MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో లియాండర్ పేస్ చక్కర్లు... హాట్ బ్యూటీతో మాజీ టెన్నిస్ స్టార్‌ డేటింగ్...

యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో లియాండర్ పేస్ చక్కర్లు... హాట్ బ్యూటీతో మాజీ టెన్నిస్ స్టార్‌ డేటింగ్...

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కిమ్ శర్మ మధ్య నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. పబ్లిక్‌గా చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట, 2007లో విడిపోయారు. ఇప్పుడు యువీ మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ కిమ్ శర్మతో మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 03 2021, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

తెలుగులో ‘ఖడ్గం’, ‘యాగం’ వంటి సినిమాల్లో నటించిన కిమ్ శర్మతో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశాడు యువరాజ్ సింగ్. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
212

యువీ తల్లిదండ్రులతో కూడా కిమ్ శర్మ చనువుగా ఉండడంతో వీరి పెళ్లి ఖాయమనుకున్నారంతా. అయితే ఏమైందో ఏమో వీరిద్దరికీ 2007లో బ్రేకప్ అయిపోయింది...

312

మూడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న కిమ్ శర్మ, ఆ తర్వాత కెన్యా బిజినెస్‌మ్యాన్ అలీ పుంజానీని పెళ్లాడింది. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు...

412

కిమ్‌శర్మను ఆర్థికంగా కూడా వాడుకున్న అలీ పుంజనీ, ఆమెను అన్నివిధాలుగా దెబ్బతీశాడు. దీంతో 2016లో అతనితో విడాకులు తీసుకుంది కిమ్ శర్మ...

512

కిమ్‌శర్మ విడాకులు తీసుకున్న సమయంలోనే ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ యువరాజ్ సింగ్, హీరోయిన్ హజెల్ కీచ్‌ను పెళ్లాడడం విశేషం...

612

అలీతో విడాకులు తీసుకున్న తర్వాత కిమ్ శర్మ... అర్జున్‌ రాంపాల్, హర్షవర్థన్ రాణేలతో డేటింగ్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి టెన్నిస్ మాజీ ప్లేయర్ లియాండర్ పేస్ వచ్చాడు...

712

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన చివరి భారత టెన్నిస్ ప్లేయర్‌గా ఉన్న లియాండర్ పేస్, ఇప్పటికే ముగ్గురు హీరోయిన్‌లతో ప్రేమాయణం నడిపాడు...

812

‘పర్‌దేశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ హీరోయిన్ మహీమా చౌదరితో 2000 నుంచి 2003 దాకా డేటింగ్ నడిపించాడు లియాండర్ పేస్. అయితే వీరి బంధం మూడేళ్లలోనే వీగిపోయింది..

912

ఆ తర్వాత సంజయ్ దత్ మాజీ భార్య రియా పిల్లాయ్‌తో లియాండర్ పేస్‌కి అనుబంధం కుదిరింది. 2005 నుంచి 9 ఏళ్ల పాటు ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్ కారణంగా ఈ ఇద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది...

1012

అయితే 2014లో రియాతో కూడా విడిపోయాడు లియాండర్ పేస్. ఏడేళ్ల పాటు ఒంటరిగా ఉన్న లియాండర్ పేస్ 48 ఏళ్ల వయసులో 41 ఏళ్ల కిమ్ శర్మతో డేటింగ్ నడిపిస్తున్నారు...

1112

గోవాలోని రెస్టారెంట్లలో కలిసి ఆరగిస్తూ, బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ, రిస్టార్లలో తిరుగుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, రచ్చ చేసిన ఈ జోడీ... తాజాగా ముంబై వీధుల్లో పెంపుడు కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్తూ కనిపించింది.

1212

లేటు వయసులో ఘాటుగా మొదలైన ఈ భగ్న ప్రేమికుల జోడీ అయినా చిరకాలం కలిసి ఉంటారా? లేక మళ్లీ ఓ మూడు, నాలుగేళ్లకు కొత్త జోడీని వెతుక్కుంటూ వెళ్లిపోతారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL హిస్టరీలో ఎక్కువ సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన టాప్ 5 ప్లేయర్స్ వీరే
Recommended image2
Virat Kohli : రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ డైట్, ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved