Bigg Boss Telugu 7: ఆ వీడియోతో రతిక పరువు తీసిన బిగ్ బాస్... ఇంత మోసమా! కెరీర్ నే డ్యామేజ్ చేసే మేటర్!
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన రతిక రోజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రతిక ఓ విషయంలో ఆడియన్స్ ని ఛీటింగ్ చేస్తున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.
రతిక రోజ్ నాలుగో వారమే దుకాణం సర్దింది. గట్టి పీఆర్ టీమ్ తో పాటు పెద్ద ప్రణాళికతో హౌస్లో అడుగుపెట్టిన ఆమె ప్లాన్స్ బెడిసికొట్టాయి. పల్లవి ప్రశాంత్ తో ఆమె వ్యవహరించిన తీరు పట్ల ఆడియన్స్ అసంతృప్తి చెందారు. సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత నడిచింది. దీంతో ఎలిమినేట్ అయ్యింది.
అయితే బిగ్ బాస్ ఉల్టా పల్టా ఓటింగ్ కారణంగా ఆమె రీఎంట్రీ ఇచ్చింది. దామిని, శుభశ్రీ, రతికలలో ఎవరు హౌస్లో లోకి వెళ్లాలో ఓటు వేయాలని నాగార్జున హౌస్ మేట్స్ ని కోరాడు. ఓటింగ్ ముగిశాక ఎక్కువ ఓట్లు కాదు తక్కువ ఓట్లు వచ్చిన వారికి ఛాన్స్ అని షాక్ ఇచ్చాడు.
Aslo Read... అడుక్కుని మరీ అమర్ ని ముంచేసిన రతికా.. ఫిజికల్ అయ్యేంతలా ఒకరిపై ఒకరు గర్జించుకున్న శివాజీ, గౌతమ్
బిగ్ బాస్ రివర్స్ నిర్ణయం వలన ఆమెకు మరో అవకాశం దక్కింది. రతిక వచ్చి మూడు వారాలు అవుతుండగా కనీస ప్రదర్శన లేదు. ఎలాంటి గేమ్ ఆడితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో ఆమెకు అర్థం కావడం లేదు. ఒకప్పటి ఫైర్ఇప్పుడు లేదు. జనాలు కూడా ఆమెకు ఓట్లు వేయడం లేదు. హౌస్లో కేవలం నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఉన్నారు. దాంతో ఆమె బ్రతికిపోతుంది.
Bigg Boss Telugu 7
రతిక గేమ్ లో నిజాయితీ లోపించడం ప్రధాన సమస్య. ఆమెది ఛీటింగ్ గేమ్ అని జనాలకు అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే మరో విషయంలో కూడా ఆమె ఆడియన్స్ ఛీట్ చేస్తుంది. జుట్టు లేని రతిక విగ్ తో మేనేజ్ చేస్తుంది. జుట్టు వత్తుగా కనిపించేందుకు విగ్ వాడుతుంది.
Bigg Boss Telugu 7
అర్థరాత్రి అందరూ పడుకున్నాక రతిక అద్దం ముందుకు వెళ్లి ఆ విగ్ తీసేసింది. ఈ వీడియోను బిగ్ బాస్ లైవ్ లో ప్రసారం చేశారు. దాంతో రతిక మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమ్మ రతిక... అందం విషయంలో కూడా మమ్మల్ని మోసం చేస్తున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu 7
గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలి అనుకునేవాళ్లకు అందమే పెట్టుబడి. ఒకరిని అందంగా చూపించే అంశాల్లో జుట్టు ప్రధానమైంది. రతిక సహజంగా ఉన్న జుట్టుకు అదనంగా ఓ విగ్ వాడుతూ ఒత్తుగా కనిపించేలా మేనేజ్ చేస్తుంది. నిజానికి టాప్ హీరోలు, హీరోయిన్స్ లో కొందరు ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నారు.
Bigg Boss Telugu 7
ఇక ఈ వారం శివాజీ, యావర్, రతిక రోజ్, భోలే, గౌతమ్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. భోలే ఎలిమినేట్ అవుతున్నాడని విశ్వసనీయ సమాచారం. రతికకు తక్కువ ఓట్లు వచ్చినా... భోలేని బలి చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
Also Read... అమ్మకు ఆరోగ్యం బాగోలేదురా కొడకా... ప్రశాంత్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి, కన్నీరు మున్నీరైన ప్రశాంత్!