MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • IRCTC: భక్తులకు 9 రోజుల ఆధ్యాత్మిక టూర్... ఒక్క ప్యాకేజీలో 4 పవిత్ర క్షేత్రాల యాత్ర, IRCTC అదిరే ప్యాకేజీ

IRCTC: భక్తులకు 9 రోజుల ఆధ్యాత్మిక టూర్... ఒక్క ప్యాకేజీలో 4 పవిత్ర క్షేత్రాల యాత్ర, IRCTC అదిరే ప్యాకేజీ

IRCTC: కాశీ ? విశ్వనాథుడి దర్శనం, అయోధ్యలో శ్రీరాముడి ఆశీర్వాదం...ప్రయాగ్‍రాజ్‍లో త్రివేణి సంగమ స్నానం..ఇవన్నీ ఒకే యాత్రలో చేయాలనుకుంటున్నారా? భక్తుల కోసం IRCTC ప్రత్యేకంగా కాశీ తీర్థయాత్ర ప్యాకేజీ ప్రకటించింది. వాటి విశేషాలు చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 20 2026, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆధ్యాత్మిక యాత్రలు చేసే భక్తులకు గుడ్ న్యూస్
Image Credit : chatgpt

ఆధ్యాత్మిక యాత్రలు చేసే భక్తులకు గుడ్ న్యూస్

ఆధ్యాత్మిక యాత్రలు చేయాలకునే భక్తులకు IRCTC మరో మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. కాశీ, గయ, అయోధ్య, ప్రయాగ్‍రాజ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే ట్రిప్‍లో దర్శించేలా 9 రోజుల కాశీ యాత్రను ప్రకటించింది. ఈ యాత్ర కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సెప్టెంబర్ 9 న తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి బయలుదేరుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు గూడూరు లేదా విజయవాడ జంక్షన్ నుంచి ఈ రైలు ఎక్కొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యాత్ర ఎలా సాగుతుంది?
Image Credit : chatgpt

యాత్ర ఎలా సాగుతుంది?

సెప్టెంర్ 9న ఉదయం తిరునల్వేలి నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఉత్తర భారత పుణ్యక్షేత్రాల వైపు రైలు ప్రయాణం కొనసాగుతుంది. మూడో రోజు బిహార్‍లోని గయ చేరుకున్న తర్వాత ముందుగా బుక్ చేసిన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తారు. విశ్రాంతి అనతంరం ప్రపంచ ప్రఖ్యాత మహాబోధి ఆలయం దర్శనం ఉంటుంది.

35
గంగా హారతిను వీక్షించే అవకాశం
Image Credit : chatgpt

గంగా హారతిను వీక్షించే అవకాశం

నాలుగోరోజు ఉదయం విష్ణుపాద ఆలయం పితృకార్యాలు, పిండ ప్రదానం, తర్పణం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. అనంతరం వారణాసి వైపు ప్రయాణం కొనసాగుతుంది. ఐదో రోజు పూర్తిగా కాశీ దర్శనానికి కేటాయించారు. ఈ సందర్భంగా కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ అమ్మవారి ఆలయం, విశాలాక్షి దేవి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయంలను సందర్శిస్తారు. సాయంత్రం గంగా నదీ తీరంలో జరిగే ప్రసిద్ధ గంగా హారతిను వీక్షించే అవకాశం కూడా ఉంటుంది.

45
ప్రతి బడ్జెట్‍కు తగ్గట్టుగా మూడు విభాగాల్లో ఈ ప్యాకేజీ
Image Credit : X

ప్రతి బడ్జెట్‍కు తగ్గట్టుగా మూడు విభాగాల్లో ఈ ప్యాకేజీ

ఆరో రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకుని భవ్యమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో స్వామివారి దర్శనం చేసుకుంటారు. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత రాత్రికి ప్రయాగ్ రాజ్ వైపు వెళ్తారు. ఏడో రోజు ప్రయాగ్‍రాజ్ త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేసి సమీపంలోని ప్రముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎనిమిదో రోజు రాత్రికి విజయవాడ చేరుకుంటారు. తొమ్మిదో రోజు నెల్వేలి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్రతి బడ్జెట్‍కు తగ్గట్టుగా మూడు విభాగాల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఎకానమీ స్లీపర్ క్లాస్..ఒక్కోవ్యక్తికి రూ.16,900. నాన్-ఏసీ గదుల్లో బస ఏర్పాటు ఉంటుంది. స్టాండర్డ్ 3 ఏసీ ఒక్కో వ్యక్తికి రూ. 31,000. ఇద్దరు లేదా ముగ్గురు షేరింగ్ ఏసీ గదులు ఉంటాయి. కంఫర్ట్ 2 ఏసీ ఒక్కో వ్యక్తికి రూ.43,500. మరింత సౌకర్యవంతమైన ఏసీ వసతి కల్పిస్తారు.

55
ప్యాకేజీలో ఏమేమీ ఉంటాయి?
Image Credit : AI

ప్యాకేజీలో ఏమేమీ ఉంటాయి?

ఈ టూర్‍లో ప్రయాణంతో పాటు వసతి, ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి పూర్తి శాకాహార భోజన సదుపాయం ఉంటుంది. పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం అవసరమైన వాహనాలను కూడా IRCTC ఏర్పాటు చేస్తుంది. యాత్రికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు టూర్ మేనేజర్ల సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఆలయాలు లేదా పర్యాట ప్రదేశాల్లో ప్రత్యేక ప్రవేశ రుసుములు, వ్యక్తిగత ఖర్చలు, అదనపు సౌకర్యాలకు సంబంధించిన వ్యయాలను యాత్రికుల భరించాల్సి ఉంటుంది. 

కాశీ, గయ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి పవిత్ర క్షేత్రాలను తక్కువ ఖర్చుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించాలనుకునే వారికి ఈ IRCTC కాశీ తీర్ఠయాత్ర మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు, సీట్లు, బుకింగ్ కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ సందర్శించవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image2
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image3
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Related Stories
Recommended image1
Toyota Fortuner 2026: కొత్త ఫార్చ్యూనర్ ఫస్ట్ లుక్.. నెక్స్ట్ జనరేషన్‍లో అదిరే ఫీచర్లు
Recommended image2
Clothing Sizes: రోజూ చూస్తాం కానీ అర్థం తెలియదు.. బట్టల సైజుల్లో ఉండే ఈ 'X' మీనింగ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved