MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?

IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?

India vs Sri Lanka : కొలంబో జరిగిన భారత్ వర్సెస్ శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతూ చివరకు డ్రాగా ముగిసింది. పరాజయం ఖాయమనుకున్న దశలో శ్రీలంక యంగ్ బ్యాటర్ సోనాల్ దినూష అద్భుత పోరాటపటిమ చూపిస్తూ అజేయ సెంచరీతో మెరిశాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
29 ఏళ్ల రికార్డును సమం చేసిన లంక యంగ్ ప్లేయర్
Image Credit : X/BCCI

29 ఏళ్ల రికార్డును సమం చేసిన లంక యంగ్ ప్లేయర్

మరోసారి శ్రీలంక యంగ్ ప్లేయర్ సోనాల్ దినూష తన క్లాస్ చూపించాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దినూష సూపర్ నాక్ ఆడాడు. టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ, మ్యాచ్‌ను ఓటమి నుంచి రక్షించడంలోనూ అతను కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల వెనుకంజలో పడి ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 154 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి 429/9 వద్ద డిక్లేర్ చేసింది. దీనితో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి టెస్టు గెలిచిన భారత్ 1-0తో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రీలంక పోరాటంలో దినూష మారాథాన్ ఇన్నింగ్స్
Image Credit : ANI

శ్రీలంక పోరాటంలో దినూష మారాథాన్ ఇన్నింగ్స్

అయిదో రోజు ఆటలో శ్రీలంక జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. ఈ దశలో 25 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సోనాల్ దినూష మైదానంలో పట్టుదలతో నిలబడ్డాడు. 264 బంతుల్లో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ విరామం తర్వాత మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే మిడ్ వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ సిరీస్‌లో దినూషకు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆఖరి వికెట్‌కు అసిథ ఫెర్నాండోతో కలిసి 27 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

Related Articles

Related image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Related image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
35
అలసిపోయిన భారత బౌలర్లు.. కెప్టెన్ గిల్ బౌలింగ్
Image Credit : ANI

అలసిపోయిన భారత బౌలర్లు.. కెప్టెన్ గిల్ బౌలింగ్

కొలంబో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం, వికెట్ పడకపోవడంతో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మహమ్మద్ సిరాజ్ చిన్నపాటి గాయంతో ఇబ్బంది పడగా, రవీంద్ర జడేజా కూడా అలసిపోయాడు. శ్రీలంక లోయర్ ఆర్డర్ వికెట్ తీయడం కష్టంగా మారడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. లంక టైలాండర్ లహిరు కుమార 90 బంతుల్లో 12 పరుగులు చేసి జడేజా బౌలింగ్ జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

45
29 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును సమం చేసిన దినూష
Image Credit : ANI

29 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును సమం చేసిన దినూష

ఒకే టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా దినూష రికార్డు సృష్టించాడు. భారత్‌పై ఈ ఘనత సాధించిన శ్రీలంక క్రికెటర్లలో దులీప్ మెండిస్ (1982), అరవింద డి సిల్వా (1997) తర్వాత దినూష మాత్రమే ఉన్నాడు. అంటే సరిగ్గా 29 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక శ్రీలంక ఆటగాడు భారత్‌పై ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేశాడు. మొత్తం మీద టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన 8వ శ్రీలంక బ్యాటర్‌గా అతను నిలిచాడు.

55
సచిన్ టెండూల్కర్‌తో పోల్చిన రాజీవ్ శుక్లా
Image Credit : X/ICC

సచిన్ టెండూల్కర్‌తో పోల్చిన రాజీవ్ శుక్లా

ఈ సిరీస్‌లోని 4 ఇన్నింగ్స్‌ల్లోనూ దినూష 50కి పైగా పరుగులు (100, 84, 103, 133 నాటౌట్) సాధించాడు. భారత్‌పై తన కెరీర్ మొదటి 4 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 50+ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. ఇతని ఆటతీరు చూసి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోషల్ మీడియా ఎక్స్ లో ప్రశంసలు కురిపించారు. "దినూష ఆడుతుంటే సచిన్ టెండూల్కర్‌ను చూసినట్లుగా ఉంది. ఇతను అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో గొప్ప ప్లేయర్ అవుతాడు" అని కొనియాడారు.

సంక్షిప్త స్కోర్లు

• భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్ (138 ఓవర్లు)

• శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290

• శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలో ఆన్): 429/9 డిక్లేర్డ్ (154 ఓవర్లు) - (సోనాల్ దినూష 133 నాటౌట్, పసిందు సూర్యబండార 92; మానవ్ సుతార్ 3-105, రవీంద్ర జడేజా 3-94)

• ఫలితం: మ్యాచ్ డ్రా (భారత్ 1-0తో సిరీస్ విజేత)

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved