షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్.. రాజకీయాలకు గుడ్ బై, కారణం ఏంటంటే..
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి.

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ బండ్ల గణేష్. ముక్కుసూటిగా మాట్లాడడం అతడి నైజం. బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతుంటాయి. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
బండ్ల గణేష్ ట్విట్టర్ లో, సినిమా ఈవెంట్స్ లో చేసే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతుంటాయి. కొన్ని సార్లు వివాదంగా మారి బండ్ల గణేష్ కి చిక్కులు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా బండ్ల గణేష్ రాజకీయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాను రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. 'నా కుటుంబ బాధ్యతల వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో.. వారి కోరికపై మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తూ నాకున్న పనులు వల్ల వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం గానీ, మిత్రుత్వం గానీ లేదు.
అందరూ నాకు ఆత్మీయలే.. అందరూ నాకు సమానులే.. ఇంతకుముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తూ మీ బండ్ల గణేష్ అంటూ చేశారు. గతంలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
ఆ సమయంలో బండ్ల గణేష్ తాను బ్లేడుతో కోసుకుంటా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బండ్ల గణేష్ కామెంట్స్ పై జోకులు, మీమ్స్ పేలాయి. ఎన్నికల్లో ఓటమి చెందడంతో తాను చేసిన కామెంట్స్ గురించి బండ్ల గణేష్.. కొన్ని సార్లు అలా మాట్లాడుతూ ఉంటాం. అన్ని జరుగుతాయా ఏంటి అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు.
ఇక ట్విట్టర్ లో కూడా బండ్ల గణేష్ పాలిటిక్స్ కి సంబంధించిన కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. బండ్ల గణేష్ నిర్మాతగా కూడా సైలెంట్ అయ్యారు. బండ్ల గణేష్ సినిమా నిర్మించి చాలా కాలమే అవుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు కాబట్టి సినిమాల్లో యాక్టివ్ అవుతారేమో చూడాలి.