MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ

Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ `రణబాలి`. మ్యారేజ్‌ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. దీనితో సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 27 2026, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లి తర్వాత రణబాలితో రాబోతున్న విజయ్‌, రష్మిక
Image Credit : Asianet News

పెళ్లి తర్వాత రణబాలితో రాబోతున్న విజయ్‌, రష్మిక

రౌడీ బాయ్‌ విజయ్‌ దేరవకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కలిసి `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. అదే సమయంలో మ్యారేజ్‌ తర్వాత నటిస్తోన్న మొదటి మూవీ కావడం విశేషం. రాహుల్‌ సంక్రిత్యన్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. స్వాతంత్య్రం రావడానికి ముందు జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సెప్టెంబర్‌ 5న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రణబాలి కొత్త రిలీజ్‌ డేట్‌
Image Credit : Asianet News

రణబాలి కొత్త రిలీజ్‌ డేట్‌

`రణబాలి` మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది టీమ్‌. దసరా పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్‌ 16న విడుదల చేస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. దసరా పండక్కి వరుసగా సెలవులు ఉంటాయి. అవి ఈ మూవీకి కలిసొచ్చే అవకాశం ఉంది. సినిమా బాగుంటే మాత్రం విజయ్‌ దేవరకొండకి అసలైన పండగ రాబోతుందని చెప్పొచ్చు. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి. అయితే తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో పద్ద కొడవలి పట్టుకొని రణబాలిగా విజయ్‌ దేవరకొండ లుక్‌ అదిరిపోయింది.

Related Articles

Related image1
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Related image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
34
యదార్థా చారిత్రక సంఘటనలతో రణబాలి
Image Credit : Asianet News

యదార్థా చారిత్రక సంఘటనలతో రణబాలి

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. 1878లో జరిగిన కథని ఇందులో చూపించబోతున్నారు. ఆ సమయంలో బ్రిటీష్‌ వారు మన భారతీయులను ఎంతగా చిత్ర హింసలు పెట్టారు, కనీసం ఫుడ్‌ కూడా లేకుండా ఎలా దోచుకున్నారనేది ఇందులో చూపించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు జరిగిన చీకటి రహస్యాలను, చరిత్రలోని లేని రహస్యాలను ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాహుల్‌.

44
నియంతృత్వం నుంచి పుట్టుకొచ్చిన రణబాలి
Image Credit : Asianet News

నియంతృత్వం నుంచి పుట్టుకొచ్చిన రణబాలి

ఆ టైమ్‌లో మన ఇండియా నుంచి బ్రిటీష్‌ వారు ఏకంగా 45 ట్రిలియన్‌ డాలర్లు దోచుకుపోయారట. హిట్లర్‌ కంటే దారుణమైన నియంతృత్వం చోటు చేసుకుందట. కేవలం 40ఏళ్ల వ్యవధిలోనే వందల మిలియన్స్ ప్రజలు ఆకలితో చనిపోయారట. దీనిపై రణబాలి చేసిన తిరుగుబాటనే సినిమా అని సమాచారం. ఇందులో రణబాలిగా విజయ్‌, జయమ్మగా రష్మిక మందన్నా కనిపించనున్నారు. ఆ మధ్య విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్ లో గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటీష్‌ అధికారిని లాక్కుంటూ రైలు పట్టాలపై నుంచి విజయ్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌. కోపంతో, ఆవేశంతో అరుస్తూ ఆయన కనిపించడం అదిరిపోయింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Recommended image2
Controversial Movies: సమాజానికి చెడు సందేశం ఇచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Recommended image3
Epic Movie: ఎపిక్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. ఆనంద్, వైష్ణవి బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదే
Related Stories
Recommended image1
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved