ఉంటుంది. దున్నపోతుల మధ్యలో ఫైట్ అంటే అంత సులభం కాదు. అవసరం అయితే డూప్ లేదా ఏదైనా ట్రిక్ వాడొచ్చు. కానీ చిరంజీవి గారు నేను రియల్ గా చేశాం. దున్నపోతుల కట్టేసి ఉంటాయి. అయినప్పటికీ చాలా సార్లు వాటి కాళ్ళు మాకు తగిలేవి. చిరంజీవి గారు అంబులెన్స్ రెడీగా ఉంచేవారు. దెబ్బలు తగిలిన వెంటనే ఐస్ ప్యాక్ పెట్టుకోవడం .. తిరిగి వచ్చి మళ్ళీ ఫైట్స్ చేయడం.. రోజంతా ఇలాగే చేశాం.

45
చిరంజీవిపై బరువు పడకుండా మేనేజ్ చేశా
Image Credit : Asianet News

చిరంజీవిపై బరువు పడకుండా మేనేజ్ చేశా

లంకేశ్వరుడు మూవీలో మెట్ల మీది నుంచి దొర్లుతూ చేసే ఫైట్ కూడా రియల్. నాది భారీ పర్సనాలిటీ. నాపై చిరంజీవి గారు పడినా ఏమీ ప్రాబ్లెమ్ లేదు. కానీ నేను చిరంజీవి గారిపై పడితే ఆయనకి చాలా ఇబ్బంది. అయినప్పటికీ ఆయన రియల్ గానే చేశారు. నేను కొంత వరకు ఆయనపై బరువు పడకుండా మేనేజ్ చేశాను అని రంగరాజు తెలిపారు. చిరంజీవి గారు డ్యాన్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తారో ఫైట్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు అని రంగరాజు తెలిపారు.

55
స్నేహితుల కోసం చేసిన సినిమా
Image Credit : Asianet News

స్నేహితుల కోసం చేసిన సినిమా

యముడికి మొగుడు సినిమాలో కూడా రియల్ ఫైట్స్ ఉంటాయి. దీనితో చిరంజీవి గారు నన్ను పిలిపించారు. రంగరాజు ఈ మూవీలో రియల్ ఫైట్స్ ఉన్నాయి. మనం చేస్తున్నాం. ఇది నా ఫ్రెండ్స్ కోసం చేస్తున్నా సినిమా. కాబట్టి నువ్వు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయకూడదు అని అన్నారు. నేను వెంటనే ఓకె చెప్పాను. చాలా సినిమాలకు చిరంజీవి గారు నన్ను రెకమండ్ చేశారు. ఆయనతో మంచి బాండింగ్ ఉంది అని రంగరాజు తెలిపారు. యముడికి మొగుడు చిత్రానికి చిరంజీవి స్నేహితులు సుధాకర్, హరిప్రసాద్, నారాయణ రావు నిర్మాతలు అనే సంగతి తెలిసిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Related Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved