MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే

Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే

Vishwak Sen Legacy: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇప్పుడు `లెగసీ` చిత్రంతో రాబోతున్నాడు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 27 2026, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పవర్‌ ఫుల్‌ మూవీతో రాబోతున్న విశ్వక్‌ సేన్‌
Image Credit : Asianet News

పవర్‌ ఫుల్‌ మూవీతో రాబోతున్న విశ్వక్‌ సేన్‌

విశ్వక్‌ సేన్‌ కి తన మార్క్ సరైన హిట్‌ పడటం లేదు. ఆయన నటించిన చిత్రాలు ఇటీవల కాలంలో వరుసగా పరాజయం చెందుతున్నాయి. `ధమ్కీ` యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత `గామి` ప్రశంసలందుకుంది. వీటితోపాటు` గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి`, `మెకానిక్‌ రాకీ`, `లైలా`, `ఫంకీ` చిత్రాలు పరాజయం చెందాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన `ఫంకీ` మూవీ డిజప్పాయింట్‌ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్ తో వస్తున్నారు. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లెగసీ మూవీతో రాబోతున్న విశ్వక్‌ సేన్‌
Image Credit : Asianet News

లెగసీ మూవీతో రాబోతున్న విశ్వక్‌ సేన్‌

తాజాగా విశ్వక్‌ సేన్‌ పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న `లెగసీ` చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కేకే మీనన్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ మూవీకి సాయి కిరణ్‌ దైదా దర్శకత్వం వహిస్తున్నారు. కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యశ్వంత్‌ దగ్గుమాటి, సాయికిరణ్‌ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది. ఇందులో తండ్రి పొలిటికల్‌ వారసత్వాన్ని ద్వేషించే కొడుకుగా విశ్వక్‌ సేన్‌ కనిపించబోతున్నారు. తండ్రి పొలిటికల్‌ లెగసీని కంటిన్యూ చేయడంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ఈ మూవీ కథగా ఉండబోతుందని తెలుస్తోంది.

34
అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ తిరిగే లెగసీ
Image Credit : Asianet News

అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ తిరిగే లెగసీ

సినిమా గురించి టీమ్‌ చెబుతూ, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘LEGACY’ అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ‘LEGACY’పై అంచనాలు మరింత పెరిగాయి. పవర్, ఫ్యామిలీ, ప్రేమ , ద్రోహం నేపథ్యంలో.. ‘LEGACY’ ఒక ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ సాగే ఈ కథలో ఒక వారసుడు తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన తండ్రి గతానికి సంబంధించిన దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కే కే మేనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రని పోషిస్తున్నారు.

44
మదనపల్లెలో కీలక షెడ్యూల్
Image Credit : Asianet News

మదనపల్లెలో కీలక షెడ్యూల్

‘LEGACY’ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నేటి నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘LEGACY’ భావోద్వేగం, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్‌ఫుల్ మ్యూజిక్, హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అధికారాన్ని వారసత్వంగా పొందడం మాత్రమే కాదు.. ఆ వారసత్వాన్ని కొనసాగించాలా? లేక తిరగరాయాలా? అనే ప్రశ్న చుట్టూ సాగే ఈ ఆసక్తికరమైన కథ డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది` అని చిత్ర బృందం తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Related Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved