- Home
- Entertainment
- ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఇలియానా.. గోవా బ్యూటీ సర్‌ప్రైజ్‌కి అంతా షాక్.. పెళ్లెప్పుడైందంటూ ట్రోలర్స్ రచ్చ
ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఇలియానా.. గోవా బ్యూటీ సర్‌ప్రైజ్‌కి అంతా షాక్.. పెళ్లెప్పుడైందంటూ ట్రోలర్స్ రచ్చ
గోవా బ్యూటీ ఇలియానా డి సౌజా తన అభిమానులకు పెద్ద షాకిచ్చింది. మైండ్ బ్లాంక్ అయ్యే వార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించి అందరికి ఫ్యూజులెగిరిపోయేలా చేసింది.

Image: Ileana D'Cruz / Instagram
సన్నజాజి నడుముతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమని కొన్నాళ్లపాటు ఊపేసిన ఇలియానా ఇప్పుడు కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతుంది. ఆమె ప్రేమలో పడి విఫలమైన తర్వాత పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. దాన్ని దాటుకుని నటిగా మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. అడపాదడపా ఒకటి అర తప్ప పెద్దగా అవకాశాలు లేవు. తరచూ బీచ్‌లో బికినీలో కనిపిస్తూ ఫ్యాన్స్ కి అందాల విందు ఇస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ఈ భామ గుడ్ న్యూస్ చెప్పింది. షాక్‌తో కూడిన శుభవార్త చెప్పడం విశేషం. తాను తల్లికాబోతున్నట్టు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది ఇలియానా. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో `మామా` అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది. `అండ్ సో ది అడ్వెంచర్ బిగిన్స్`(ఇక సాహసయాత్ర ప్రారంభమవుతుంది) అని రాసి ఉన్న టీషర్ట్ ని పంచుకుంది ఇలియానా.
ఈ ఫోటోలకు ఆమె పోస్ట్ పెడుతూ, `కమింగ్ సూన్, నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను` అని పేర్కొంది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇలియానా ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నెటిజన్లకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు తన పెళ్లి మ్యాటర్ బయటకు రాలేదు. కనీసం ఆమె ప్రేమలో ఉన్నారనే వార్త కూడా లేదు. మరి ఇప్పుడు సడెన్‌గా ఈ ప్రెగ్నెన్సీ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెకి శుభాకాంక్షలు చెప్పేవారికంటే ప్రశ్నలు సందిస్తున్నవారే ఎక్కువైపోయారు. మాకు తెలియకుండా పెళ్లెప్పుడు చేసుకున్నావని, ఇంతకి ఆ చిన్నారికి తండ్రి ఎవరు ? , ఫాదర్ నేమ్ చెప్పవా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. వామ్మో ఇదేం షాక్ రా బాబు. ఇలా కూడా జరుగుతుంటాయా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా ఈ ఉదయం ఇంటర్నెట్‌లోనే కాదు, అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది ఇలియానా. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ మ్యాటర్ వైరల్ అవుతుంది.
అయితే నిజంగానే ఇలియానా తల్లికాబోతుందా? లేక ఏదైనా సినిమా ప్రమోషన్ కోసమా, ఏదైనా ప్రమోషనల్ స్టంటా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల `సాబ్ గజబ్` అనే వీడియో సాంగ్‌లో నర్తించింది ఇలియానా. బాద్షా రూపొందించిన ర్యాప్ పాప్ సాంగ్ ఇది. ఇందులో ఆమె చాలా బొద్దుగా కనిపించింది. ఊహించని విధంగా ఆమె లావెక్కి కనిపించింది. అలా చూస్తే ఇలియానా నిజంగానే ప్రెగ్నెంట్ అనేది కన్ఫమ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏదైనా ఇలియానా ప్రకటన సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్