MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: కృష్ణ తలకి తుపాకీ గురిపెట్టిన భవాని.. అత్తను తప్పుపడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari: కృష్ణ తలకి తుపాకీ గురిపెట్టిన భవాని.. అత్తను తప్పుపడుతున్న ముకుంద!

Krishna Mukunda Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తన కూతుర్ని దూరం చేసిందని కోడలి మీద కోపం పెంచుకున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

3 Min read
Author : Navya G
Published : Apr 26 2023, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో నందినికి అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. కానీ ఆమె తినకుండా కృష్ణ కావాలి అంటూ మారం చేస్తుంది. ఇప్పుడు కాదు తర్వాత వెళ్దాము అంటాడు గౌతమ్. కాదు ఇప్పుడే తీసుకెళ్ళు, అక్కడ వాళ్ళందరూ కృష్ణ ని ఎన్ని మాటలు అంటున్నారో ఏంటో అంటూ బాధపడుతుంది నందిని. నందిని అన్నది నిజమే నేను అందుకే కృష్ణ ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నాను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కానీ తను లేకపోతే నిన్ను ఈ జన్మలో దక్కించుకునే వాడిని కాదు అని మనసులో అనుకుంటాడు గౌతమ్. బయటికి మాత్రం నువ్వు భోజనం చెయ్యు తర్వాత నిన్ను కచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్తాడు. మరోవైపు బాధపడుతున్న మురారిని చూసి ఇదంతా జరగటానికి నేనే కారణం, నాకోసమే ఆయన పెద్ద అత్తయ్యకి ఇచ్చిన మాట తప్పి ఆవిడ కోపానికి గురయ్యారు.

39

ఎలా అయినా పెద్దత్తయ్యని ఒప్పించి ఏ సి పి సార్ తో మాట్లాడేలా చేయాలి అనుకుంటూ భవాని గది దగ్గరికి వెళ్లి తలుపు కొడుతుంది. భవాని తలుపు తీసి కృష్ణని చూసి మళ్లీ తలుపు వేసేయబోతుంది. కానీ కృష్ణ అడ్డుకొని అత్తయ్య.. తప్పు చేసింది నేను, నన్ను శిక్షించండి అంతేగాని ఆయనని శిక్షించకండి. ఇంట్లో ఎవరూ ఆయనతో మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతున్నారు. కావాలంటే శాశ్వతంగా నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేయండి.

49

దయచేసి ఆయనతో మాత్రం మాట్లాడండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ముకుంద అంటూ గట్టిగా కేక పెడుతుంది భవాని. ముకుంద తో పాటు అందరూ హాల్ దగ్గరికి వస్తారు. ఇప్పటికే కృష్ణ నుదుటి మీద గన్ పెట్టి ఉంటుంది భవాని. అందరూ షాక్ అవుతారు. ఈ పిల్ల నా కొడుకుని, నా కూతుర్ని ఇద్దరినీ నా నుంచి దూరం చేసింది, అందుకే నేను జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడి తన ప్రాణాలు తీయటానికి వెనుకాడటం లేదు.

59

ఇంతకుముందు ఈ ఇంట్లో నేను గీసిందే గీత కానీ ఇప్పుడు ఇంట్లో ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని సముద్రంలో కలపెయ్యకపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది అంటుంది భవాని. అలాంటి కొడుకుని కన్నందుకు, అలాంటి కోడల్ని సమర్థించినందుకు నన్ను చంపేయండి అక్క అంటుంది రేవతి. మీరు నన్ను చంపేయండి, నేను ఏ అడ్డు చెప్పను కానీ నన్ను చంపిన తరువాత మీరు ఏ సి పి సార్ తో మాట్లాడుతానంటేనే ఒప్పుకుంటాను లేదంటే నన్ను చంపే అధికారం మీకు లేదు అంటుంది కృష్ణ.
 

69

మిమ్మల్ని ఎదిరిస్తే ఎంత ఘోరమైన శిక్ష విధిస్తారా? తను మిమ్మల్ని ఎదిరించిన మాట నిజమే కానీ నందిని కి మేలు జరిగింది. ఇంత జరుగుతున్నా ఇంట్లో ఎవరూ మాట్లాడరేంటి అంటూ కృష్ణని వెనకేసుకొస్తుంది ముకుంద. అయినా ఆవేశం తగ్గని భవాని ట్రిగర్ నొక్కబోతుంటే కృష్ణని పక్కకి లాగి గన్ కి ఎదురుగా మురారి వెళ్తాడు. ఇందులో కృష్ణ తప్పేమీ లేదు నీకు ఇచ్చిన మాటను తప్పి నేను తప్పు చేశాను. పరాయి వాళ్ళు కన్న బిడ్డని చంపేటంత కసాయిది మా పెద్దమ్మ అయితే ముందు ఆ చావుని నాతోనే ప్రారంభించు అంటాడు మురారి.

79

ఎమోషనల్ అయిన భవాని గన్ కింద పడేసి బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అందరూ ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బాధపడుతున్న భర్తని ఓదారిస్తుంది కృష్ణ. ఎందుకు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాడు మురారి. మీరెందుకు అడ్డు పడ్డారు అంటుంది కృష్ణ. నువ్వు కాలేచేస్తానంటే చూస్తూ ఊరుకోలేకపోయాను అంటాడు మురారి. నావల్లే మీరు మీ వాళ్ళందరికీ దూరమయ్యారు అంటే భరించలేకపోతున్నాను అంటుంది కృష్ణ.

89

కానీ నీవల్ల నందిని కి మంచి జరిగింది అంటాడు మురారి. కానీ మీకు అన్యాయం జరిగింది, అది కూడా నా వల్ల అంటుంది కృష్ణ. నీది ఎంత మంచి మనసో తెలుసా నన్ను మాట ఇవ్వమని అడిగావు కానీ కచ్చితంగా చేసి తీరాలని ప్రెషర్ తీసుకురాలేదు. గొడవలు వస్తాయనే కదా హెల్ప్ అడగలేదు. చివరి నిమిషంలో నేను ఫోన్ చేశాను కాబట్టి నందిని జీవితం నిలబడింది. కానీ పెద్దమ్మ, నీవల్లే మాట తప్పాను అని ఊహించుకుంటుంది అంటాడు మురారి.

99

పోనీలెండి సార్ నందిని జీవితం బాగుపడింది, చూస్తూ ఉండండి గౌతమ్ సర్ తనని పూర్తి ఆరోగ్యంతో మన ముందుకి తీసుకు వస్తారు అంటుంది కృష్ణ. అది సరే కానీ ఇకమీదట పెద్దమ్మ వాళ్ళు మనతో మాట్లాడరా ఇది ఇలాగే కొనసాగుతుందా అని అడుగుతాడు మురారి. తరువాయి భాగంలో మురారిని భోజనానికి రమ్మంటుంది కృష్ణ. పెద్దమ్మకి మొహం చూపించలేను అంటాడు మురారి. ప్రకృతే మారుతున్నప్పుడు ప్రకృతికి ప్రతిరూపాలు మనుషులు కూడా మారుతారు అని నచ్చ చెప్పి భర్తని భోజనానికి తీసుకువస్తుంది కృష్ణ. కృష్ణ వాళ్ళు డైనింగ్ టేబుల్ ముందు కూర్చొనేసరికి అప్పటికే అక్కడ టిఫిన్ చేస్తున్న భవాని లేచిపోతుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved