MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం

ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం

ICC Rankings: టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా టాప్ ప్లేస్ కోల్పోయాడు. బంగ్లాదేశ్‌పై విజృంభించిన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కొత్త నంబర్ 1 బౌలర్ గా నిలిచాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 26 2026, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గాయం ఒకవైపు.. ర్యాంక్ పతనం మరోవైపు: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్
Image Credit : Getty

గాయం ఒకవైపు.. ర్యాంక్ పతనం మరోవైపు: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. చాలా కాలంగా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న బుమ్రా తన నంబర్ 1 స్థానాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనతో బుమ్రాను వెనక్కి నెట్టి, తన కెరీర్‌లో తొలిసారిగా వరల్డ్ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా అవతరించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌కు గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. మెకేలో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు భారీ విజయాన్ని అందించాడు. దీంతో బుమ్రాను దాటుకుని స్టార్క్ 872 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్క్ దెబ్బకు మారిన బౌలింగ్ ర్యాంకింగ్స్
Image Credit : Getty

స్టార్క్ దెబ్బకు మారిన బౌలింగ్ ర్యాంకింగ్స్

మిచెల్ స్టార్క్ తన 15 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులకు 4 వికెట్లు తీసి రచ్చ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుతం 862 పాయింట్లతో బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ 861 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 841 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరగా, సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ 825 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-10 లోకి ప్రవేశించాడు.

35
బుమ్రా రికార్డ్స్ ఇవే
Image Credit : AFP

బుమ్రా రికార్డ్స్ ఇవే

ఫిబ్రవరి 2024 నుంచి బుమ్రా టెస్టుల్లో నంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రెండు పాయింట్లు తగ్గడంతో రెండో స్థానానికి పడిపోయినప్పటికీ, బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు ఉంది. టెస్టుల్లో ఓవరాల్‌గా 697 రోజులు నంబర్ 1 స్థానంలో ఉన్న భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో అత్యధిక రోజులు టాప్‌లో ఉన్న బౌలర్ల జాబితాలో 14వ స్థానంలో నిలిచాడు.

ఇతర బౌలర్ల విషయానికి వస్తే, పాకిస్తాన్‌పై 8 వికెట్లతో మెరిసిన ఇంగ్లాండ్ పేసర్లు ఆలీ రాబిన్సన్ 15 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 17వ ర్యాంక్‌కు చేరారు. శ్రీలంక బౌలర్లు అసిథ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య ఐదేసి స్థానాలు పెంచుకుని వరుసగా 15, 16 ర్యాంకుల్లో నిలిచారు. గాలే టెస్టులో 10 వికెట్లు తీసిన భారత యువ బౌలర్ మానవ్ సుతార్ 28 స్థానాలు ఎగబాకి 48వ ర్యాంక్ సాధించాడు.

45
బ్యాటింగ్ విభాగంలో హెన్రీ బ్రూక్ టాప్
Image Credit : Getty

బ్యాటింగ్ విభాగంలో హెన్రీ బ్రూక్ టాప్

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జో రూట్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా జోడీ స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో మెరుపు అర్ధశతకం సాధించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆరు స్థానాలు ఎగబాకి మళ్లీ టాప్-10 లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం పంత్ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. గాలే టెస్టులో తక్కువ పరుగులకే అవుటైన యశస్వి జైస్వాల్, కమిందు మెండిస్ టాప్-10 నుంచి అవుట్ అయ్యారు. ఆసీస్ ఆల్‌రౌండర్ గ్రీన్ (21వ ర్యాంక్), కేఎల్ రాహుల్ (30వ ర్యాంక్) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

55
ఆల్‌రౌండర్లలో జడేజానే రాజా
Image Credit : ANI

ఆల్‌రౌండర్లలో జడేజానే రాజా

టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా తన నంబర్ 1 ర్యాంక్‌ను పదిలంగా ఉంచుకున్నాడు. ఈ విభాగంలో ఏ మార్పులూ లేకపోవడంతో జడేజా టాప్‌లోనే కొనసాగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ ఏడో స్థానానికి, గ్రీన్ 17వ స్థానానికి, రాబిన్సన్ 23వ స్థానానికి స్వల్పంగా ఎగబాకారు. ప్రస్తుతం శ్రీలంక సిరీస్‌లో భారత్ శుభారంభం చేసినప్పటికీ, బుమ్రా నంబర్ 1 స్థానం కోల్పోవడం ఇండియన్ క్రికెట్ అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image2
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved