MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం

Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం

Charan Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మొదటివారంలోనే నిర్వహకులు పెద్ద షాక్‌ ఇచ్చారు. చరణ్‌ని మిడ్‌ వీక్‌లోనే ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే. మరి ఆయనకు ఎంత పారితోషికం ముట్టిందనేది చూస్తే..

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 11 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిడ్‌వీక్‌ లో ఎలిమినేట్‌ అయిన చరణ్‌ మహదేవ్‌
Image Credit : Youtube/@starmaa

మిడ్‌వీక్‌ లో ఎలిమినేట్‌ అయిన చరణ్‌ మహదేవ్‌

బిగ్ బాస్ తెలుగు 10లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆర్జే చరణ్ మహదేవ్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సాధారణంగా ప్రతి వారం వీకెండ్‌లో ఎలిమినేషన్ ఉండే బిగ్ బాస్‌లో.. ఈసారి తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడం ఆసక్తిని రేకెత్తించింది. హై రిస్క్ జోన్‌లోకి వెళ్లిన చరణ్ మహదేవ్‌, చివరకు ఇంటి సభ్యుల నిర్ణయంతో హౌజ్‌ను వీడాల్సి వచ్చింది. దీనిపై కామన్‌ ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది అన్‌ఫెయిర్‌ అంటున్నారు. ఆడే ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ఎలిమినేట్‌ చేస్తారనేది విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ జరిగిపోయింది. చరణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కామనర్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ
Image Credit : Youtube/@starmaa

కామనర్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ

చరణ్ విషయానికి వస్తే.. ఆయన బిగ్ బాస్ తెలుగు 10లోకి సెలబ్రిటీ కేటగిరీలో కాకుండా కామనర్‌గా అడుగుపెట్టాడు. బిగ్ బాస్‌లోకి కామనర్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష ద్వారా చరణ్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జేగా, యాంకర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న చరణ్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో ఎక్కువ రోజులు కొనసాగి తన టాలెంట్ చూపించే అవకాశం దక్కుతుందని అభిమానులు భావించారు. అయితే ఊహించని విధంగా తొలి వారంలోనే ఆయన ప్రయాణం ముగిసింది.

Related Articles

Related image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Related image2
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
34
చరణ్ పారితోషికం
Image Credit : Youtube/@starmaa

చరణ్ పారితోషికం

ఇక చరణ్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో ఎంత పారితోషికం లభించిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్ కంటెస్టెంట్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఆర్జే చరణ్‌కు రూ.70 వేల నుంచి రూ.1 లక్ష వరకు వారపు రెమ్యునరేషన్ ఉంటుందని టాక్‌. అంటే చరణ్ హౌజ్‌లో గడిపిన వ్యవధిని బట్టి అతనికి లభించే మొత్తం మారే అవకాశం ఉంది. మిడ్ వీక్‌లోనే ఎలిమినేట్ కావడంతో పూర్తి వారపు పారితోషికం ఎలా లెక్కిస్తారన్నది మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉంది. వారానికి లెక్క కడితే ఆయనకు దాదాపు 70 వేల వరకు వస్తుంది. రోజులను బట్టి చూస్తే యాభై వేల వరకు అందుతాయని చెప్పొచ్చు.

44
కంటెస్టెంట్ల పారితోషికాలు
Image Credit : Youtube/@starmaa

కంటెస్టెంట్ల పారితోషికాలు

మరోవైపు బిగ్ బాస్ తెలుగు 10లో సెలబ్రిటీలు, కామనర్ల మధ్య పారితోషికంలో భారీ వ్యత్యాసం ఉంది. జబర్దస్త్ రామ్ ప్రసాద్‌కు వారానికి రూ.4.5 లక్షల వరకు పారితోషికం లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి క్రేజ్‌, రేంజ్‌ని బట్టిఇస్తున్నారు. మూడు లక్షలు, రెండు లక్షలు తీసుకునే వారు కూడా ఉన్నారు. అదే సమయంలో కామనర్లకు సుమారు రూ.70 వేల వరకు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చరణ్ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ తెలుగు 10లో తొలి వారం నుంచే గేమ్ మరింత ఆసక్తికరంగా మారింది. అగ్నిపరీక్ష ద్వారా హౌజ్‌లోకి వచ్చిన చరణ్‌కు తక్కువ సమయంలోనే బిగ్ బాస్ అనుభవం ముగిసిపోయింది. అయితే ఈ షో ద్వారా ఆయనకు వచ్చిన గుర్తింపు, ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు ఉపయోగపడుతుందా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
DuckTales: 90s కిడ్స్ ఫేవరెట్ డోనాల్డ్ డక్ గుర్తున్నాడా? పిసినారి అంకుల్ స్క్రూజ్.. డక్‌టేల్స్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Recommended image2
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image3
Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?
Related Stories
Recommended image1
Mahendragiri Varahi Movie Review: మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ.. సుమంత్‌కి ఈ సారైనా హిట్‌ పడిందా?
Recommended image2
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved