- Home
- Entertainment
- Devatha: జూనియర్ చెస్ ఛాంపియన్‌గా దేవి విజయం.. రాధ, ఆదిత్యను చూసి కుళ్లిపోతున్న మాధవ!
Devatha: జూనియర్ చెస్ ఛాంపియన్‌గా దేవి విజయం.. రాధ, ఆదిత్యను చూసి కుళ్లిపోతున్న మాధవ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో చెస్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలవుతుంది. అప్పుడు దేవి(devi) చెస్ ఆడుతూ ఉండడంతో పక్కన నిలబడిన ఆదిత్య,రాధ ఇద్దరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. మొదటి రౌండ్ లో దేవి గెలుస్తుంది రెండవ రౌండ్ లో కూడా దేవి గెలుస్తుంది. మూడో రౌండ్ లో కూడా దేవినే గెలుస్తుంది. మరొకవైపు ఆదిత్య(adithya) అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది సత్య.
ఇంతలోనే అక్కడికి కమల(kamala) వచ్చి దేవి మన ఇంటికి వచ్చినప్పుడు పటేలా ముఖంలో ఆనందం చూసావా సత్య అందరి బిడ్డల్లా కాకుండా దేవిని సొంత బిడ్డలా చూసుకుంటాడు అని అనడంతో సత్య ఆలోచిస్తూ ఉంటుంది. అలా చూసుకోవడం తప్పు అని నేను అనడం లేదు సత్య(sathya) కానీ పట్టేలా దేవి మీద ప్రేమను చూపిస్తుంటే బిడ్డల కోసం ఎంత ఆరాటపడుతున్నాడో అర్థమవుతుంది అనడంతో సత్య బాధపడుతుంది.
అప్పుడు సత్య (sathya)కమల వెళ్లిపోయిన తర్వాత రుక్మిణి, ఆదిత్య పరిస్థితిల గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆఖరికి అసవత్తరంగా సాగుతూ ఉండగా అప్పుడు మాధవ రాద(radha)ను తన మాటలతో రెచ్చగొడతాడు. చివరిగా ఆటలో దేవి తెలుస్తుంది. దాంతో రాధ, ఆదిత్య సంతోష పడుతూ ఉంటారు. అది చూసి మాధవ కుళ్లుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత దేవి(devi) బహుమతిని ఆదిత్య చేతుల మీదుగా అందుకుంటుంది. అప్పుడు బహుమతి తీసుకుని ఆదిత్య గురించి గొప్పగా పొగుడుతుంది. అప్పుడు ఆదిత్య కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది చూసి మాధవ(madhava) కుళ్ళుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రాధ,ఆదిత్య పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు రాధ (radha)సంతోషంతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఎలా అయినా దేవి(devi)కి నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆదిత్య దేవి తన మనసులో ఏమనుకుంటుందో అని అనుకుంటూ ఉంటాడు. బిడ్డ కూడా నీకు దగ్గర కావాలి అని చూస్తోంది అని అనటంతో ఆదిత్య సంతోషపడతాడు.