MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే

Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే

మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు రిజెక్ట్ చేసిన కథతో ఓ మీడియం రేంజ్ హీరో సంచలన బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమాని స్టార్ హీరోలు చేసి ఉంటే అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు అని దిల్ రాజు తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 20 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Dil Raju Movies
Image Credit : Asianet News

Dil Raju Movies

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొత్త ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో, కొత్త కథలని తయారు చేయించుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి దిల్ రాజు కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒక కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దిల్ రాజు వదిలిపెట్టరు. అందుకే దిల్ రాజుకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమా
Image Credit : Dil Raju\Instagram

మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమా

మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన కథతో దిల్ రాజు సూపర్ హిట్ కొట్టి చూపించారు. దీని గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ డేస్ టైం నుంచి శేఖర్ కమ్ములతో పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడంలో దిల్ రాజు స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది.

35
స్టార్ హీరోతోనే చేయాలి అని శేఖర్ కమ్ముల కోరిక
Image Credit : our own

స్టార్ హీరోతోనే చేయాలి అని శేఖర్ కమ్ముల కోరిక

హ్యాపీడేస్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల చిత్రం ఖరారైంది. ఆ సినిమానే ఫిదా. ఈ చిత్రం విషయంలో తెరవెనుక చాలా కసరత్తు, పరిణామాలు చోటు చేసుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిదా స్టోరీ లైన్ విన్నప్పుడు ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. శేఖర్ కమ్ముల ఈ కథని ఎలాగైనా స్టార్ హీరోతోనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు.

45
అందరూ బావుంది ఆంటున్నారు కానీ..
Image Credit : our own

అందరూ బావుంది ఆంటున్నారు కానీ..

నేను ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుకి కథ వినిపించారు. మహేష్ కి కథ నచ్చింది. కానీ తన ఇమేజ్ కి సరిపోతుందా అనే డౌట్ తో పక్కన పెట్టారు. నేను ఎంటర్ అయ్యాక రాంచరణ్ కి కథ వినిపించాం. చరణ్ వద్ద కూడా అదే సిట్యుయేషన్. అల్లు అర్జున్ కూడా విని బావుంది అని అన్నారు. కానీ ఒక స్టార్ హీరోకి సరిపడే అంశాలు ఈ సినిమాలో కుదరడం లేదు. దీనితో ఒక రోజు నేను శేఖర్ కమ్ములతో చెప్పాను. ఈ కథని స్టార్ హీరోతో చేయవద్దు. స్టార్ హీరోల గురించి మరిచిపోండి. వాళ్ళతో చేస్తే ఈ సినిమా అస్సలు వర్కౌట్ కాదు అని చెప్పాను.

55
వాళ్ళు చేసి ఉంటే దెబ్బ పడేది
Image Credit : our own

వాళ్ళు చేసి ఉంటే దెబ్బ పడేది

ఆ తర్వాత ఏ హీరో అయితే బావుంటుంది అని చర్చలు జరిపినప్పుడు చివరికి వరుణ్ తేజ్ అని ఫిక్స్ అయినట్లు దిల్ రాజు తెలిపారు. మహేష్, రాంచరణ్, బన్నీ లాంటి హీరోలు పక్కన పెట్టిన కథ వరుణ్ తేజ్ కి అద్భుతంగా వర్కౌట్ అయింది. శేఖర్ కమ్ముల మార్క్ ఎమోషన్స్, తెలంగాణ బ్యాక్ డ్రాప్, సాయి పల్లవి నటన, వరుణ్ తేజ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లాయి. ఫిదా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒక వేళ ఈ సినిమాని మహేష్, బన్నీ, చరణ్ లలో ఎవరైనా చేసి ఉంటే నెగిటివ్ రిజల్ట్ వచ్చేది అని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Wamiqa Gabbi Mumbai Home: ఒకప్పుడు నేలపై పడుకున్న వామికా గబ్బి.. ఇప్పుడు ఆమె ఇల్లు ఎలా ఉందో చూశారా?
Recommended image2
Amala Paul: ఇక అలాంటి అశ్లీల సీన్లలో అస్సలు నటించను..ఇమేజ్ డ్యామేజ్, గతాన్ని గుర్తు చేసుకున్న అమలాపాల్
Recommended image3
Aishwarya Rai: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అదరగొట్టిన ఐశ్వర్య రాయ్, బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ అదుర్స్
Related Stories
Recommended image1
Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా, నా వల్ల కావట్లేదు.. ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకున్న డైరెక్టర్
Recommended image2
Shivashankar: మన్మథ రాసా నుంచి ధీర ధీర వరకు.. శివ శంకర్ మాస్టర్ టాప్ 5 సాంగ్స్, ఒక్క దానికి నేషనల్ అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved