MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన

Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన

Brahmanandam Brother: బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డబ్బులు కాకుండా తమ్ముడి ఆప్యాయ పలకరింపే తనకు కావాలని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది.

3 Min read
Author : Tirumala Dornala
Published : Aug 20 2026, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డబ్బు వద్దు.. ప్రేమగా పలకరిస్తే చాలు
Image Credit : Asianet News

డబ్బు వద్దు.. ప్రేమగా పలకరిస్తే చాలు

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనకు తమ్ముడి నుంచి ఆర్థిక సహాయం కంటే ఆత్మీయమైన పలకరింపే కావాలని ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను బ్రహ్మానందం తనను పట్టించుకోవడం లేదని నేరుగా విమర్శించకుండా.. ఒక్కసారి ఫోన్ చేసి “ఎలా ఉన్నావన్నయ్యా?” అని అడిగితే చాలని తన మనసులోని మాటను వెల్లడించారు. తమది ఆరుగురు అన్నదమ్ముల కుటుంబమని శ్రీనివాసరావు తెలిపారు. బ్రహ్మానందం ఐదో సోదరుడని, మిగిలిన నలుగురు ఇప్పటికే కన్నుమూశారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరమే ఉన్నామని పేర్కొంటూ.. వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపిస్తోందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండే బ్రహ్మానందం షూటింగ్‌ల మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. తనకు తమ్ముడిపై ఎలాంటి కోపం లేదని, అతడి నుంచి పెద్దగా ఏమీ ఆశించడం లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “ఎలా ఉన్నావన్నయ్యా? ఏం చేస్తున్నావ్?” అని ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడితే తనకు అదే పెద్ద సంతోషమని చెప్పారు. డబ్బులు, ఇతర సహాయాలు తనకు అవసరం లేదని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లాలంటే భయం..
Image Credit : youtube/@youwemedia

గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లాలంటే భయం..

బ్రహ్మానందం తనకంటే ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి కావడంతో తానే వెళ్లి పలకరించడానికి కొంత సంకోచంగా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పారు. గొప్పవాళ్లు తమను ఆప్యాయంగా పలకరిస్తే చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుందని, కానీ తామే వారి దగ్గరకు వెళ్లాలంటే ఏదో తెలియని భయం ఉంటుందని వివరించారు. బ్రహ్మానందం తనను ఏమీ అనరని తెలిసినా, తనలో అలాంటి భావన ఉందన్నారు. ఇటీవల బ్రహ్మానందం తమ ఊరికి వచ్చినట్లు తెలిసినా తాను వెళ్లి కలవలేకపోయానని చెప్పారు. తన నడక నెమ్మదిగా ఉంటుందని, అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటే వారిని దాటుకుని వెళ్లడం తనకు సాధ్యం కాదని వివరించారు.

Related Articles

Related image1
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Related image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
35
ఇంటికి రావాల్సిన అవసరం లేదు..
Image Credit : instagram

ఇంటికి రావాల్సిన అవసరం లేదు..

బ్రహ్మానందం తన ఇంటికి రావాలని కూడా తాను కోరుకోవడం లేదని శ్రీనివాసరావు చెప్పారు. ఆయన వస్తే అభిమానులు, ప్రజలను నియంత్రించడం కష్టమవుతుందని, తన ఇంటి పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు. అందుకే ఎవరినైనా వెంట తీసుకుని హైదరాబాద్‌కు రావాలని, ఒక్కసారి తనను కలిస్తే చాలని కోరుకున్నారు. తనకు ప్రస్తుతం కూతుళ్లు అన్నం పెడుతున్నారని, తాను బ్రహ్మంగారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నానని చెప్పారు. తనకు ఉన్నంతలో సంతోషంగానే ఉన్నానని, ఆర్థికంగా ఎలాంటి ఆశలు లేవని స్పష్టం చేశారు. అయితే తన తమ్ముడి నుంచి ఆప్యాయమైన పలకరింపు లేకపోవడమే తనకు బాధగా ఉందన్నారు. “ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

45
తమ్ముడు చేసిన సాయం గురించి కూడా..
Image Credit : Asianet News

తమ్ముడు చేసిన సాయం గురించి కూడా..

శ్రీనివాసరావు వ్యాఖ్యలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు బ్రహ్మానందం తన సొంత అన్నను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే పూర్తి ఇంటర్వ్యూలో శ్రీనివాసరావు బ్రహ్మానందం తమ కుటుంబానికి చేసిన సహాయం గురించి కూడా వివరించారు. తాను ప్రస్తుతం ఉంటున్న ఇంటిని బ్రహ్మానందమే కట్టించాడని తెలిపారు. తన ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లను కూడా తమ్ముడే దగ్గరుండి నిర్వహించాడని చెప్పారు. అప్పట్లో ఒక్కో పెళ్లికి రూ.50 వేలకు పైగా ఖర్చు చేశాడని, కుటుంబంలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది వచ్చినా బ్రహ్మానందం ఆదుకునేవాడని వెల్లడించారు. తమ ఆరో సోదరుడు పూర్ణకు కూడా బ్రహ్మానందం ఎంతో సాయం చేశారని శ్రీనివాసరావు తెలిపారు. తనకు తెలిసినంతవరకు పేదవాడైనా, డబ్బున్నవాడైనా బ్రహ్మానందం సహాయం చేయడంలో తేడా చూపించేవాడు కాదని అన్నారు.

55
నెగెటివ్‌గా మాట్లాడలేదంటున్న నెటిజన్లు
Image Credit : Asianet News

నెగెటివ్‌గా మాట్లాడలేదంటున్న నెటిజన్లు

శ్రీనివాసరావు ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల్లో తన తమ్ముడిపై విమర్శ కంటే తన వ్యక్తిగత ఆవేదనే ఎక్కువగా కనిపిస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పూర్తి ఇంటర్వ్యూ చూడకుండా కేవలం వైరల్ అయిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా బ్రహ్మానందాన్ని తప్పుపట్టడం సరికాదని అంటున్నారు. తనకు డబ్బు అవసరం లేదని, తమ్ముడు ప్రేమగా పలకరిస్తే చాలని శ్రీనివాసరావు చెప్పడం వెనుక ఉన్న భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మానందం అన్నయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Related Stories
Recommended image1
Pawan - Allu Aravind: పవన్ కళ్యాణ్ కాలెత్తడం అల్లు అరవింద్ కి నచ్చలేదా ? తొలగించాలని అనుకున్నారు.. కానీ
Recommended image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved