MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీప విషయం తెలుసుకుని షాక్ అయిన హేమచంద్ర.. దీపకు అబద్ధాలు చెప్పిన కార్తీక్?

Karthika Deepam: దీప విషయం తెలుసుకుని షాక్ అయిన హేమచంద్ర.. దీపకు అబద్ధాలు చెప్పిన కార్తీక్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 29 2022, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఇంద్రుడి పై సీరియస్ అవుతూ నీకు అంతా తెలుసు ఎందుకు వాళ్ల గురించి నీకు అంత తెలిసి కూడా చెప్పు ఎందుకు దాస్తున్నావు అని నిలదీయడంతో అప్పుడు ఇంద్రుడు ఏమని చెప్పమంటారమ్మా మీరు కాలర్ పట్టుకున్నారు అని చనిపోయిన వాళ్ళని బతికున్నారని చెప్పమంటారా అని అనడంతో చనిపోవడం ఏంట్రా వాళ్ళు బతికే ఉన్నారు అని అంటుంది సౌందర్య. సౌర్య చెబుతుంటే అబద్ధం అనుకున్నాను కానీ హిమ కూడా చూసింది నా కొడుకు బతికున్నాడు అన్నది నిజం అని అనడంతో ఇంద్రుడు కార్తీక్ వాళ్ళు బతికే లేరు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు సౌందర్య ఇంద్రుడు నీకు దండం పెడతాను ప్లీజ్ రా నా కొడుకు వాళ్ళు బతికే ఉన్నారా లేదా చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రుడు అబద్ధాలు చెప్పి తనకు నిజంగా తెలియదని కవర్ చేసుకుంటాడు. నేను నిజమే చెప్తున్నాను నన్ను నమ్మండమ్మా అని సౌందర్యని నమ్మిస్తాడు. మరొకవైపు దీప హాస్పిటల్లో చారుశీల కార్తీక్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. నేను చనిపోతే డాక్టర్ బాబు వంటరి అయితారు నేను చనిపోయాను అన్న మాట చెప్పలేక డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్లి పోతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హేమచంద్ర వచ్చి దీప హెల్త్ గురించి అడుగుతాడు.
 

37

అప్పుడు అంతా బాగానే ఉంది అని దీప అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దీప ఎమోషనల్ అవుతూ ఉండగా హేమచంద్ర ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు దీప జరిగింది మొత్తం వివరించడంతో హేమచంద్ర పండరి ఇద్దరు షాక్ అవుతారు. నేనింకా ఎంతో కాలం బతకను అన్నయ్య అనడంతో హేమచంద్ర బాధపడతాడు. అప్పుడు దీప ఏడుస్తూ మాట్లాడడంతో పండరి కూడా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు అందుకే అన్నయ్య మా ఫ్యామిలీని కూడా కలుసుకోకుండా ఇలాగే ఉండిపోయాము అనడంతో ఏంటమ్మా నీ పరిస్థితి అని హేమచంద్ర బాధపడుతూ ఉంటాడు.
 

47

పిల్లలకు బతికే ఉన్నారని తెలియజేయండి. ఇలాంటి సమయంలోనే ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలి వారిని మానసికంగా మీరు ధైర్యం చెప్పండి ఉంటాడు హేమచంద్ర. ఇన్నాళ్లు చనిపోయాము అనుకున్న వాళ్లు ఇప్పుడు బతికే ఉన్నాము అని తెలిసి మళ్ళీ కొద్ది రోజులకు చనిపోతామని తెలిస్తే ఆమెజాన్ వాళ్ళు తట్టుకోలేరు అని అంటుంది దీప. అప్పుడు హేమచంద్ర నేను కార్తీక్ తో మాట్లాడుతాను అనడంతో వద్దన్నయ్య నాకు నిజం తెలుసు అని నిజం కార్తీక్ చెప్పొద్దు ఆయన బాధపడతారు అంటుంది. ఇప్పుడు నేను భయపడుతున్నారు నేను లేకపోతే డాక్టర్ బాబు ఏమైపోతారు అన్నది నా భయమని దీప తన బాధ మొత్తం హేమచంద్రతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.
 

57

 మరొకవైపు ఒక ఇంటి దగ్గరికి వెళ్లిన సౌర్య అక్కడ పూలు నచ్చడంతో ఇంట్లో ఎవరూ లేరే పూలు కోసుకుందామని అడగడానికి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే హేమచంద్ర అక్కడికి వస్తాడు. ఎవరమ్మా నువ్వు అన్నంతో ఎదురింటిలో కొత్తగా దిగాము నాకు పూలు కావాలి అని అంటూ సరే కోసుకో అమ్మ అని అంటాడు హేమచంద్ర. అప్పుడు సౌర్య తన తండ్రి కూడా డాక్టర్ అని చెప్పడంతో హేమచంద్ర షాక్ అవుతాడు. హేమచంద్ర సౌర్య ఇద్దరు కలిసి ఆనందంగా మాట్లాడుకుంటారు. మరొకవైపు దీప జరిగిన విషయాలు తెలుసుకుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పండరి అక్కడికి వచ్చి మీరు పనులు చేయొద్దు అన్న డాక్టర్ బాబు నన్ను తిడతారు అనడంతో ఏం కాదులే అని అంటుంది దీప.
 

67

ఇప్పుడు కార్తీక్ అక్కడికి రావడంతో ఏం డాక్టర్ బాబు ఈ పని కూడా చేయకూడదా అనగా నువ్వే చెప్పు చారుశీల అని అంటాడు డాక్టర్ బాబు. అప్పుడు దీప ని చూసిన చారుశీల ఈ దీపను నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి రేపు దీప చనిపోయిన తర్వాత కార్తీక్ నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా చేసుకోవాలి అలా చేసుకుంటే కార్తీక్ ఆస్తి మొత్తం నాదే అవుతుంది అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు వారందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సౌందర్య జరిగిన విషయాల గురించి తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వస్తాడు.
 

77

ఇప్పుడు ఆనంద్ రావు ఏదో అడుగుతానని చెప్పి ఇంద్రుడిని తీసుకెళ్లావు కదా ఏమైనా చెప్పాడా అనడంతో లేదండి వాడికేం తెలియదు అంటున్నాడు అనడంతో వాడికి తెలియదేమో అనడంతో లేదండి వాడి మాటలు తడబాటును బట్టి చూస్తే కచ్చితంగా వానికి తెలుసు కానీ నా దగ్గర నిజం దాస్తున్నాడు అని అంటుంది సౌందర్య. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి పువ్వుల కోసం ఎదురు ఇంటికి వెళ్లాను నానమ్మ అంకుల్ కూడా డాక్టరేనా అంటే నాకు ఫ్రెండ్ అయ్యాడు అనడంతో అప్పుడు ఆనందరావు నాకు కూడా పరిచయమయ్యాడు అని అంటాడు. మరొకవైపు హాస్పిటల్లో కార్తీక్, చారుశీల దీప ని చెక్ చేస్తూ దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దీప నాకు కాకుండా మీకు చెకప్ చేయించుకోవచ్చు కదా మీకే కదా హెల్త్ ప్రాబ్లం అనడంతో నేను ప్రతిరోజు చేయించుకుంటూనే ఉన్నాను అని అబద్ధం చెబుతాడు కార్తీక్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved