MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate: తులం బంగారం రూ.15 లక్షలు అవుతుందా? గోల్డ్ లవర్స్‌కు షాక్!

Gold Rate: తులం బంగారం రూ.15 లక్షలు అవుతుందా? గోల్డ్ లవర్స్‌కు షాక్!

Gold Rate: బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కానీ తులం బంగారం 15 లక్షల రూపాయలు అయ్యే ఛాన్స్ ఉందంట. ఇప్పుడున్న ధరతో పోలిస్తే ఏకంగా 10 రెట్లు పెరిగే ఛాన్స్.. ఎప్పుడు ఆ రేటుకు చేరుతుందో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 30 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తులం బంగారం 15లక్షలు?
Image Credit : Chat gpt

తులం బంగారం 15లక్షలు?

బంగారం ధరలు భారీగా పెరుగుతున్న రోజులు ఇవి. తులం వస్తువులు కొనాలంటే రెండు లక్షల రూపాయల ఖర్చు పెట్టాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనేవాళ్లు ఒకవైపు ఉంటే.. భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందని పెట్టుబడిగా కొనేవాళ్లు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారికి షాకయ్యే విషయం బయటికి వచ్చింది. బంగారం భవిష్యత్తు ధరపై ఓ బిలియనీర్ భారీ అంచనా వేశారు. ఎలెక్ట్రమ్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ బంగారం పెట్టుబడిదారు థామస్ కాప్లాన్ ప్రకారం.. భవిష్యత్తులో బంగారం ధర ఏకంగా పది రెట్లు పెరగొచ్చు. అంటే భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.15 లక్షలకు చేరే అవకాశం ఉందన ఆయన వేసిన లెక్కలు చెబుతున్నాయి. అంటే ఈరోజు ఒక తులం బంగారం కొనడానికి అయ్యే డబ్బుతో భవిష్యత్తులో చాలా తక్కువ బంగారమే వచ్చే పరిస్థితి రావచ్చన్నమాట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బంగారం ధర పడిపోతోంది కదా
Image Credit : Pixabay

బంగారం ధర పడిపోతోంది కదా

ఇటీవల బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించడంతో చాలామందిలో ఇదే సందేహం మొదలైంది. ఇంతకాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇక తగ్గుతాయా? అనే చర్చ మొదలైంది. కానీ థామస్ కాప్లాన్ మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధర తగ్గుదలను పట్టించుకోవద్దని అంటున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. బంగారం మరో పది రెట్లు పెరగడం తప్పదట. అయితే సమీప కాలంలో బంగారం ధర ఏ దిశలో వెళ్తుందో మాత్రం తనకు ఖచ్చితంగా తెలియదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే రేపు లేదా వచ్చే నెలలో ధర తప్పకుండా పెరుగుతుందని ఆయన చెప్పడం లేదు. ఆయన అంచనా ప్రధానంగా మధ్య, దీర్ఘకాలిక పరిస్థితులపై ఆధారపడి ఉంది.

33
రూ.15 లక్షల బంగారం నిజంగానే సాధ్యమా?
Image Credit : Pixabay

రూ.15 లక్షల బంగారం నిజంగానే సాధ్యమా?

బంగారం 10 గ్రాములకు రూ.15 లక్షలు అవుతుందనే మాట వినగానే ఎంతోమందకి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే బంగారం ధరను ఒక్క అంశం మాత్రమే నిర్ణయించదు. అంతర్జాతీయ బంగారం ధర, డాలర్‌తో రూపాయి విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ఒక వ్యక్తి చేసిన అంచనాను భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే ధరగా చూడటం సరైంది కాదు. ప్రస్తుతం కాప్లాన్ చెప్పింది ఏమిటంటే.. బంగారంపై దీర్ఘకాలికంగా తనకు చాలా బలమైన నమ్మకం ఉందని మాత్రమే. ఒకవేళ ఆయన చెప్పిన అంచనా నిజమైతే మాత్రం, భారత మార్కెట్లో బంగారం ధర ఊహించని స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఈరోజు బంగారం కొంటున్న వారి దగ్గర ఉన్న పసిడి విలువ భారీగా పెరగొచ్చు. అయితే ధరలు పెరుగుతాయని ఆశించి ఎవరైనా తమ మొత్తం డబ్బును బంగారంలో పెట్టుబడి పెట్టడం మాత్రం సరైన నిర్ణయం కాదు. బంగారానికి రూ.15 లక్షల ధర ఎప్పుడు వస్తుంది? అసలు వస్తుందా? అనేది మాత్రం భవిష్యత్తే నిర్ణయించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
Youtube: యూట్యూబ్‌ను శాశ్వతంగా నిషేధించిన 4 దేశాలు ఇవే.. ఎందుకు బ్యాన్ చేశారో తెలుసా?
Recommended image2
Gold: నోటిలో 82 గ్రాముల బంగారాన్ని దాచేశాడు... అయినా దొరికిపోయాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved