MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • DuckTales: 90s కిడ్స్ ఫేవరెట్ డోనాల్డ్ డక్ గుర్తున్నాడా? పిసినారి అంకుల్ స్క్రూజ్.. డక్‌టేల్స్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

DuckTales: 90s కిడ్స్ ఫేవరెట్ డోనాల్డ్ డక్ గుర్తున్నాడా? పిసినారి అంకుల్ స్క్రూజ్.. డక్‌టేల్స్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

DuckTales: మీరు 90s కిడ్స్ ఆ.. అయితే అప్పుడు దూరదర్శన్ లో వచ్చే డోనాల్డ్ డక్ గుర్తున్నాడా? అంకుల్ స్క్రూజ్.. హ్యూయీ, డ్యూయీ, లూయీ లు గుర్తున్నారా? నాన్ స్టాప్ కామెడీ పంచిన ఈ టీవీ సిరీస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 11 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
90s కిడ్స్ ఫేవరెట్ యానిమేటెడ్ సిరీస్ ..
Image Credit : IMDb

90s కిడ్స్ ఫేవరెట్ యానిమేటెడ్ సిరీస్ ..

డక్‌టేల్స్' (DuckTales) ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఒక దిగ్గజ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్. 1990ల కాలంలో భారతదేశంలో ముఖ్యంగా దూర్‌దర్శన్ వేదికగా ప్రసారమైన ఈ సీరియల్, నాటి చిన్నారుల (90s Kids) జీవితాల్లో మరువలేని తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. వాల్ట్ డిస్నీ టెలివిజన్ యానిమేషన్ నిర్మించిన ఈ సిరీస్, కార్టూన్ ప్రపంచంలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డక్‌టేల్స్ కథ ఏంటి? అందులో పాత్రలు ఎవరంటే?
Image Credit : IMDb

డక్‌టేల్స్ కథ ఏంటి? అందులో పాత్రలు ఎవరంటే?

ఈ కథంతా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన 'స్క్రూజ్ మెక్‌డక్' (Scrooge McDuck) అతని మేనల్లుళ్ళు అయిన హ్యూయీ, డ్యూయీ, లూయీ (Huey, Dewey, and Louie)ల చుట్టూ తిరుగుతుంది. డోనాల్డ్ డక్ సైన్యంలో చేరడం వల్ల, తన ముగ్గురు మేనల్లుళ్లను సంరక్షణ కోసం బాబాయి అయిన స్క్రూజ్ వద్ద వదిలివెళ్తాడు. స్క్రూజ్ మెక్‌డక్ ఒక పిసినారి. ఖర్చు పెట్టడానికి వెనకాడే స్వభావం ఉన్నవాడు. అతని దగ్గర అంతులేని సంపద ఉంటుంది. ఓ పెద్ద బంగారు నాణేల స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుంటాడు. అతను లోభి.. కానీ సాహసాలంటే ప్రాణం ఇచ్చే తాతయ్య.

Related Articles

Related image1
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Related image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
35
అందరిని ఆకర్శించిన పాత్రలు ఇవే..
Image Credit : IMDb

అందరిని ఆకర్శించిన పాత్రలు ఇవే..

హ్యూయీ, డ్యూయీ, లూయీ లు ఫన్నీ గా ఉండే చిన్నారి పాత్రలు. రెడ్, బ్లూ, గ్రీన్ డ్రెస్సుల్లో కనిపించే చురుకైన ముగ్గురు పిల్లలు. తమ తెలివితేటలతో ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. అంకుల్ స్క్రూజ్ కు వచ్చే ప్రతీ సమస్యను ఈ పిల్లలు పరిష్కరిస్తుంటారు. ఇక వీరితో పాటు లాంచ్‌పాడ్ మెక్‌క్వాక్ అనే మరో పాత్ర ఉంటుంది. అతను విమానాలు నడపడంలో దిట్ట, కానీ ప్రతిసారీ క్రాష్ ల్యాండింగ్ చేసే అమాయక పైలట్ గా నవ్విస్తుంటాడు. అంకుల్ స్క్రూజ్ ఇంట్లో పనిచేసే కేర్‌టేకర్ మనవరాలు వెబ్బీ వ్యాండర్‌ క్వాక్ కూడా ఈ పిల్లలతో కలిసి ఉంటుంది. ముగ్గురు పిల్లలతో కలిసి సాహసాల్లో పాల్గొంటుంది.

45
తీరుగులేని విజయం సాధించిన సిరీస్..
Image Credit : IMDb

తీరుగులేని విజయం సాధించిన సిరీస్..

డక్‌టేల్స్ మొదటిసారిగా సెప్టెంబర్ 18, 1987న అమెరికాలో విడుదలటైంది. మొత్తం 100 ఎపిసోడ్లతో నాలుగు సీజన్ల పాటు దిగ్విజయంగా సాగింది. నవంబర్ 28, 1990న ఈ సిరీస్ ముగిసింది. ఆ తర్వాత 1990లో "డక్‌టేల్స్ ది మూవీ: ట్రెజర్ ఆఫ్ ది లాస్ట్ లాంప్" పేరిట పూర్తి స్థాయి సినిమా కూడా విడుదలైంది. 1990లలో భారతదేశంలో దూర్‌దర్శన్ వేదికగా ఆదివారం ఉదయం ప్రసారమయ్యే 'డిస్నీ క్లబ్' ద్వారా ఈ సిరీస్ తెలుగు, హిందీ భాషల్లోకి అనువాదమైంది. "జిందగీ తూఫానీ హై" (హిందీ) అలాగే తెలుగులో వచ్చిన టైటిల్ ట్రాక్ అప్పట్లో ప్రతి ఇంట్లో మారుమోగేది.

55
ప్రత్యేకతలెన్నో..
Image Credit : IMDb

ప్రత్యేకతలెన్నో..

ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త సాహసాన్ని, నిధి వేటను, విజ్ఞానాన్ని అందించేలా ఉండేది. బ్యూరోక్రాట్ బాంబర్స్, మేజిక్ ద స్పెల్ లాంటి విలన్ల నుండి తమ ఆస్తిని, బంగారు నాణేలను కాపాడుకోవడానికి స్క్రూజ్ తో పాటు పిల్లలు చేసే పోరాటాలు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకునేవి.

కార్టూన్ నెట్‌వర్క్, డిస్నీ ఛానెల్‌లు రాకముందే నాటి చిన్నారులకు అత్యుత్తమ వినోదాన్ని అందించిన ఘనత డక్‌టేల్స్‌దే. 2017లో డిస్నీ సంస్థ ఈ సిరీస్‌ను కొత్త యానిమేషన్ రీబూట్‌గా మళ్లీ నిర్మించినప్పటికీ, 1980, 90ల నాటి ఒరిజినల్ డక్‌టేల్స్ అందించిన అనుభూతి, ఆనందం ఎప్పటికీ ప్రత్యేకమైనవి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు
Related Stories
Recommended image1
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved