- Home
- Entertainment
- Ennenno Janmala Bandam: వేదపై కుట్ర ప్లాన్ చేసిన అభిమన్యు.. ఖుషిని ఏడపించిన మాళవిక!
Ennenno Janmala Bandam: వేదపై కుట్ర ప్లాన్ చేసిన అభిమన్యు.. ఖుషిని ఏడపించిన మాళవిక!
Ennenno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ తండ్రీ కూతుర్ల మధ్య ఉన్న అనుబంధం అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

వేద యష్ (Yash) లు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం లో ఆనందంగా పాల్గొంటారు. ఇక ఈ క్రమంలో మాళవిక సూర్పణక లా అక్కడకి వస్తుంది. ఆ తర్వాత మాలిని సులోచన (Sulochana) లు ప్రసాదం పానకాలు గుడి లో వచ్చిన వారందరికీ ఆనందంగా పంచుతూ ఉంటారు. మరోవైపు ఇద్దరు వియ్యంకులు ఫన్నీ గా క్లాష్ అవుతూ ఉంటారు.
మరోవైపు అభిమన్యు (Abhimanyu) మాళవిక కు కాల్ చేసి చెప్పిన పని చేస్తున్నావా బంగారం అని అంటాడు. ఇక మాళవిక (Malavika) నువ్వు ధైర్యంగా ఉండు నిన్ను డిసప్పాయింట్ చెయ్యను అని అంటుంది. ఒకవైపు యష్ మాళవిక వచ్చినట్టు గ్రహించుకుంటాడు.
ఇక డైరెక్టుగా మాళవిక (Malavika) ఖుషి దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నావ్ ఖుషి (Khushi) అని అడుగుతుంది. దాంతో ఖుషి బాగానే ఉన్నాను అని చెబుతుంది. దాంతో మాళవిక రేపటి నుంచి ఇంకా బాగుంటావు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేస్తున్నావు కాబట్టి అని అంటుంది. ఇక ఖుషి నేను రాను అని భయపడుతూ అంటుంది.
అంతేకాకుండా ఒక గిఫ్టు ఖుషి (Khushi) కి ఇచ్చి అది మీ డాడీ కి ఇవ్వమని చెబుతుంది. ఆ లెటర్లో అభిమన్యు (Abhimanyu) పరాయి వాడి కూతుర్ని సొంత కూతురిలా వాడుకోవడం ఏంటి చండాలంగా అని రాస్తాడు. ఇక అది చదివి యష్ నోట మాటపడిపోతుంది. అంతే కాకుండా ఖుషి ను వదులుకో సోదరా ప్లీజ్ అని వెటకారంగా రాస్తాడు.
ఆ తరువాత ఖుషి (Khushi) డాడీ నేను మీ దగ్గరే ఉంటాను. నన్ను ఎక్కడికి పంపించ వద్దు అని యష్ (Yash) ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇక ఖుషి తన తండ్రి సరిగ్గా మాట్లాడడం లేదని మంచిగా మాట్లాడటం కోసం ఆంజనేయస్వామి చుట్టు వంద ప్రదర్శనాలు చేస్తుంది.
ఇక తరువాయి భాగం లో వేద (Vedha) డీఎన్ఏ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది ఇక ఖుషి తండ్రి మీరే అని యష్ కు చెబుతుంది. దాంతో యష్ (Yash) ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాడు. అంతే కాకుండా ఖుషి ను ప్రేమతో ఎత్తుకొని ముద్దు లాడుతాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.