MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Brahmamudi: కావ్య ఇంట్లో కనకం దంపతులకు ఘోర అవమానం.. సర్ప్రైజ్ ఎంట్రీతో అందరికీ షాకిచ్చిన స్వప్న?

Brahmamudi: కావ్య ఇంట్లో కనకం దంపతులకు ఘోర అవమానం.. సర్ప్రైజ్ ఎంట్రీతో అందరికీ షాకిచ్చిన స్వప్న?

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తన కాపురం తో పాటు అక్క కాపురాన్ని కూడా సరిదిద్దాలని ప్రయత్నిస్తున్న ఒక కావ్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

3 Min read
Author : Navya G
Published : Apr 26 2023, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎపిసోడ్ ప్రారంభంలో కనకం వాళ్లని చూసి కోపంతో రగిలిపోతుంది అపర్ణ. కనకం వాళ్లని సాదరంగా ఆహ్వానిస్తారు సీతారామయ్య దంపతులు. వీళ్ళని మీరు ఆహ్వానించారా అని అడుగుతుంది అపర్ణ. అవునమ్మా కావ్య సంతోషిస్తుందని పిలిచాము అంటాడు సీతారామయ్య. మరి మీ కోడలు సంతోషం మీకు అక్కర్లేదా? అంటుంది అపర్ణ. మరోవైపు రుద్రాణి సుభాష్ దగ్గరికి వెళ్లి మీ ఆవిడ మళ్లీ పదిమందిలో మన పరువు తీసే లాగా ఉంది అంటూ చాడీలు చెప్తుంది. గబగబా అటువైపు వెళ్తాడు సుభాష్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

హమ్మయ్య అత్త కోడళ్ళకి ఇటు భార్యాభర్తలకి నిప్పు రాజేశాను ఇక ఎంటర్టైన్మెంట్ చూడాలి అని తను కూడా వాళ్లతో పాటు వెళుతుంది రుద్రాణి. సుభాష్ వచ్చి కనకం వాళ్ళని పలకరించి కళ్యాణ్తో కావ్య దగ్గరికి పంపించేస్తాడు. తల్లిదండ్రులని లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోమని పంపించేస్తాడు. కోపంతో పగిలిపోతున్న అపర్ణ నాకు ఇష్టం లేని వాళ్ళని పిలవడం ఏమిటి అంటూ కోపంగా అడుగుతుంది. పదిమంది మధ్యలో మళ్ళీ పరువు తీసుకోవద్దు అంటూ భార్యకి సర్ది చెప్తాడు సుభాష్. మరోవైపు తల్లిదండ్రులను చూసిన కావ్య ఆనందంతో పలకరిస్తుంది కానీ ఎవరు పిలిచారు అంటూ కంగారుగా అడుగుతుంది. మీ అమ్మమ్మ గారు పిలిచారు అని చెప్తారు కనకం దంపతులు.

39

మరోవైపు రుద్రాణి, అపర్ణ దగ్గరికి వచ్చి నీ కోడలు అసాధ్యురాలు నిన్ను చూస్తే జాలేస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. మరోవైపు తల్లిదండ్రులని ఫ్రెండ్ సీట్లో కూర్చోబెట్టి నాకు పనుంది మీరు ఇక్కడే కూర్చోండి నాకు కొంచెం పని ఉంది అని చెప్పి పని హడావిడిలో పడిపోతుంది కావ్య. కావ్య, రాజ్ ఇద్దరు కలివిడిగా ఉండడం చూసి ఆనంద పడిపోతారు కనకం దంపతులు. అదే సమయంలో డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టడం కోసం కనకం వాళ్ళని అవమానించి పక్కకి పంపించేస్తుంది అపర్ణ. ఒక మూలగా వెళ్లి నిలబడిన కనకం వాళ్లు అటుగా వచ్చిన రాజ్ ని పలకరిస్తారు. వాళ్ళ బాధ్యతలు కళ్యాణ్ కి అప్పజెప్తాడు రాజ్. 

49

 కళ్యాణ్ వాళ్ళని భోజనాల దగ్గరికి తీసుకువెళ్తాడు ఈ లోపల అర్జెంట్ ఫోన్ రావటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపు రేఖ వచ్చి తిండికి మోహలు వాచిపోయినట్లుగా తింటున్నారు అంటూ అవమానిస్తుంది. రేఖతో వాదనకి దిగుతుంది అప్పు. అప్పుడే అటుగా వచ్చిన రాహుల్ విషయం తెలుసుకొని వాళ్ళు వచ్చిందే భోజనం చేయడానికి, ఇలాంటి అలగా జనంతో మాట్లాడటం మనదే తప్పు అంటూ చెల్లెల్ని అక్కడి నుంచి తీసుకుపోతాడు. ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా అంటుంది అప్పు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే అక్క బాధపడుతుంది, ఎలాగో పది నిమిషాల్లో ఫంక్షన్ అయిపోతే కావ్యకి చెప్పేసి మనం వెళ్ళిపోదాం అని సర్దిచెప్తారు కనకం, కృష్ణమూర్తి.

59

మరోవైపు సీతారామయ్య దంపతులను ఆట పట్టిస్తూ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ చేత దండలు మార్పిస్తారు రాజ్ దంపతులు. వాళ్ళిద్దరినీ చూసి ఆనంద పడిపోతారు కనకం దంపతులు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవాలి అనుకుంటారు. కావ్య వదిన వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళని కూడా రమ్మందాము అంటాడు కళ్యాణ్. అపర్ణ అడ్డు చెప్పబోతే సుభాష్ ఆమె నోరుమూయిస్తాడు. కృష్ణమూర్తి ఎంత వద్దంటున్నా వాళ్లను కూడా స్టేజ్ మీద నించో పెడతారు.

69

అప్పుడే ఎంట్రీ ఇచ్చిన స్వప్న గ్రూప్లో నేను వద్దా అని అడుగుతుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఎందుకు వచ్చావు అంటూ నిలదీస్తుంది అపర్ణ. నువ్వు నీ కూతుర్లని మా ఇంటి పరువు తీయడానికే కన్నట్లుగా ఉన్నావు అంటూ కనకాన్ని తిడుతుంది. మాకు ఏమీ తెలియదు, తను వస్తానంటే వద్దని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము, ఇలా తెగించి ఇక్కడికి వచ్చేస్తుంది అనుకోలేదు అంటుంది కనకం. ఇప్పుడు పాయింట్ అది కాదు తను ఎందుకు వెళ్లిపోయింది ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి అంటూ అదే ప్రశ్న స్వప్నకి వేస్తుంది రుద్రాణి.

79

నా బండారం మా అమ్మే బయట పెట్టేసేలాగా ఉంది అనుకుంటూ కంగారు పడిపోతాడు రాహుల్. అవన్నీ మనకెందుకు అంటూ తల్లి నోరు మూయిస్తాడు. అవమానం భరించలేక కూతురి చెంప పగలగొడతాడు కృష్ణమూర్తి. నేను రావద్దు అంటే ఎందుకు వచ్చావు నీ చెల్లెలు కా పురాన్ని కూడా చెడగొడతావా అంటూ కనకాన్ని మందలిస్తుంది. క్షమించండి మా వల్లే తప్పు జరిగింది అంటాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తిని భలే కూతుర్లని కన్నావు అంటూ దెప్పిపొడుస్తుంది అపర్ణ.

89

అందర్నీ అంటే ఊరుకున్నాను కానీ నాన్నని అంటే ఊరుకోను అంటూ అత్తగారి మీద  కేకలు వేస్తుంది కావ్య. వాళ్ళు చేస్తే తప్పులేదు గాని మా అమ్మ అడిగితే తప్పొచ్చిందా అంటూ కావ్య మీద రెచ్చిపోతాడు రాజ్. ఇదంతా చూస్తున్న సీతారామయ్య ఆ అమ్మాయి రావడం వల్ల పరువు పోయిందో లేదో తెలియదు కానీ మీరు ఇలా పదిమందిలోని గొడవ పడటం వల్ల పరువు పోతుంది అంటాడు.

99

తరువాయి భాగంలో కావ్య వంట చేసిందని తెలుసుకొని కోపంతో రగిలిపోయిన అపర్ణ వంటగదిలోకి కూడా వచ్చేసిందా అంటూ నిన్ను వంటగదిలోకి రావద్దని అత్తగారిగా ఆర్డర్ వేసాను కదా అని కావ్యతో అంటుంది అపర్ణ. మీరు అత్తగారిగా ఆర్డర్ వేశారు అంటే నన్ను కోడలుగా ఒప్పుకున్నట్లే కదా అంటుంది కావ్య.  కావ్య తెలివితేటలకి సంతోషిస్తారు అక్కడున్న వాళ్ళు.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image2
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image3
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved