అమ్మకు ఆరోగ్యం బాగోలేదురా కొడకా... ప్రశాంత్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి, కన్నీరు మున్నీరైన ప్రశాంత్!
ఫ్యామిలీ వీక్ లో భాగంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చాడు. ఈ తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. తల్లి ఆరోగ్యం గురించి చెబుతూ ప్రశాంత్ తండ్రి.. నువ్వు ఏడవకు అన్నాడు...
Bigg Boss Telugu 7
10వ వారం బిగ్ బాస్ హౌస్ ఫ్యామిలీ ఎమోషన్స్ కి వేదికగా మారింది. రెండు నెలలకు పైగా ఇంటికి దూరమైన హౌస్ మేట్స్ లో హోమ్ సిక్ ఏర్పడింది. దాన్ని పోగొట్టేందుకు కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ప్రవేశ పెడుతున్నారు. శివాజీ, అర్జున్, అశ్విని, శోభ, యావర్, అమర్, భోలే, గౌతమ్ లను కలిసేందుకు ఒక్కొక్కరి చొప్పున కుటుంబ సభ్యులు వచ్చారు. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్లోకి వచ్చాడు.
Bigg Boss Telugu 7
ఆయన రాకను తెలియజేసేలా హౌస్లో బంతిపూలను ఉంచారు. దాంతో తన కోసం ఎవరో వస్తున్నారని పల్లవి ప్రశాంత్ కి అర్థమైంది. కాసేపటి తర్వాత 'బాపు బంగారం' అని పిలుస్తూ మెయిన్ డోర్ నుండి పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చాడు. పరుగున వెళ్లిన ప్రశాంత్ తండ్రి కాళ్లపై పడి ఏడ్చాడు.
Bigg Boss Telugu 7
ప్రశాంత్ ని హత్తుకుని తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. నువ్వు లేక గుండె బరువెక్కుతుంది కొడుకా అన్నాడు. హౌస్లో పల్లవి ప్రశాంత్ కి అండగా ఉన్న శివాజీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు. అమర్ తో కొట్టుకోవద్దు. అందరూ మంచిగా ఉండండి అని చెప్పాడు.
Bigg Boss Telugu 7
మా నాన్న బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడని పల్లవి ప్రశాంత్ గట్టిగా అరిచాడు. తండ్రిని గాల్లోకి ఎత్తి తిప్పాడు. పల్లవి ప్రశాంత్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. హౌస్ మేట్స్ వారిద్దరి మధ్య అనుభందాన్ని చూస్తుండిపోయారు. నేను బ్రతికినా చచ్చినా వీడి కోసమే అని పల్లవి ప్రశాంత్ తండ్రి అన్నారు.
Bigg Boss Telugu 7
ప్రశాంత్ తండ్రి స్వయంగా అన్నం కలిపి నోట్లో పెట్టాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. నీకు టాలెంట్ ఉంది. అది ఉపయోగించుకో. మంచిగా ఆడు అని తండ్రి కొడుక్కి చెప్పాడు. నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే అమ్మ బాధపడుతుంది. ఆమెకు బీపీ పెరుగుతుందని ప్రశాంత్ తో తండ్రి అన్నాడు.
Bigg Boss Telugu 7
ఈ తండ్రి కొడుకుల మధ్య చోటు చేసుకున్న ఎమోషనల్ డ్రామా ఆకట్టుకుంది. ఎలాంటి అభిమానులు లేని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఇన్ని వారాలు హౌస్లో ఉండటం. అతని తండ్రి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడం గొప్ప పరిణామం. పల్లవి ప్రశాంత్ అంచనాలకు మించి ఆడుతున్నాడు. అతడు హౌస్లో నాలుగో పవర్ అస్త్ర గెలిచాడు. ఈ సీజన్ కి గాను ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ కి జనాల్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
పల్లవి ప్రశాంత్ అంచనాలకు మించి ఆడుతున్నాడు. అతడు హౌస్లో నాలుగో పవర్ అస్త్ర గెలిచాడు. ఈ సీజన్ కి గాను ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ కి జనాల్లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.