MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • వొడువని ముచ్చట.. పంత్‌‌కు రాఖీ విషెస్ చెప్పి అతడి కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

వొడువని ముచ్చట.. పంత్‌‌కు రాఖీ విషెస్ చెప్పి అతడి కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

Rishabh Pant-Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ల మధ్య మొదలైన ఇన్‌స్టాగ్రామ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ మాజీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

2 Min read
Author : Srinivas M
Published : Aug 12 2022, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇన్స్టాగ్రామ్ స్టోరీకి  ఊర్వశి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాను  నోరు మూసుకుని ఉన్నానని, దానిని అలుసుగా తీసుకోవద్దని  స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.  అంతేగాక రిషభ్ పంత్ కు రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా చెప్పింది. తాను ఎవరిని బద్నాం చేయలేదని, అంత ఖర్మ తనకేం పట్టలేదని పేర్కొంది. చూస్తుంటే వీళ్లిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పట్లో ముగిసేలా లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇటీవల ఊర్వశి.. ఓ ఇంటర్వ్యూలో తనకు రిషభ్ పంత్ కు ఎలా బ్రేకప్ అయిన విషయాన్ని బయటపెట్టింది. పంత్ పేరు ఎత్తకుండా అతడిని ఆర్‌పీ అని సంబోధిస్తూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

38

ఆమె స్పందిస్తూ.. ‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నా.. అక్కడి నుంచి న్యూఢిల్లీలో ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చా. న్యూఢిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా... మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను (మిస్టర్ ఆర్‌పీ) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కి వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. నేను 10 నిమిషాల ముందే షూటింగ్‌ నుంచి వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా...

48

అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు.అప్పుడు నాకు ఫోన్ వచ్చింది కానీ ఆ రింగ్ కూడా నాకు వినిపించలేదు. అంతలా అలిసిపోయి మత్తుగా పడుకున్నా. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను...

58

చెప్పినట్టే ముంబైకి వచ్చినప్పుడు కలిశాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అది అక్కడితో తెగిపోయింది. దానిపై మీడియా రకరకాలుగా రాసుకొచ్చింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య బంధం పెరగకుండానే చెడిపోయింది...’ అంటూ కామెంట్ చేసింది ఊర్వశి. 

68

ఆమె ఇంటర్వ్యూ తర్వాత  రిషభ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా.. ‘కొందరు పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడేవారిని వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది... వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి... ’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్టు చేశాడు. 

78

ఇక తాజాగా  ఊర్వశి.. ‘చోటు భయ్యా బ్యాట్ బాల్ ఆడాలి. నేనేం నిన్ను బద్నాం చేయలేదు. రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్‌పీ చోటు భయ్యా. అమ్మాయి మౌనంగా ఉందని అడ్వాంటేజ్ తీసుకోకు..’ అని పోస్ట్ పెట్టింది. ఇంటర్వ్యూ మాదిరిగానే ఇక్కడ కూడా రిషభ్ పేరు ఎత్తకుండానే  ఆర్‌పీ అని సంబోధిస్తూ  పంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.  

88

మరి వీళ్లిద్దరి మధ్య ఈ సోషల్ మీడియా వార్ ఎంతకాలం కొనసాగుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది.  ఊర్వశికి పంత్ కౌంటర్ ఇస్తాడా..? ఇవ్వడా..? అని ఈ ఇద్దరిని ఫాలో అయ్యేవారు గుసగుసలాడుకుంటున్నారు. మరి పంత్ ఎలా స్పందిస్తాడో...?

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Recommended image2
దంచుడే.. దంచుడు.. 30 బంతుల్లోనే సెంచ‌రీతో అభిషేక్ శర్మ విధ్వంసం
Recommended image3
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved