MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..

Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..

Venkatesh: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం వల్ల అప్పులు ఊబిలో చిక్కుకుపోయాడు ఓ సీనియర్ నటుడు. ఇండస్ట్రీ వద్దు అనుకున్న టైమ్ లో వెంకటేష్ సినిమా అతన్ని కాపాడింది. ఇంతకీ ఎవారా నటుడు? తొమ్మదేళ్ల నరకం నుంచి ఎలా బయటపడ్డాడు?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 26 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విలన్‌గా చెరగని ముద్ర
Image Credit : Asianet News

విలన్‌గా చెరగని ముద్ర

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన రాయలసీమ యాసతో, విలక్షణమైన నటనతో విలన్‌గా, కామెడియన్‌గా చెరగని ముద్ర వేశారు దివంగత సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి (జెపి). ఆయన జీవితం వెండితెరపై కనిపించేంత సులువుగా ఏమీ సాగలేదు. కెరీర్ ఆరంభంలో ఆయన అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, పడ్డ కష్టాలు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులు, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తనను ఎలా ఆదుకున్నారో ఆయన స్వయంగా పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొమ్మిదేళ్ల పాటు జీతం లేని ఉద్యోగం.. అప్పుల బాధలు
Image Credit : our own

తొమ్మిదేళ్ల పాటు జీతం లేని ఉద్యోగం.. అప్పుల బాధలు

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో జయప్రకాష్ రెడ్డికి సరైన అవకాశాలు రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు జీతం సరిగా లేక, నామమాత్రపు ఆదాయంతో భార్యాపిల్లలను పోషించడానికి తీవ్రంగా కష్టపడ్డారు. కేవలం కుటుంబ పోషణ కోసమే చేతికి వచ్చిన చోటల్లా అప్పులు చేయాల్సి వచ్చింది. ఐదు వేలు, పది వేలు అని తెలిసిన వారిని అడిగి తెచ్చుకుని గడిపేవారు. అయితే ఎవరి రూపాయి కూడా ఉంచుకోకుండా అందరి అప్పులు క్రమంగా తీర్చేసుకున్నానని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.

35
ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి టీచర్‌గా మారిన జెపి
Image Credit : our own

ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి టీచర్‌గా మారిన జెపి

సినిమాల్లో సరైన బ్రేక్ రాకపోవడం, అప్పుల భారం పెరిగిపోవడంతో జయప్రకాష్ రెడ్డి ఇక ఇండస్ట్రీ మనకు సెట్ కాదని భావించి ఐదేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు. తిరిగి తన సొంత ఊరికి వెళ్లి స్కూల్ టీచర్‌గా, ట్యూషన్లు చెప్పుకునే మాస్టార్‌గా స్థిరపడ్డారు. పొద్దున్నే ఆరు గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు వరుసగా ట్యూషన్లు, స్కూల్ పాఠాలు చెబుతూ అహర్నిశలు కష్టపడ్డారు. దాదాపు ఐదేళ్ల పాటు పడిన ఈ కష్టంతో తనకున్న అప్పుల్లో 40 నుండి 45 శాతం వరకు తీర్చగలిగారు. ఈ ఐదేళ్ల కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఆయన ఇంటి ల్యాండ్‌లైన్‌కు 3 సార్లు ఫోన్లు వచ్చినా, మళ్లీ సినిమా రంగుల ప్రపంచంలోకి వెళ్తే అప్పుల ఊబిలో కూరుకుపోతాననే భయంతో ఆయన హైదరాబాద్‌కు వెళ్లలేదు.

45
అనుకోని మలుపు.. రామానాయుడు నుంచి పిలుపు
Image Credit : google

అనుకోని మలుపు.. రామానాయుడు నుంచి పిలుపు

అయితే విధి నిర్ణయం మరొకలా ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తక్కువ ధరకే ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారని తన మిత్రుడు ఉచితంగా తీసుకెళ్లడంతో జయప్రకాష్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. అక్కడ చెకప్ కోసం ఫారాలు రాస్తుండగా అనుకోకుండా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు ఆయనను చూశారు. "ఏమయ్యా జయప్రకాష్! ఎక్కడికి పోయావ్? మంచి ఆర్టిస్ట్‌వి ఉండి బుద్ధి ఉందా నీకు?" అంటూ రామానాయుడు ఆయనను ఆప్యాయంగా గద్దించారు. దానికి జెపి స్పందిస్తూ, తనకు కలిసి రావడం లేదని, అప్పుల పాలై ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పారు. దానికి నాయుడు గారు స్పందిస్తూ, "అవన్నీ వదిలేయ్.. మేము కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాం, సాయంత్రం వచ్చి సురేష్ బాబును కలువు.. నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది" అని ఆఫర్ ఇచ్చారు.

55
వెంకటేష్ సినిమాతో మారిన తలరాత
Image Credit : Asianet News

వెంకటేష్ సినిమాతో మారిన తలరాత

రామానాయుడు ఇచ్చిన ఆ అవకాశమే దగ్గుబాటి వెంకటేష్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ప్రేమించుకుందాం రా'. ఈ సినిమాలో ‘వీరభద్రయ్య’ అనే క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ విలన్ పాత్రలో జయప్రకాష్ రెడ్డి జీవించేశారు. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించాయి. ఈ ఒక్క సినిమాతో ఆయన టాలీవుడ్‌లో తిరుగులేని విలన్‌గా మారిపోయారు. ఆ తర్వాత వెంకటేష్‌తోనే చేసిన 'జయం మనదేరా' చిత్రంతో పాటు ఎన్నో హిట్ సినిమాలలో నటించి, తనకున్న అప్పులన్నీ పూర్తిగా తీర్చేసుకుని సెటిల్ అయ్యారు. ఒక సాధారణ టీచర్‌గా ఉన్న జెపిని వెతికి పట్టుకుని మరీ స్టార్ విలన్‌ను చేసిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్‌కే దక్కుతుంది. వెంకటేష్ సినిమా వల్ల తన అప్పులన్నీ తీరిపోయాయని జేపి చాలా సందర్భాల్లో వెల్లడించేవారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Related Stories
Recommended image1
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved