MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • Tilak Varma: నేను ఆడేది దేశం కోసం.. విమర్శకులకు తిలక్ వర్మ మాస్ కౌంటర్

Tilak Varma: నేను ఆడేది దేశం కోసం.. విమర్శకులకు తిలక్ వర్మ మాస్ కౌంటర్

Tilak Varma: జింబాబ్వే సిరీస్‌కు ముందు తన స్లో బ్యాటింగ్‌పై వచ్చిన విమర్శలపై టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను దేశం కోసం ఆడుతున్నాననీ, జట్టు పరిస్థితులే ముఖ్యమని వెల్లడించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 10:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తొలి బంతికే సిక్స్ కొట్టాలా? స్లో బ్యాటింగ్ ట్రోల్స్‌పై తిలక్ వర్మ ఫైర్
Image Credit : ANI

తొలి బంతికే సిక్స్ కొట్టాలా? స్లో బ్యాటింగ్ ట్రోల్స్‌పై తిలక్ వర్మ ఫైర్

జూలై 23 నుంచి భారత్, జింబాబ్వే మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ముఖ్యమైన సిరీస్ మొదలయ్యే ముందు టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తన స్లో బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో తన బ్యాటింగ్ శైలి నెమ్మదిగా ఉండటానికి గల అసలు కారణాలను ఆయన స్పష్టం చేశారు. క్రీజులోకి రాగానే తొలి బంతి నుంచే సిక్సర్లు కొట్టడం సాధ్యం కాదని చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూకే పర్యటనలో నిరాశపరిచిన ఫలితాలు
Image Credit : Getty

యూకే పర్యటనలో నిరాశపరిచిన ఫలితాలు

ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో రన్స్ చేసినప్పటికీ, స్పిన్నర్ల ఎదుట తిలక్ వర్మ ఇబ్బంది పడ్డారని, నెమ్మదిగా ఆడారని విమర్శలు వచ్చాయి. యుకే పర్యటనలో భారత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన భారత్ ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లాండ్‌తో 0-4 తేడాతో సిరీస్‌లను కోల్పోయింది. మొత్తం 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, ఒక్కటి వర్షం వల్ల రద్దయింది.

Related Articles

Related image1
Ferran Torres: మెస్సీ కలని ముంచేసిన కుర్రాడు.. ఎవరీ ఫెర్రాన్ టోర్రెస్? ఇండియాతో ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి?
Related image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
35
జాతీయ జట్టు బాధ్యతలపై స్పష్టత
Image Credit : Getty

జాతీయ జట్టు బాధ్యతలపై స్పష్టత

జింబాబ్వే సిరీస్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తిలక్ వర్మ తన శైలిని సమర్థించుకున్నారు. "ఈ గేమ్‌లో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కష్టమైన పరిస్థితుల్లో అది అంత తేలిక కాదు. జట్టుకు నేను క్రీజులో నిలదొక్కుకోవడం అవసరమైతే అదే చేస్తాను. ఒకవేళ మొదటి బంతి నుంచే అటాకింగ్ ఆడాలని మేనేజ్‌మెంట్ కోరితే దానికి కూడా సిద్ధంగా ఉంటాను" అని అన్నారు.

45
ప్రతికూల పరిస్థితుల్లో వ్యూహాత్మక ఆట
Image Credit : X/BCCI

ప్రతికూల పరిస్థితుల్లో వ్యూహాత్మక ఆట

యూకే పర్యటనలో ఎదురైన సవాళ్లను తిలక్ గుర్తుచేసుకున్నారు. "ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్ వరకు మా జట్టు 4 లేదా 5 వికెట్లను పవర్‌ప్లేలోనే లేదా తొలి 10 ఓవర్లలోనే కోల్పోయింది. అటువంటి సమయంలో క్రీజులోకి వెళ్లి వేగంగా రన్స్ చేసే క్రమంలో వికెట్ పారేసుకోవడం తెలివైన పని కాదు. నేను నా దేశం కోసం ఆడుతున్నాను. నాపై చాలా బాధ్యతలు ఉన్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు పరిస్థితిని బట్టే ఆడాలి" అని వివరించారు.

55
జింబాబ్వే సిరీస్‌పై ధీమా
Image Credit : Getty

జింబాబ్వే సిరీస్‌పై ధీమా

జింబాబ్వే సిరీస్ పట్ల తిలక్ వర్మ చాలా పాజిటివ్‌గా ఉన్నారు. ఈ యూకే పర్యటనలో తిలక్ వర్మ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి 178 రన్స్ చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌పై చేసిన 55 రన్స్ ఆయన అత్యధిక స్కోరు. "గత పర్యటన నుంచి మేం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మా బేసిక్స్ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నాం. టీమ్‌లో అందరూ డొమెస్టిక్, 'ఎ' సిరీస్ క్రికెట్ బాగా ఆడారు, కాబట్టి పెద్ద స్టేజ్ లపై రాణించడానికి రెడీగా ఉన్నారు" అని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
Ferran Torres: మెస్సీ కలని ముంచేసిన కుర్రాడు.. ఎవరీ ఫెర్రాన్ టోర్రెస్? ఇండియాతో ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి?
Recommended image2
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved